ఆగష్టు 24 న “హీరో నిఖిల్” ఎంగేజ్మెంట్..! ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడో తెలుసా..? వివరాలు ఇవే..!

హ్యాపీడేస్‌ లో మా అయ్య ఎమ్మెల్యే తెలుసా.. అనే డైలాగుతో తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయిన హీరో నిఖిల్‌. ఆ తర్వాత తనదైన శైలిలో వైవిధ్యమైన చిత్రాలను ఎంపిక చేసుకుని పలు విజయాలను చవిచూశారు.వరస హిట్స్ తో దూసుకుపోతున్న హీరో నిఖిల్‌ బ్రహ్మచారి జీవితానికి స్వస్ది పలకపోతున్నాడు. ఆయన వివాహ తేదీ ఫిక్స్‌ అయినట్లు చిత్ర వర్గాల సమాచారం. తనకు దగ్గరి బంధువు అయిన తేజస్విని అనే అమ్మాయితో నిఖిల్‌ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

ఆమె ప్రముఖ వ్యాపారవేత్త ఆంజనేయులు యాదవ్‌ కుమార్తె అని చెబుతున్నారు. ఈ నెల 24న నిశ్చితార్థం, అక్టోబరు తొలివారంలో వివాహం జరగనుందట.ఇక గత ఏడాది కాలంగా నిఖిల్ కోసం ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆఖరికి వారి దగ్గరి బంధువల్లోనే మ్యాచ్ ఫిక్సవటంతో అందరూ హ్యాపీగా ఉన్నారు.అయితే ఈ వార్తపై నిఖిల్‌ నుండి అధికారిక ప్రకటన రావాల్సివుంది….తాజాగా ఓ సినిమా కోసం బరువు పెరగడానికి జిమ్ చేస్తున్నాడు నిఖిల్.. దీన్లో వెరైటీ ఏంటంటే తానే తాజాగా ఒక జిమ్‌ బిజినెస్‌ను కూడా ప్రారంభించారు.మంచి జోరు మీదున్న ఆ కుర్ర హీరో.. ఇదే ఊపులో చకచకా సినిమాలకు సంతకాలు చేసేస్తున్నాడు. స్టార్ హీరోలకన్నా సూపర్ బిజీగా మారాడు.

ఎనర్జిటిక్ హీరో నిఖిల్ ప్రస్తుతం టిన్సెల్ టౌన్ లో బిజీయెస్ట్ హీరోల్లో ఒకడిగా మారిపోయాడు. చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న నిఖిల్ ప్రస్తుతం ఓ కన్నడ సినిమా రీమేక్ కోసం బరువు పెరిగే పనిలో తలమునకలై ఉన్న సంగతి తెలిసిందే. ‘కిరిక్ పార్టీ’ రీమేక్ లో స్టూడెంట్ లీడర్‌గా కనిపించబోతున్న నిఖిల్… మరో రెండేళ్ల వరకూ ఫుల్ బిజీ అని తెలుస్తోంది.

వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులకు దగ్గరవుతున్న నిఖిల్ ఓ వైపు ‘కిరిక్ పార్టీ’ షూటింగ్‌తో బిజీగా ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ లను లైన్‌లో పెట్టేస్తున్నాడు. ఠాగూర్ మధు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కనున్న ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి.మరోవైపు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు కమిటైన నిఖిల్ జనవరి నుంచి ఈ చిత్రానికి పనిచేయబోతున్నాడని తెలుస్తోంది. ఇక చందూ మొండేటి కూడా నిఖిల్‌తో ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఏమైనా వచ్చే ఏడాది కూడా నిఖిల్ డైరీ నిండిపోవడంతో ఇప్పట్లో ఈ అబ్బాయి డేట్స్ ఆశించేవారు ప్రత్యామ్నాయం చూసుకుంటే మంచిదేమో…!

Comments

comments

Share this post

scroll to top