మూత్రాన్ని దాచండి…. మంత్రి గడ్కరీ సంచలన వ్యాఖ్యలు..

మీ మూత్రాన్ని స్టోర్ చెయ్యండి. ఇక ఎరువులను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ మాట చెప్తోంది మేము కాదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. నాగ్ పూర్ లో నిర్వహించిన యువ సృజనాత్మక ఆవిష్కరణల సదస్సులో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “ మన దేశం మూత్రాన్ని స్టోర్ చేసుకోగలిగితే… ఇక విదేశాల నుంచి ఎరువుల దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మానవ మూత్రం జీవ ఇంధనంగా ఉపయోగపడుతుంది. మూత్రంలోని సల్ఫేట్, నైట్రోజన్ లు ఎరువుగా ఉపయోగపడతాయి. మానవ వ్యర్ధాలను జీవ ఇంధనాలుగా ఎలా ఉపయోగపడతాయో చెప్పడానికి ఇదే ఉదాహరణ ” అని గడ్కరీ అన్నారు.

ఇప్పటికే విమానయాన సంస్థలకు మూత్రాన్ని స్టోర్ చెయ్యాల్సిందిగా కోరానన్నారు. మన దేశంలోని వ్యవసాయ రంగానికి కావాల్సిన యూరియాను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. ఒక్కసారి దేశమంతా మూత్రాన్ని స్టోర్ చేస్తే ఇక ఎరువులను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. ఏది వృధాగా పోదని. మూత్రం ఒక శక్తివంతమైన ధ్రవం అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా మనిషి వెంట్రుకల్లో అమినో యాసిడ్స్ ఉంటాయని… దానిని కూడా ఎరువుగా ఉపయోగించవచ్చన్నారు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మంత్రి గడ్కరీ యువతకు వెల్లడించారు. మరి దీనిని ఏ విధంగా ప్రజలు అర్ధం చేసుకుంటారో చూడాలి.

Comments

comments

Share this post

scroll to top