ఉదయ్ కిరణ్ ఆఖరి ఫోన్ కాల్..! ఇంకెక్కడి లవర్ బాయ్ అండీ అంటూ నైరాశ్యం!

ఉదయ్ కిరణ్. ఎవరి సపోర్ట్ లేకుండా తెలుగు సినిమాకు పరిచయమై కథానాయకుడిగా ప్రేక్షకులను అలరించాడు. ఎవరి సపోర్ట్ లేకుండా స్టార్ హీరోగా రాణించిన ఉదయ్ కిరణ్, సినిమాలు ఆఫర్స్ లేక మానసిక క్షోభను అనుభవిస్తూ మనకందరికీ దూరమయ్యాడు. అయితే కొన్ని సినిమాలు తన వద్దకు వచ్చినా, ఆ సినిమాలలో నటించలేక, ఆ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించలేనని వచ్చిన అవకాశాలను వదులుకున్నాడు. మానసికక్షోభతో తిరిగిరాని లోకాలకు వెళ్ళిన ఉదయ్ కిరణ్ మాట్లాడిన చివరి మాటలు..
“ఇంకెక్కడ లవర్ బాయ్ అండి. 13 ఏళ్ళుగా లవర్ బాయ్ ఇమేజ్  నన్ను వదిలిపెట్టట్లేదు. ఎన్ని సినిమాలు చేసినా అవి ఫెయిల్యూర్స్ గానే మిగులుతున్నాయి. ఇప్పట్లో నేను లవర్ బాయ్ చేస్తే ఆ సినిమా బాగుండదు. ఇలాంటి ప్రేమ కథా చిత్రాలు నేను చేయడం లేదండి. తమిళ్, హిందీలలో చూసుకుంటే చాలా డిఫరెంట్ సినిమాలు వస్తున్నాయి. ఎందుకో గానీ మనమే ఇంకా ఇక్కడే ఇరుక్కుపోయాము.ఇప్పటివరకూ నేను చేసిన క్యారెక్టర్లకు డిఫరెంట్ గా ఉండాలి. ఇలాంటి రొమాంటిక్ క్యారెక్టర్స్ నేను చేయడం లేదు. మీరేమో లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ ఉన్నాడని మీరనుకుంటారు. కానీ ఆడియెన్స్ నన్ను యాక్సెప్ట్ చేయడం మానేశారు. వెంకటేష్ బాబు, జగపతిబాబు చేసిన పాత్రలుండాలి. కానీ నన్ను ఇంకా లవర్ బాయ్ గానే చేస్తున్నారు, నా వద్దకు కొందరు దర్శకులు వస్తున్నారు కానీ నేను మెచ్యుర్డ్ క్యారెక్టర్ లు, డిఫరెంట్ కాన్సెప్ట్ లను కోరుకుంటున్నాను. వాళ్ళు అలాంటి కథలే తెస్తున్నారు. ఎప్పుడూ ఒకే జోనర్ కి కాకుండా డిఫరెంట్ గా వెళ్ళాలి. నన్ను ఇంకా మనసంతా నువ్వే హీరోలానే చూస్తున్నారు. ఇంతకుముందు ఇలాంటి కథలే వస్తున్నాయి” అంటూ ఉదయ్ కిరణ్ మన మనసులోని మాటలను ఇలా చెప్పుకున్నాడు.
Watch Video:
Uday Kiran Phone Call 1:

Uday Kiran Phone Call 2:

Comments

comments

Share this post

scroll to top