“సాహో” లో “ప్రభాస్” సరసన నటించబోయే హీరోయిన్ ఫిక్స్..! ఎవరో తెలుసా..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా బాహుబలి ఫీవర్ నడుస్తుంది. తెలుగు సినిమా పవర్ ఏంటో చూపించారు రాజమౌళి గారు. ఈ సినిమా వల్ల “ప్రభాస్” కు ఎంతో మంచి పేరు వచ్చింది. వాక్స్ స్టాట్యూ ఉన్న ఏకైక తెలుగు హీరో ప్రభాస్. సుజీత్ దర్శకతంలో “సాహో” అనే సినిమాలో నటిస్తున్నాడు “ప్రభాస్”. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్ టీజర్ కూడా విడుదలయ్యింది. సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ సినిమా మూడు భాషల్లో (తెలుగు, తమిళ, హిందీ ) విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు..!

3 భాషలకు కనెక్ట్ అయ్యే హీరోయిన్ కోసం వెదుకుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అయితేనే అన్ని భాషలకు కనెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.

“ప్రభాస్” సరసన సాహోలో నటించడానికి “దీపికా పడుకునే” కానీ “కత్రినా కైఫ్” ను కానీ సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నారట “సాహో” చిత్ర యూనిట్. కానీ దీపిక ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయింది. మరో హాలీవుడ్ ప్రాజెక్టుకు సైన్ చేసే ఆలోచనలో ఉంది. కత్రినా కైఫ్ కు ఇప్పటికే తెలుగు సినిమాల్లో నటించిన అనుభవం ఉంది కాబట్టి ఆమెను మరోసారి సోహో సినిమాతో టాలీవుడ్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఈ మేరకు ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభమైనట్టు తెలుస్తోంది.  జూన్ 10 న “సాహో” చిత్రం సెట్స్ పైకి వెళుతుంది!

శ్రద్ధ కపూర్, దిశా పటాని లను కూడా హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్నారు. ఇంతలో పూజ హెగ్డే కు ఫిక్స్ అయ్యారనే వార్త వచ్చింది!

కానీ ఇప్పుడు మాత్రం “సాహో” లో అనుష్క హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఆఫిసిఅల్ గా మాత్రం చిత్ర బృందం ఏం చెప్పలేదు. క్లారిటీ రావాలంటే వెయిట్ చేయాల్సిందే!

Comments

comments

Share this post

scroll to top