నీచమైన ఘటన: “హిజ్రా” అని కూడా చూడకుండా వేధించాడు…చుట్టూ ఉన్న వారు సినిమా చూసినట్టు చూసారు.!

స‌మాజంలో వారు మూడో వ‌ర్గానికి చెందిన వారు. అదే భావ‌న‌తో ఇత‌రులు వారిని ఎప్పుడూ చిన్న చూపు చూస్తారు. ఎక్క‌డికి వెళ్లినా వారికి అవ‌మానాలు, చీత్కారాలు త‌ప్ప‌వు. కొన్ని సంద‌ర్భాల్లో వారు కొంద‌రి చేతుల్లో చిత్ర హింస‌ల‌కు కూడా గుర‌వుతున్నారు. ప‌శ్చిమ‌బెంగాల్‌లో అయితే ఈ స‌మ‌స్య ఇంకా దారుణంగా ఉంది. అక్క‌డ హిజ్రాలకు ర‌క్ష‌ణ లేదు. స‌మాజంలో వారు పౌరులుగా బ‌తికే హ‌క్కు వారికి లేదు. ఈ క్ర‌మంలోనే వారు అనేక చిత్ర హింస‌ల‌కు లోన‌వుతున్నారు. తాజాగా అక్క‌డ ఇలాంటిదే ఓ ఘ‌టన జ‌రిగింది.

ఆమె పేరు సుమ‌న‌. హిజ్రా.. ప‌శ్చిమబెంగాల్‌లోని న‌దియా జిల్లా కృష్ణాన‌గ‌ర్‌లో నివాసం ఉంటోంది. రాత్రి స‌మ‌యంలో ఇంటికి వెళ్తుండ‌గా ఓ వ్య‌క్తి ఆమె వెనుక నుంచి వ‌చ్చి వేధించ‌సాగాడు. అత‌ను అలా ఎందుకు చేస్తున్నాడో సుమ‌న‌కు అర్థం కాలేదు. అయిన‌ప్ప‌టికీ సుమ‌న శాంతంగానే ఉంది. అయితే ఆ వ్య‌క్తి చేతుల‌తో, కాళ్ల‌తో ఆమెను తాకుతూ వేధించ‌సాగాడు. దీంతో సుమ‌న ఆ వ్య‌క్తి చెంప చెళ్లుమ‌నిపించింది. దీంతో ఆ వ్య‌క్తి మ‌రింత రెచ్చిపోయాడు.

సుమ‌న‌ను కాలితో త‌న్నుతూ కొట్ట‌సాగాడు. ఓ ద‌శ‌లో సుమ‌న అత‌ని దెబ్బ‌ల‌కు భ‌రించ‌లేక కింద‌ప‌డిపోయింది. అయితే ఆ స‌మ‌యంలో రోడ్డుపై జ‌నాలు తిరుగుతూనే ఉన్నారు. కానీ ఎవ‌రూ ఆమెను పట్టించుకోలేదు. క‌నీసం మ‌నిషి అని కూడా వారు చూడ‌లేదు. కాగా అక్క‌డికి కొంత ద‌గ్గ‌ర్లోనే ఓ పోలీసు కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. అత‌ను కూడా జ‌రుగుతున్న ఘ‌ట‌నను చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేశాడు. ఏమాత్రం అత‌ను ప‌ట్టించుకోలేదు. దీంతో చేసేదిలేక మ‌రో హిజ్రా స‌హాయంతో సుమ‌న ఇంటికి చేరుకుంది. అయితే త‌న‌పై దాడి చేసిన వ్య‌క్తిపై ఆమె ఫిర్యాదు మాత్రం చేయ‌లేదు. ఎందుకంటే అత‌నిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు ప‌ట్టించుకుంటారా ? ఓ పోలీసు దాడి జ‌రుగుతున్నా చూసీ చూడ‌న‌ట్టు ఉన్నాడు. మ‌ర‌లాంట‌ప్పుడు పోలీసులు ప‌ట్టించుకుని ఫిర్యాదు తీసుకుని స‌హాయం చేస్తారా ? అంటే అనుమాన‌మే. పైగా ఆ వ్య‌క్తి ఒక రౌడీ అని చుట్టు ప‌క్క‌ల వారు చెప్పారు. దీంతో సుమ‌న పోలీసుల‌కు కంప్లెయింట్ చేయ‌లేదు. ఇదీ… మ‌న దేశంలో పౌరుల‌కు ల‌భిస్తున్న న్యాయం. అయితే నిజానికి ప‌శ్చిమ బెంగాల్‌లో 2015 మే నెల‌లోనే వెస్ట్ బెంగాల్ ట్రాన్స్‌జెండ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డ్ పేరిట హిజ్రాల హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించేందుకు, వారి రక్ష‌ణ‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఓ బోర్డును ఏర్పాటు చేసింది. కానీ ఆ బోర్డు అస‌లు ఉందో, లేదో, అస‌లు ప‌నిచేస్తుందో, లేదో కూడా తెలియ‌దు. ఆ బోర్డు ఇలా ఉంటే ఇక హిజ్రాల ప‌రిస్థితి అలాగే ఉంటుంది మ‌రి..!

 

Comments

comments

Share this post

scroll to top