సుప్రీమ్ కోర్ట్ తీర్పు: బైకు కొనాలనుకునే వారికి మంచి అవకాశం…భారీ డిస్కౌంట్లు, ఉచిత భీమా…!

మనం ఎక్సిబిషన్ కో లేదా సేల్ జరిగే సంతకో వెళితే “రండి బాబు రండి…ఆలసించిన ఆశాభంగం” అనే మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కాకపోతే వారు చిరు వ్యాపారులు. వారు అమ్మేవి అత్యంత ఖరీదైన వస్తువులు కాదు. కానీ ఇప్పుడు ఇదే ట్రెండ్ ద్విచక్రవాహనాలు అమ్మేవారు కూడా పాటిస్తున్నారు. వారు పాటించేలా చేసింది సుప్రీమ్ కోర్ట్ తీర్పు.

BSI-3ఇంజిన్లు క‌లిగి ఉన్న వాహ‌నాల‌ను ఏప్రిల్ 1, 2017 నుంచి విక్ర‌యించ‌రాద‌న్న సుప్రీంకోర్టు తీర్పుతో వాహ‌న ధ‌ర‌ల‌ను తగ్గించి సేల్‌కు పెడుతున్నాయి ఆయా కంపెనీలు. ప్ర‌ముఖ ద్విచ‌క్ర‌వాహ‌న కంపెనీ హీరో BSI-3 ఇంజిన్ క‌లిగిఉన్న వాహ‌నాల‌కు భారీ డిస్కౌంట్ ప్ర‌క‌టించింది. హీరో బైక్స్ పై ఏకంగా రూ.12వేల 500 త‌గ్గింపు ఇచ్చింది. దీనికితోడు ఉచిత బీమా క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వీలైనన్ని ఎక్కువ వాహనాలు విక్రయించడమే లక్ష్యంగా ఈ ఆఫర్లను ఇస్తున్నాయి.

ద్విచక్రవాహనాల అమ్మకాల్లో అగ్రగామి అయిన “హీరో” కంపెనీ స్కూటర్లపై దాదాపు రూ.12,500, ప్రీమియం బైక్స్‌ పై రూ.7,500లు, ప్రాథమిక స్థాయి ద్విచక్ర వాహనాలపై రూ.5000 వరకు డిస్కౌంట్రి ప్రకటించింది. హీరో కి పోటీ ఇచ్చే హోండా మోటార్‌ సైకిల్స్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) సంస్థ అన్ని స్కూటర్లు, బైక్‌లపై దాదాపు రూ.10వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. త్త బైక్ కొనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం అని.. ఇంత తక్కువ ధరకు టూవీర్ రాదంటూ ప్రచారం చేసేస్తున్నారు. ఏ పండగ, పబ్బానికి కూడా ఇవ్వనటువంటి ఆఫర్ ను ఇప్పుడు ప్రకటించేస్తున్నాయి కంపెనీలు. ఈ నెల 31 తో ఈ ఆఫర్ ముగించనుంది!

 

Comments

comments

Share this post

scroll to top