ఇక్క‌డున్న ప్రతి హీరో పేరులో…ఓ నెంబ‌ర్ దాగుంది.? అదేంటో క‌నుక్కోండి చూద్దాం.!!

ఎప్పుడూ టాప్ ప్లేస్లో ఉండాలనే తాపత్రయం సినిప్రపంచంలో ఎక్కువగా ఉంటుంది..  నటీనటుల మధ్య నంబర్స్ గేమ్ నడుస్తుంటుంది. ఆ నంబర్ల కోసమే పోటీపడేవారు ఎక్కువే.కాని తమ పేర్లలోనే నెంబర్లు ఇమడ్చుకున్న నటులు ఉన్నారు.బహుశా ఆ  సంగతి  వారికీ కూడా తెలియకపోవచ్చు. అటువంటి నంబర్లు కలిసిన సినీ, క్రీడాకారుల పేర్లు కొందరు..

 • Pa1 Kalyan (పవన్ కళ్యాణ్) , madha 1 (మాధవన్)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరులో వన్ అనే నంబర్ దాగుంది. బహుశా అందుకేనేమో నంబర్ వన్ గా నిలిచారు. తెలుగు, తమిళంలో అనేకమంది అభిమానులను సంపాదించుకున్న మాధవన్ పేరులోనూ వన్ నెంబర్ ఉంది.

 • 2 ని (ధోని)

క్రికెటర్ ధోని పేరు రెండో నంబర్ తో మొదలయింది.

 • 3sha (త్రిష), 3 vikram (త్రివిక్రమ్), savi 3 (సావిత్రి)

మహానటి సావిత్రి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, చెన్నై బ్యూటీ త్రిష లో మూడు అంకె ఉంది..ఈ ముగ్గురు ఎవరికి వారు తమ తమ సత్తా చాటుకున్నవారే..

 • 4 mi (ఛార్మి), ram 4 an (రామ్ చరణ్)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి పేర్లలో నాలుగు దాగుంది.రంగస్థలంలో చిట్టిబాబు పాత్రతో రాంచరణ్ ప్రేక్షకుల మనసుల్లో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్నారు.ఒకవైపు నటన మరోవైపు ఫ్రోడక్షన్ హౌజ్ పనులతో ఛార్మీ బిజీగా ఉంది.

 • Rama Na5 (రామానాయుడు)

ప్రముఖ నిర్మాత డి రామానాయుడు లో ఐదు అనే నెంబర్ పలుకుతుంది.నిర్మాతగా మాత్రం దగ్గుబాటి రామానాయుడిగారిది ఎప్పుడూ టాప్ ప్లేస్ ఏ…

 

 • Allu 6jun (అల్లు అర్జున్ ), nag 6juna (నాగార్జున)

కింగ్ నాగార్జున, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరులో ఆరు అంకె ఉన్నసంగతి మీరు గమనించారా ?..

 • Kaikala (7) Ya Narayana (కైకాల సత్యనారాయణ)

ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పేరులో ఏడు నెంబర్ ఉంది.

 • Anushka Sh(8)ty (అనుష్క శెట్టి)

స్వీటీ అనుష్క శెట్టి పేరులో ఎయిట్ నెంబర్ ఉంది..కాని హీరోలతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్కది ఎప్పుడూ టాప్ ప్లేసే..

 • (9)Tara (నయనతార)

కేరళ బ్యూటీ నయనతార పేరులో నయన్ నెంబర్ ఉంది… నయనాలతోనే  ఆకట్టుకునే నయనతార  వయసు పెరుగుతున్నా కొద్ది అందం పెరగడం విశేషం.

 • Sachin (10)dulkar (సచిన్ టెండ్లుకర్) / Naga Chai(10)ya (నాగచైతన్య)

క్రికెట్ దేవుడు సచిన్ టెండ్లుకర్, యువ సామ్రాట్ నాగచైతన్య పేర్లలో పదో నెంబర్ ఇమిడి ఉంది.

 • Naga ‘100’rya (నాగ శౌర్య)

నాగ శౌర్య పేరులో ఏకంగా వందో సంఖ్య ఉండడం విశేషం..తన పేరుకు తగ్గట్టు వంద చిత్రాలతో సిని పరిశ్రమలో ఉండాలని కోరుకుందాం… నేడు ఒకటి రెండు సినిమాలతో వెనుదిరిగే హీరోలు ఎక్కువ మరి..

Comments

comments

Share this post

scroll to top