హీరో, దర్శకుడితో పాటు 30 మందిపై శ్రీరెడ్డి ఫిర్యాదు: సోషల్ మీడియాలో కంప్లయింట్ కాపీ!

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పెరిగిపోయింది..తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకే అవకాశాలు ఇవ్వకుండా చిన్నచూపు చూస్తున్నారు..తెలుగు అమ్మాయిలంటే కేవలం పక్కలోకే పనికొస్తారు అంటూ శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..మా అసోషియేషన్ ముందు అర్దనగ్న నిరసన తో మానవహక్కుల సంఘం స్పందించి,ఒక కమిటీవేయాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించింది.మరోవైపు నటులు,మహిళా సంఘాలు, ఎందరో జూనియర్ ఆర్టిస్టులు శ్రీరెడ్డి పోరాటానికి మద్దతు తెలిపారు..ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ని అసభ్య పదజాలంతో దూషించడంతో అందరి వ్యతిరేకత ఎదుర్కొన్న శ్రీరెడ్డి,మళ్లీ తెరపైకి వచ్చింది..ఈ సారి చట్టపరంగానే అందరిని ఎదుర్కొంటానంటూ కొంతమందిపై పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసింది..

గతకొంతకాలంగా శ్రీరెడ్డి కొందరు నటులు,దర్శకనిర్మాత లపేర్లు బయటపెడుతున్న విషయం తెలిసిందే.వారిలో శేఖర్ కమ్ముల,నాని,శ్రీరామచంద్ర,వైవా హర్ష పేర్లు ప్రముఖంగా వినిపించాయి.మరోవైపు దగ్గుబాటి అభిరామ్ ఫోటోలు లీక్ అవ్వడంతో ఆ గొడవను సద్దుమనింగించాలని ఐదు కోట్లతో శ్రీరెడ్డి నోరు మూయించాలనే ప్రయత్నాలు జరిగాయి..వీటికి శ్రీరెడ్డి తలొగ్గకపోగా,అందరి అంతు చూస్తానంటూ ఛాలెంజ్ చేసింది.న్యాయం కావాలంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లాలి కాని మీడియా దగ్గరకు కాదనే పవన్ మాటలను నిజం చేస్తూ తనను వేధించిన వారిపై బెదిరించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది..

టీవీ ఛానల్స్, సోషల్ మీడియా ద్వారా తనపై కామెంట్లు చేసిన దాదాపు 30 మందిపై  ఫిర్యాదు చేసింది. శ్రీరెడ్డి ఫిర్యాదు చేసిన వారిలో జీవిత రాజశేఖర్, కరాటే కళ్యాణి,గాయత్రి గుప్తా,షకలక శంకర్, కొందరు డైరెక్టర్లు, హీరోలు, నటీమనులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, గబ్బర్ సింగ్ బ్యాచ్, ఇంకా కొన్ని వెబ్ సైట్ల పేర్లు సైతం ఉన్నాయి.బాబు గోగినేని పై కూడా కేస్ ఫైల్ చేయడం విశేషం. తనకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన, వేధింపులకు గురి చేసి, బెదిరించి వారందరిపైనా ఆమె కేసు పెట్టారు. తన పోరాటాన్ని తప్పుబడుతూ కామెంట్లు చేసిన వారిని సైతం వదలేది లేదని స్పష్టం చేసింది..

 

Comments

comments

Share this post

scroll to top