టీవీ యాంక‌ర్ లాస్య‌తో త‌న పెళ్లి జ‌రిగిన వార్త‌పై స్పందించిన రాజ్ త‌రుణ్‌… ఇంత‌కీ అత‌నేమ‌న్నాడంటే..!

సినిమా లేదా టీవీ న‌టుల‌న్నాక నేటి త‌రుణంలో గాసిప్స్ స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. ఫ‌లానా హీరో ఫ‌లానా న‌టితో డేటింగ్ చేస్తున్నాడ‌ని,  త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటార‌ని, లేదంటే ఫ‌లానా న‌టి ఎవ‌రో వ్య‌క్తితో స‌న్నిహితంగా ఉంటోంద‌ని, అది ఎక్క‌డ వ‌ర‌కు దారి తీస్తుందోన‌ని… ఎవ‌రో ఇద్ద‌రు న‌టీ న‌టుల మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డుస్తుంద‌ని, వారు పెళ్లి చేసుకుంటారా లేదా అని… ఇలా ర‌క‌ర‌కాల రూమ‌ర్లు, పుకార్లు సినీ ప్ర‌పంచంలో మ‌న‌కు వినిపిస్తూనే ఉంటాయి. అయితే వీటిలో నిజ‌మ‌య్యేవి కేవ‌లం కొన్ని మాత్ర‌మే అత్యంత త‌క్కువ‌గా ఉంటాయి. ఇలాంటి పుకార్లు, రూమ‌ర్ల‌కు న‌టీన‌టులు ఎవ‌రూ అతీతులు కాదు. వారు సినీ రంగానికి కొత్త‌యినా, పాతైనా వారి గురించి పుకార్లు రావ‌డం సహ‌జం. ఇద్ద‌రు న‌టీన‌టులు క్లోజ్‌గా ఉన్నారంటే చాలు వారి మ‌ధ్య ఏదో ఉంద‌ని రూమ‌ర్లు వ్యాప్తి చెందించ‌డం ఎక్కువైంది. మ‌రీ సోష‌ల్ మీడియా ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉన్న నేటి త‌రుణంలోనైతే ఇలాంటి పుకార్లకు లెక్కే ఉండడం లేదు. అస‌లు దేన్ని న‌మ్మాలో, దేన్ని న‌మ్మ‌కూడ‌దో కూడా తెలియ‌డం లేదు. వ‌ర్ధ‌మాన న‌టుడు రాజ్ త‌రుణ్‌కు కూడా త‌న ప‌ట్ల వ‌చ్చిన ఓ రూమ‌ర్ గురించి ఎలా స్పందించాలో, ఏం చేయాలో కూడా తోచ‌లేదు. చివ‌ర‌కు త‌న స్టైల్‌లో స‌ద‌రు పుకార్లకు చెక్ పెట్టాడు. ఇంత‌కీ ఆయ‌న పై వ‌చ్చిన రూమ‌ర్ ఏంటి..?

raj-tarun-lasya

టీవీ యాంక‌ర్ లాస్య తెలుసుగా. ప‌లు టీవీ ఛాన‌ల్ షోల‌లో యాంక‌ర్‌గా చేస్తూ మంచి పేరే తెచ్చుకుంది. అయితే ఈవిడ‌, హీరో రాజ్ త‌రుణ్ ఇద్ద‌రూ క‌ల‌సి లేచిపోయి పెళ్లి చేసుకున్నార‌ని గ‌త రెండు, మూడు రోజుల నుంచి అన్ని వెబ్‌సైట్లు, మీడియా ఛానళ్లలో రోజుకో వార్త ప్రసార‌మ‌వుతోంది. ఎవ‌రికి వారు మ‌సాలాలు ద‌ట్టించి మ‌రీ వీరిద్ద‌రి గురించిన పుకార్ల‌ను చిలువ‌లు, ప‌ల‌వలుగా చేసి క‌థ‌లు అల్లేశారు. అయితే ఇది కాస్తా హీరో రాజ్ త‌రుణ్‌కు ఎలాగో తెలిసింది. త‌న‌కూ ఫేస్‌బుక్‌లో ఓ అఫిషియ‌ల్ ఖాతా ఉంది కనుక ఈ వార్త ఆయ‌న‌కి చేర‌డంలో పెద్ద ఆల‌స్య‌మేమీ జ‌ర‌గ‌లేదు. ఈ క్ర‌మంలో త‌న పెళ్లి ప‌ట్ల వ‌చ్చిన ఈ పుకార్ల‌ను చూసి ఎలా స్పందించాలో రాజ్ త‌రుణ్‌కు మొద‌ట అర్థం కాలేద‌ట‌. అయినా త‌డుముకోకుండా వెంట‌నే త‌న ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టేశాడు. అది మీరే చూడండి…

” స‌భ‌కు న‌మ‌స్కారం !!
నా సంబంధం, నా ప్ర‌మేయం లేకుండా కుమ‌రి 21ఎఫ్ ఆడియో రిలీజ్‌లో కేవ‌లం ఒకే ఒక్క‌సారి క‌లిసిన లాస్య‌తో నా పెళ్లి చేసిన కొంత మంది మీడియా మిత్రుల‌కు, వెబ్‌సైట్ దారుల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు ” అంటూ కొంత వెట‌కారంగానే రాజ్ త‌రుణ్ స్పందించాడు. ఇలాంటి పుకార్ల‌ను ద‌య‌చేసి న‌మ్మ‌వ‌ద్ద‌ని, తాను మ‌రో 3 ఏళ్ల దాకా పెళ్లి గురించి ఆలోచించ‌బోవ‌డం లేద‌ని, ఆ త‌రువాత కుదిరితే చూస్తాన‌ని అన్నాడు. త‌న పెళ్లి పట్ల ఇంత‌టి ఆస‌క్తిని చూపుతూ త‌న కోసం స‌మ‌యం కేటాయించి ఈ వార్త‌ను చ‌దివిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు, “ఇలాంటి వాటిని న‌మ్మ‌వ‌ద్దు, మీ టైం వేస్ట్ చేసినందుకు క్ష‌మించండి, థాంక్యూ” అంటూ రాజ్ త‌రుణ్ స్పందించాడు.

అంతేగా మ‌రి. నిజంగా ఒక వేళ అలా చేసి ఉంటే అప్పుడు అలాంటి వార్త‌లు ప్ర‌సారం చేసినా ఏమీ కాదు, కానీ ఎవ‌రికైనా ఆత్మాభిమానం, ప్రైవ‌సీ అంటూ కొన్ని ఉంటాయి క‌దా. వాటికి భంగం క‌లిగితే ఎవ‌రు చూస్తూ ఊరుకుంటారు చెప్పండి. అది సినీ స్టార్ అయినా, మ‌రొక‌రైనా త‌న ప‌ట్ల వ‌చ్చే పుకార్ల‌కు ఇలాగే స్పందిస్తారు మ‌రి.

Comments

comments

Share this post

scroll to top