సినిమా అవకాశాలు లేక బిచ్చమెత్తుకుంటున్న హీరోయిన్.!

ఆమెకు సినిమాలే లోకం… ఎలాగైనా తెరమీద కనింపిచాలని విశ్వప్రయత్నాలు చేసింది. చేతిలో లగేజ్ తో ముంబాయిలో అడుగుపెట్టింది. అవకాశం కోసం ప్రతి డైరెక్టర్ ను కలిసింది, కొత్త సినిమా ఎక్కడ ప్రారంభం అంటే అక్కడికి వెళ్లేది..ఏదైనా అవకాశం దొరుకుతుందేమోనని…మొత్తానికి ఆమె ప్రయత్నాలు ఫలించి….ఓ భోజ్ పురి చిత్రంలో హీరోయిన్ గా అవకాశం దక్కింది. కళ నెరవేరింది….ఇక భవిష్యత్ అంతా మూడుపువ్వులు ఆరు కాయలే అనుకుంది.కానీ అంతలోనే సీన్ రివర్స్ అయ్యింది. ఆమె హీరోయిన్ గా చేసిన తొలి చిత్రం అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. దీంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.. మళ్లీ అవకాశాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేసింది…అయినప్పటికీ ఎవ్వరూ తమ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు.

ఆమె ఆలోచనలు మొత్తం సినిమా లోకం చుట్టే ఉండడం…సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో తీవ్రమైన డిప్రెషన్  లోకి వెళ్లిపోయింది సదరు హీరోయిన్.. తల్లీదండ్రులను కలవడానికి కూడా ఇష్టపడలేదు.  చివరకు తినడానికి తిండిలేక బిఛ్చగత్తెగా మారి రోడ్ల మీద సిగ్నల్స్ వద్ద బిక్షాటన కూడా చేసేది. ఈ సమయంలో ఆమె మానసిక పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. ముంబాయి లోకండ్ వాలా రోడ్డు మీద ఓ కార్ అద్దాలను పగులగొడుతుూ పిచ్చిపిచ్చిగా చేస్తుంటే పోలీసులు ఆమెను పట్టుకున్నారు. తీరా ఆరా తీసి చూస్తే ఆమె పేరు మిథాలీ శర్మ అని..ఆమె ఓ భోజ్ పురి సినిమాలో హీరోయిన్ గా చేసిందని అవకాశాలు లేక నేడు ఈ స్థితిలో ఉందని తెలిసింది.

mitali

అన్నీ మనం ఊహించినట్టు జరిగితే అది జీవితం కాదు…కాబట్టి ఎటువంటి పరిస్థితులెదురైనా గుండెనిబ్బరంతో ఉండాలి. ముఖ్యంగా ఈ సినిమా వాళ్లు ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే ఈ రోజు ఉన్న స్టార్ డమ్ రేపు ఉండకపోవొచ్చు..ఈ రోజు తిరిగిన ఎసి కార్లు , 5 స్టార్ హోటల్స్ రేపు ఉండకపోవొచ్చు…వాటన్నింటికీ సిద్దంగా ఉండి ముందుగానే మంచి లైఫ్ కొరకు సక్రమంగా  ప్లాన్ చేసుకోవాలి.

Comments

comments

Share this post

scroll to top