మెగా అల్లుడి సరసన హీరోయిన్ ఫిక్స్..! “అనుపమ” కాదు..మరెవరో తెలుసా..? మొదటి సినిమా ప్లాప్ అయినా..!

మెగా ఫామిలీ హీరోల గురించి కొత్త ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరంలేదు . చిరంజీవి  వేసిన బాటలో ఎంతోమంది వచ్చారు..వస్తున్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్..ఇలా ఎంతో మంది వచ్చి తమ సత్తా చాటారు. నాగబాబు కూతురు నిహారిక కూడా తెరంగేట్రం చేసింది. ఇప్పుడు చిరంజీవి రెండో అల్లుడు కళ్యాణ్ బాబు రాకకు రంగం సిద్ధం అయింది..కళ్యాణ్ సినిమాకు సంభందించిన మరో ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది..

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను పెళ్లి చేసుకున్నతరువాత ఈ మెగా కుటుంబ అల్లుడు త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. కళ్యాణ్ తొలి సినిమాకి “జత కలిసే” సినిమా తీసిన దర్శకుడు రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ‘మేఘా ఆకాశ్’ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఎంపిక దాదాపు ఖరారైపోయిందనే అంటున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఎంతోకాలం పట్టదని చెబుతున్నారు. ప్రస్తుతం నితిన్ జోడీగా మేఘా ఆకాశ్ వేరే సినిమా బిజీలో ఉంది.

 

 

Comments

comments

Share this post

scroll to top