రాజమౌళితో సినిమా అంటే జంకుతున్న హీరోలు!

అదేంటి… ప్రపంచం మొత్తం పట్టం కడుతున్న దర్శకుడితో సినిమా తీయడానికి హీరోలు జంకడం ఏంటి?  అనే కదా మీ అనుమానం!  నిజంగానే హీరోలు జక్కన్న తో సినిమా చేయాలంటే  జడుసుకుంటున్నారట!! ఇప్పుడు ఈ టాక్ ఫిల్మ్ నగర్ లో గట్టిగా   వినిపిస్తోంది. తీసిన 10 సినిమాలను సూపర్ హిట్టు కొట్టించిన దర్శకుడతను, బాహుబలితో రికార్డులకు రికార్డులను షేక్ చేసిన డైరెక్షన్ తనది… అయినప్పటికీ  తెలుగు హీరోలు మాత్రం ఆయన సినిమాలో హీరోలుగా చేయడానికి భయపడడానికి కారణాలేంటని పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయ్.

For Face Book Updates: జక్కన్నతో సినిమా అంటే జంకుతున్నహీరోలు.

rajamouli

ఫ్లాప్ అంటే తెలియని డైరక్టర్ అతను..ఇది ఎవ్వరూ కాదనలేని నిజం, తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ రేంజ్ కు తీసుకెళ్లిన ధీరుడతను ..దీనికి సాక్ష్యం బాహుబలి మన కళ్లముందే కదలాడుతుంది. ఇలాంటి డైరెక్టర్ తో తెలుగు హీరోలు నటించడానికి జంకడానికి  అసలేం  కారణాలు ఉన్నాయ్.

జక్కన్న ఫస్ట్ సినిమా నుండి క్లియర్ గా పరిశీలిస్తే ఒక విషయం తెలుస్తోంది.. అదేంటంటే  అతని సినిమాలో హీరో కంటే విలన్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది చాలదు హీరోలు జంకడానికి.. ఎందుకంటే వెండితెర మీద టన్నుల కొద్ది హీరోయిజం ప్రదర్శించాలని కోరుకునే వారికి ఇది మింగడుపడని  విషయం. వాస్తవానికి బాహుబలి లో కూడా ఇదే జరిగింది. ప్రభాస్ కంటే కూడా రానాను చాలా పవర్ ఫుల్ గా చూపించారు. ఈ విషయాన్ని క్రిటిక్స్ కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా డిస్సపాయింట్ కు గురయ్యారు సినిమా చూసి. తమ అభిమాన నటుడిని రానా డామినేట్ చేయడం వాళ్లు తట్టుకోలేకపోయారు.

ఒకటి హీరోయిజానికి సంబంధించనదైతే, మరోటి రాజమౌళికి సంబంధించినది.. రాజమౌళి కఠినమైన దీక్షతో సినిమా తీస్తాడు, ముహుర్తం షాట్ నుండి సినిమా రిలీజ్ వరకు అంతా అతనే దగ్గరుండి చూసుకుంటాడు. సినిమా రిలీజ్ అవుతోంది. హిట్ కొడుతుంది. క్రెడిట్ అంతా దర్శకుడు రాజమౌళి అకౌంట్లో పడుతుంది. ఇలా అయితే ఏ హీరో అయినా ఎందుకు ఇంట్రస్ట్ చూపుతాడు జక్కన్న తో పిక్చర్ కి . ఈగ సినిమాలో క్రెడిట్, మర్యాద రామన్న సినిమాలో ఖ్యాతి రాజమౌళి ఖాతాలోనే పడ్డాయి. మరీ పెద్ద హీరో అయితే సగం అతనికి, సగం రాజమౌళి కి వస్తాయి.. ఆ క్రెడిట్స్. ఇవి  తెలుగు హీరో రాజమౌళి తో సినిమా అంటే భయపడడానికి అంటున్నారు సినీ విమర్శకులు.

CLICK: తన సినిమాపై రివ్యూ  రాయండని కోరిన రాజమౌళి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top