వాట్సాప్ లో ఆ ఫీచ‌ర్ లేదు. హైక్‌లో కొత్త‌గా వ‌చ్చింది. అది ఏం ఫీచ‌రో తెలుసా..?

హైక్ (hike). ఇదొక ఇన్‌స్టంట్ మెసెంజ‌ర్ యాప్. వాట్సాప్ లాంటి ఫీచ‌ర్ల‌నే ఇది కలిగి ఉంది. అయిన‌ప్ప‌టికీ వాట్సాప్ అంత స్థాయిలో ఈ యాప్‌ను వాడేవారు త‌క్కువ‌. కానీ ఇప్పుడిప్పుడే ఈ యాప్ కూడా వాట్సాప్‌కు పోటీనిస్తోంది. కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెడుతూ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. నిజానికి వాట్సాప్ మ‌న దేశానికి చెందిన‌ది కాదు. హైక్ మాత్ర‌మే దేశీయ ఇన్‌స్టంట్ మెసెంజ‌ర్ యాప్‌. అయితే ఇప్పుడీ యాప్‌లో కొత్త‌గా ఓ ఫీచ‌ర్ వ‌చ్చింది. వాట్సాప్‌లో కూడా లేదు. ఇంత‌కీ ఏంటా ఫీచ‌ర్‌..? అంటే…

ఏమీ లేదండీ… నోట్ల ర‌ద్దు అయిన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు చాలా మంది న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్స్, బిల్లు చెల్లింపుల కోసం ఆన్‌లైన్ బాట ప‌ట్టారు క‌దా. ఈ క్ర‌మంలోనే అనేక సంస్థ‌లు కొత్త‌గా డిజిట‌ల్ పేమెంట్ యాప్‌ల‌ను ప్రారంభించాయి. వాటిల్లో బ్యాంకులు కూడా ఉన్నాయి. ఇక కేంద్ర ప్ర‌భుత్వం అయితే భీమ్ (BHIM) పేరిట కొత్త యాప్‌ను కూడా విడుద‌ల చేసింది. అయితే వీటి త‌ర‌హాలోనే ఇప్పుడు హైక్ మెసెంజ‌ర్‌లో కూడా డిజిట‌ల్ పేమెంట్ సేవ అందుబాటులోకి వ‌చ్చింది. ఇదే హైక్ లో కొత్త‌గా వ‌చ్చిన ఫీచ‌ర్‌. ఇది వాట్సాప్‌లో లేదు. త్వ‌ర‌లో అందులో రానుంది. వాట్సాప్‌లోకి రాకముందే మ‌న దేశీయ టెక్ దిగ్గ‌జాలు హైక్‌లో ఈ సేవ‌ను ప్రారంభించ‌డం విశేషం.

హైక్‌లో కొత్త‌గా వచ్చిన డిజిట‌ల్ పేమెంట్ ఫీచ‌ర్ ద్వారా యూజర్లు ఓ వైపు చాటింగ్ చేస్తూనే మ‌రో వైపు న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్స్‌, బిల్లు చెల్లింపులు వంటివి చేసుకోవ‌చ్చు. అందుకు అనుగుణంగా ఈ యాప్ ను తీర్చిదిద్దారు. ఇక ఈ కొత్త ఫీచ‌ర్‌ను వాడుకోవాలంటే యూజ‌ర్లు హైక్ మెసెంజ‌ర్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో డిజిట‌ల్ పేమెంట్ సేవ‌ల‌ను యూజర్లు పొంద‌వ‌చ్చు. మ‌రి వాట్సాప్ లో ఈ సేవ‌లు ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతాయో చూడాలి. ఏది ఏమైనా మ‌న దేశీయ టెక్ సంస్థ‌లు విదేశీ సంస్థ‌ల‌కు గ‌ట్టి పోటీనిస్తుండ‌డం శుభ ప‌రిణామం క‌దా..!

Comments

comments

Share this post

scroll to top