స‌ముద్ర‌పు ఉప్పు క‌న్నా ఈ ఉప్పు మ‌న శ‌రీరానికి ఎంతో మంచి చేస్తుంద‌ట. అదేంటో తెలుసా..?

ఉప్పు అంటే.. ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఉప్పు అలాంటి ఇలాంటి ఉప్పు కాదండోయ్‌. హిమాల‌య‌న్ ఉప్పు. అంటే హిమాల‌య‌న్ అనే కంపెనీ త‌యారు చేసిన ఉప్పు మాత్రం కాదు. హిమాల‌య ప‌ర్వ‌తాల్లో మాత్ర‌మే దొరికే ఓ ర‌క‌మైన, ప్ర‌త్యేక‌మైన ఉప్పు అది. సాధార‌ణ స‌ముద్ర‌పు ఉప్పు క‌న్నా ఎన్నో వంద‌ల రెట్లు క్వాలిటీ క‌లిగి ఉంటుంది. అంతేకాదు, స‌ముద్ర‌పు ఉప్పు ఎక్కువగా వాడితే మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి క‌దా, అయితే ఈ హిమాల‌య‌న్ ఉప్పు వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. ఈ క్ర‌మంలో మ‌న‌కు హిమాల‌య‌న్ ఉప్పు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుందో, దాని వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. హిమాల‌య‌న్ ఉప్పులో స‌హ‌జ సిద్ధ‌మైన అయోడిన్ ఉంటుంది. ఇది మ‌న‌కు ఎంత‌గానో అవ‌స‌రం. థైరాయిడ్‌, గొంతు సంబంధ వ్యాధులు రాకుండా ఉండేందుకు అయోడిన్ ఉప‌యోగ‌ప‌డుతుంది. కానీ స‌ముద్ర‌పు ఉప్పులో కృత్రిమంగా అయోడిన్ క‌లుపుతారు. క‌నుక అది మ‌న‌కు మంచిది కాదు.

2. స‌ల్ఫేట్‌, మెగ్నిషియం, కాల్షియం, పొటాషియం, బైకార్బ‌నేట్‌, బ్రోమైడ్‌, బోరేట్‌, స్ట్రాంటియం వంటి దాదాపు 80కి పైగా విశిష్ట‌మైన మిన‌ర‌ల్స్ హిమాల‌య‌న్ సాల్ట్‌లో ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌రం. ఇవి గుండె జ‌బ్బులు రాకుండా చూస్తాయి.

3. హిమాల‌యన్ ఉప్పును నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో శ‌రీరంలో ఎల‌క్ట్రోలైట్ బ్యాలెన్స్ పెరుగుతుంది. త‌ద్వారా ద్ర‌వాలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. శ‌రీరం ఎల్ల‌ప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఎండ దెబ్బ కొట్టేందుకు అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంది.

4. శ‌రీరంలో ఎల్ల‌ప్పుడూ ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉండ‌డం వ‌ల్ల విష ప‌దార్థాలు అన్నీ బ‌య‌టికి వెళ్లిపోతుంటాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రం అవుతుంది.

5. స‌హ‌జ సిద్ధ‌మైన ఆల్క‌లైన్ గుణాలు ఉండ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో గ్యాస్, అసిడిటీ వంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కాకుండా ఉంటాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

6. కండ‌రాలు ప‌ట్టేయ‌కుండా ఉంటాయి. శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. త‌ద్వారా క్యాల‌రీలు అధికంగా ఖ‌ర్చ‌యి బ‌రువు త‌గ్గుతారు.

7. ఎముక‌లు కాల్షియం అందుతుంది. త‌ద్వారా అవి ప‌టిష్టంగా మారుతాయి. విరిగిన ఎముక‌లు ఉన్న‌వారు ఈ ఉప్పును వాడితే త్వ‌ర‌గా ఎముక‌లు అతుక్కునేందుకు అవ‌కాశం ఉంటుంది.

8. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె స‌మ‌స్య‌లు రావు.

9. పేగులు ఆహార ప‌దార్థాల్లో ఉండే పోష‌కాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా గ్ర‌హిస్తాయి. దీంతో శ‌రీరానికి పోష‌కాహార లోప స‌మ‌స్య ఉండ‌దు.

10. శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. స్త్రీల‌లో రుతు సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.

అయితే ఈ హిమాల‌య‌న్ సాల్ట్‌ను సాధార‌ణ ఉప్పులా ఎక్కువ వాడాల్సిన ప‌నిలేదు. సాధార‌ణ ఉప్పును మ‌నం ఒక టీస్పూన్ వాడే బ‌దులు అందులో 1/4 వంతు హిమాల‌య‌న్ సాల్ట్‌ను వంట‌ల్లో వాడితే చాలు. దీంతో పైన చెప్పిన ఫ‌లితాలు క‌లుగుతాయి. అయితే మ‌న‌కు హిమాల‌య‌న్ సాల్ట్ దొరుకుతుందా..? అంటే.. అవును, దొరుకుతుంది. సూప‌ర్ మార్కెట్ల‌లో దీన్ని అమ్ముతున్నారు. ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ ఉప్పును కొన‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top