శ్రీకాంత్ తో పోటీ అనేసరికి బయమేసింది – రాజశేఖర్… హీట్ పుట్టించిన నరేష్ మాటలు.. గెలుపు తరువాత ‘మా’ లీడర్స్ ప్రెస్ మీట్..!!

మా అసోసియేషన్ ఎన్నికల్లో సీనియర్ యాక్టర్ నరేష్ విజయం సాధించాడు, శివాజీరాజా పైన భారీ మెజారిటీ తో గెలుపొందాడు.గెలిచిన తరువాత ప్రెస్ తో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు నరేష్. తనని గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు నరేష్.

రాజశేఖర్ మాట్లాడుతూ .. : నన్ను గెలిపించిన అందరికి ధన్యవాదాలు. నాకు ఈ ఎన్నికలు అంటే భయం, నాకు మాములుగా పోటీ అంటేనే భయం. నరేష్ కి కూడా నేను చెప్పాను ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యను అని, కానీ అతను నన్ను చివరికి ఒప్పించాడు, అవుతల పక్క నాకు పోటీ గా హీరో శ్రీకాంత్ ఉన్నాడు. శ్రీకాంత్ అందరితోనూ బాగా కలిసిపోతాడు, మాట్లాడుతాడు. కానీ నేను అప్పుడప్పుడు కలుస్తాను, సరిగ్గా మాట్లాడను, నాకు ఓట్లు వేస్తారో లేదో అని భయపడ్డాను. లాస్ట్ వరకు టెన్షన్ ఉండే ఫుల్ గా, కానీ గెలిచేసరికి ఆనందం వేస్తుంది. మొదటి సారి ఒక ఓటింగ్ సిస్టం లో నిలబడ్డాను, గెలిచినందుకు ఆనందం ఉంది, ‘మా’ అసోసియేషన్ ను ముందుకు నడిపిస్తాము మేమందరం కలిసి.

జీవిత రాజశేఖర్ గారు మాట్లాడుతూ .. : ఈ సారి ప్యానెల్ లో గెలిచిన వాళ్ళల్లో చాలా మంది ఆడవాళ్లు ఉన్నారు, మాకు సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు తెలువుతున్నా, మాకు 10 రోజులు మాత్రమే ఉండే క్యాంపెయిన్ కి, కానీ ఈ 10 రోజుల్లో చాలా కష్ట పడ్డాం, పెద్ద హీరోస్ అందరిని కలిసాం, చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని, వెంకటేష్ గారిని, నాగార్జున గారిని..వీళ్ళందరూ మాకు సపోర్ట్ ఇచ్చారు. మహేష్ బాబు ని షూటింగ్ కి వెళ్లి మరీ కలిసాము, ఆయన కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు. ఇంకా చాలా మంది మాకు సపోర్ట్ ఇచ్చారు, వాళ్లందరికి ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. మా అసోసియేషన్ అభివృద్ధి కి సహకరిస్తాం, కష్టపడతాం.

నరేష్ మాట్లాడుతూ.. : నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నాకు సహకరించిన మా చెల్లి జీవిత, మరియు బావ రాజశేఖర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా, తల్లి తండ్రులని పెద్దలను గౌరవించే వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు, నేను గెలుస్తా అని నాకు నమ్మకం ఉంది, అనుకున్నట్టుగానే గెలిచాను. చిరంజీవి, నాగార్జున, నాగబాబు మా ప్యానెల్ కు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు. మా అమ్మ విజయ నిర్మల, మరియు సూపర్ స్టార్ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. నాకు 50 ఓట్లు కూడా రావన్నారు శివాజీరాజా, కానీ నేను ఇప్పుడు గెలిచాను. అందరం కలిసి పనిచేస్తాం, మిత్రుడు శివాజీరాజా కి కూడా చెబుతుంది అదే, ఆ ప్యానెల్ ఈ ప్యానెల్ అని లేకుండా, ‘మా’ అసోసియేషన్ కోసం అందరం కలిసి పనిచేస్తాం, ఈ ఒక్కసారి మాత్రమే ‘మా’ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉంటా అని ప్రమాణం చేస్తున్నా.

అధ్యక్షుడిగా నరేశ్‌, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, జనరల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్‌, జాయింట్‌ సెక్రటరీ గౌతమ్‌ రాజు, శివ బాలాజీ, కోశాధికారిగా రాజీవ్‌ కనకాల గెలుపొందారు. హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

Comments

comments

Share this post

scroll to top