చచ్చేంత వరకు ఆ హీరో పిక్ నా దెగ్గరే ఉంటుంది హీరో రాజ్ తరుణ్.!!

AP2TG Staff

‘ఉయ్యాలా జంపాల’, ‘సినిమా చూపిస్త మామ’ సినిమాలతో యూత్, ఫామిలీ ఆడియన్స్ కి దెగ్గరయ్యాడు రాజ్ తరుణ్. ఆ తరువాత రాజ్ తరుణ్ హీరో గా నటించిన ‘కుమారి ౨౧ఫ్’ సినిమా సూపర్ డూపర్ హిట్, మంచు విష్ణు తో కలిసి నటించిన’ ఈడో రకం ఆడో రకం’ సినిమా మంచి విజయం సాధించింది, కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. ఆ తరువాత వచ్చిన సినిమా లు అన్ని బాక్స్ ఆఫీస్ దెగ్గర పరాజయాలను చవి చూశాయి, ముఖ్యంగా ఈ సంవత్సరం విడుదల అయిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి, దీంతో నెమ్మదిగా మంచి స్క్రిప్ట్ తో సినిమా తియ్యాలని రాజ్ తరుణ్ భావిస్తున్నాడు.

ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే రాజ్ తరుణ్, ‘లవర్’ సినిమా తరువాత పెద్దగా యాక్టీవ్ గా లేడు సోషల్ మీడియా లో. చాలా రోజుల తరువాత ఇవ్వాళ ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు రాజ్ తరుణ్. నేను మహేష్ బాబు కి వీరాభిమానిని అని ఉయ్యాలా జంపాల సినిమా తరువాత నుండి చెబుతూ వచ్చాడు రాజ్ తరుణ్. ఎంత వీరాభిమాని అంటే, తన ఫోన్ వాల్ పేపర్ గా ఎప్పటికి మహేష్ బాబు చిత్రమే ఉంటాది, అదే విషయం ట్విట్టర్ లో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా తెలిపాడు.

మీరు మహేష్ బాబు తో పిక్ ఎప్పుడు దిగుతారు.?

మీరు మహేష్ బాబు తో పిక్ ఎప్పుడు దిగుతారు అని ఒక ఫ్యాన్ అడిగిన ప్రశ్నకి రాజ్ తరుణ్ రిప్లై ఇస్తూ : “నేను సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఎప్పుడో పిక్ దిగాను, చచ్చేంత వరకు ఆ పిక్ నా దెగ్గరే పెట్టుకుంటా, అందుకే ఆ పిక్ ని సోషల్ మీడియా లో షేర్ చేయదలుచుకోలేదు”.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడు నీకు అండగా ఉంటాం అన్న..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్, రాజ్ తరుణ్ కి హిట్స్ వచ్చినా, పరాజయాలు వచ్చినా, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడు నీతోనే ఉంటాము అని ట్వీట్ చేసాడు, ఆ ట్వీట్ కి చాలా హ్యాపీ అని రిప్లై ఇచ్చాడు రాజ్ తరుణ్.

సూపర్ స్టార్ మహేష్ బాబు కి సెలబ్రిటీస్ లో ఉన్న ఫాలోయింగ్ గురుంచి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆయనకు సెలబ్రిటీస్ లో డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు అని రాజ్ తరుణ్ ద్వారా మరొకసారి రుజువైంది.

Comments

comments