పవన్ కళ్యాణ్ సంపాధించిన డబ్బులు ఏమవుతున్నాయ్..! జాతీయ మీడియా ఆసక్తికర కథనం.

నేటి త‌రుణంలో సినిమాల్లో హీరోలుగా న‌టించే న‌టులు ఎంత పారితోషికాన్ని తీసుకుంటున్నారో అంద‌రికీ తెలిసిందే. సినిమా హిట్ అయి మంచి పేరు వ‌స్తే ఆ పారితోషికం ఇంకా పెరుగుతుంది కూడా. అయితే వ‌ర్ధ‌మాన న‌టుల‌కు మ‌రీ అంత‌టి భారీ పారితోషికం రాదు, కానీ అగ్ర హీరోలకు నిర్మాత‌లు ఎంత‌టి పారితోషికాన్న‌యినా చెల్లిస్తారు. ఎందుకంటే ఆ సినిమా టాక్ ఎలా ఉన్నా క‌నీసం వ‌సూళ్లను రాబ‌డుతుంది క‌దా. ఈ క్ర‌మంలో అంత‌టి భారీ పారితోషికం తీసుకునే ఏ అగ్ర‌హీరో లైఫ్ అయినా ఎలా ఉంటుంది..? ఈ విష‌యాన్ని ఎవ‌రైనా ఊహించ‌గ‌లుగుతారు. విలాస‌వంత‌మైన కార్లు, బంగ‌ళాలు, చుట్టూ ఎల్ల‌ప్పుడూ ఉండే సెక్యూరిటీ, ఇంట్లో ప‌ని చేసే స్టాఫ్‌, ప‌ర్స‌న‌ల్ స్టాఫ్‌… ఇలా చెప్పుకుంటూ పోతే అగ్ర‌హీరోల‌కు ఎవ‌రికైనా దాదాపుగా ఇలాంటి జీవిత‌మే ఉంటుంది. అదిగో, అలాంటి లైఫ్‌ను అనుభ‌వించే అగ్ర హీరోల్లో ఒక‌రే ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

ఆయ‌న గురించి సినీ అభిమానుల‌కు, ముఖ్యంగా ఆయ‌న ఫ్యాన్స్‌కు పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న‌కు ఉండే ఫ్యాన్స్‌ను అభిమానులు అనే కంటే భ‌క్తులు అంటేనే వారు ఇంకా ఎక్కువ ఆనందంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ప‌వ‌న్‌కు ఉండే క్రేజ్ అలాంటిది మ‌రి. అయితే ముందు చెప్పిన‌ట్టుగా ప‌వ‌న్‌కు కూడా విలాస‌వంత‌మైన జీవితం ఉంటుంద‌ని అందరూ అనుకుంటారు, కానీ ఆయ‌న అలా జీవించ‌డ‌ట‌. అంతేకాదు, త‌న ఖ‌ర్చుల‌కు, త‌న వ‌ద్ద ప‌నిచేసే సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు కూడా ఇప్పుడు ఆయ‌న వ‌ద్ద డ‌బ్బులు లేవ‌ట‌. మొన్నా మ‌ధ్య తిరుప‌తిలో, ఇటీవ‌ల కాకినాడ‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌ల్లోనూ ప‌వ‌న్ ఇదే విష‌యాన్ని చెప్పుకొచ్చారు. త‌న సినిమాలు బాగా చూడాల‌ని, దాంతోనే డ‌బ్బులు వ‌స్తాయ‌ని, అప్పుడు స‌మాజ సేవ చేస్తాన‌ని ఆయ‌న అన్నారు. కాగా ప‌వ‌న్ గ‌డిపే నిరాడంబ‌ర‌మైన జీవితం ప‌ట్ల‌, ఆయ‌న చెబుతున్న డ‌బ్బులు లేవ‌నే మాట‌ను దృష్టిలో ఉంచుకుని ఓ జాతీయ దిన‌ప‌త్రిక ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఓ ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

pawan-kalyan
ఆ జాతీయ దిన‌ప‌త్రిక ప్ర‌చురించిన క‌థ‌నంలోనూ ప‌వ‌న్ ఎంత‌టి నిరాడంబ‌ర‌మైన జీవితాన్ని గడుపుతాడో వివ‌రించారు. త‌నకు సినిమాల ద్వారా వ‌చ్చే పారితోషికంలో ఎక్కువ భాగం సామాజిక సేవ కోస‌మే ఖ‌ర్చు చేస్తాడ‌ట ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఎవ‌రైనా ఆప‌ద ఉంద‌ని వ‌స్తే చాలు త‌న‌కు సాధ్య‌మైనంత వ‌ర‌కు 100 శాతం వారికి సాయం చేయాల‌నే ప‌వ‌న్ చూస్తాడ‌ట‌. అంతేకాదు, త‌న వ‌ద్ద ప‌నిచేస్తున్న ఆఫీస్ స్టాఫ్‌కు, ఇంట్లోని ప‌నివారికి, త‌నకు సెక్యూరిటీగా ఉండే 12 మందికి, ఫాం హౌస్‌లో ఉండే 25 మందికి నెల నెలా ఠంచ‌నుగా జీతాలు ఇచ్చేస్తాడ‌ట ప‌వ‌న్‌. త‌న వ‌ద్ద డ‌బ్బు లేక‌పోయినా త‌న ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న స్టాఫ్‌కు మాత్రం ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూసుకుంటాడ‌ట‌.

ఈ క్రమంలోనే ప‌వ‌న్ తన సంపాద‌న‌లో ఎక్కువ భాగం ఇలా ఖ‌ర్చు చేయ‌బ‌ట్టే డబ్బులు కూడా ఏం వెన‌కేసుకోలేద‌ట‌. అంతేకాదు, జ‌న‌సేన పార్టీ పెట్టిన ద‌గ్గ‌ర్నుంచీ తాజాగా నిర్వ‌హించిన స‌భ‌లు, స‌మావేశాల వ‌ర‌కు మొత్తం ప‌వ‌నే సొంత ఖ‌ర్చుల‌తో భ‌రించాడ‌ట‌. ఇత‌ర పార్టీల్లా విరాళాలు, చందాలు ఏమీ తీసుకోకుండానే త‌న సొంత ఖ‌ర్చుల‌తో పార్టీని న‌డిపిస్తున్నార‌ట‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించిన ఇలాంటి ఎన్నో విష‌యాల‌ను ఆ జాతీయ ప‌త్రిక త‌న క‌థ‌నంలో ప్ర‌చురించింది. దీన్ని ఇప్పుడు చాలా మంది నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీన్ని చూసిన ప‌వ‌న్ అభిమానులు ఏమంటున్నారంటే, ప‌వ‌న్ అంత‌టి గొప్ప వ్య‌క్తి కాబ‌ట్టే తాము ఆయ‌న‌కు అభిమానుల క‌న్నా ఎక్కువ‌గా భ‌క్తులుగా మారిపోయామ‌ని అంటున్నారు. ఏది ఏమైనా ప‌వ‌న్‌లో మాత్రం ఓ గొప్ప మాన‌వ‌తా వాది దాగి ఉన్నాడ‌నేది నిర్వివాదాంశ‌మ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top