హ్యాపీడేస్ లో మా అయ్య ఎమ్మెల్యే తెలుసా.. అనే డైలాగుతో తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయిన హీరో నిఖిల్. ఆ తర్వాత తనదైన శైలిలో వైవిధ్యమైన చిత్రాలను ఎంపిక చేసుకుని పలు విజయాలను చవిచూశారు.వరస హిట్స్ తో దూసుకుపోతున్న హీరో నిఖిల్ బ్రహ్మచారి జీవితానికి స్వస్ది పలకపోతున్నాడు. ఆయన వివాహ తేదీ ఫిక్స్ అయినట్లు చిత్ర వర్గాల సమాచారం. తనకు దగ్గరి బంధువు అయిన తేజస్విని అనే అమ్మాయితో నిఖిల్ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
ఆమె ప్రముఖ వ్యాపారవేత్త ఆంజనేయులు యాదవ్ కుమార్తె అని చెబుతున్నారు. ఆగష్టు 24న నిశ్చితార్థం, అక్టోబరు తొలివారంలో వివాహం జరుగనున్నట్టు వార్త ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కానీ అంతలోనే పెళ్లి కాన్సల్ అయ్యింది అనే వార్త వచ్చింది. జాతకాలు కుదరకపోవడంతో పెళ్లి కాన్సల్ చేసారంట పెద్దలు.