24 ఏళ్ల కుర్ర హీరోయిన్ మరీ సెక్సీగా ఉందని.. ఏడాదిపాటు నిషేధం విధించారు!

హీరోయిన్ అన్నాక అందంగా ఉంటుంది. అందంగా ఉన్నవాళ్లే హీరోయిన్ అవుతారు. కానీ ఆ అందమే ఒక హీరోయిన్ కొంపముంచింది. హీరోయిన్ మరీ సెక్సీగా ఉందని పేర్కొంటూ ఆమెపై ఏడాదిపాటు నిషేధం విధించారు. సంవత్సరం పాటు ఆమె కొత్త సినిమాలు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆశ్చర్యంగా ఉంది కదా..? కానీ అది నిజం. ఇంతకీ ఆమె ఎవరు? ఏ సినిమాలు చేసింది? వివరాలు చూడండి!

కాంబోడియాకు చెందిన డెన్నీ క్వాన్(24) పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అయితే ఆమె మరీ సెక్సీగా ఉందంటూ సాంస్కృతిక శాఖ అధికారులు ఆమెపై ఏడాదిపాటు నిషేధం విధించారు. క్వాన్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిందని ఆరోపించారు. అంతేకాదు ఆమెకు కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ మినిస్ట్రీతో ఈ విషయంలో అవగాహన క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందించారు. ఆమెను ఫాలో అవుతున్న 3 లక్షల ఫాన్స్ “ఇతర హీరోయిన్లతో పోలిస్తే ఆమె పెద్దగా అభ్యంతరకర సన్నివేశాల్లో నటించడం లేదంటూ “ఆమెకు సపోర్ట్ ఇచ్చారు. ‘‘కాంబోడియాలో బోల్డంతమంది సెక్సీ ఆర్టిస్టులు ఉన్నారు. షూటింగ్ సమయంలో కొందరు నాకంటే బోల్డ్‌గా వ్యవహరిస్తుంటారు’’ అని క్వాన్ పేర్కొంది. తాను ఎటువంటి దుస్తులు వేసుకోవాలనేది తన ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్న ఈ ముద్దుగుమ్మ దేశ సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించి ఇకముందు మరీ అంత సెక్సీగా ఉండకుండా జాగ్రత్తపడతానని చెప్పుకొచ్చింది.

 

Comments

comments

Share this post

scroll to top