అభిమానిపైకి నుండి దూసుకెళ్ళిన హీరో కార్!

కాకినాడలో జరిగిన  సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా విజయ యాత్ర లో అపశృతి చోటుచేసుకుంది. హీరో సాయిధరమ్ తేజ్, డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రయాణిస్తున్న కార్ ఓ అభిమాని కాలిపై నుండి దూసుకుపోయింది. దీంతో ఆ అభిమానికి కాలు విరిగింది. అక్కడే ఉన్న ఇతర  అభిమానులు 108 కి ఫోన్ చేసి అతనిని హాస్పిటల్ కు తరలించారు.

ఇటీవలే హరీష్ శంకర్ డైరెక్షన్ లో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా  సక్సెస్ ను సాధించింది. దీంతో సినిమా విజయోత్సవ యాత్రను చేపట్టింది చిత్ర యూనిట్ దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా ఆడుతున్న థియేటర్ కు వెళ్ళారు చిత్ర యూనిట్ సభ్యులు. అభిమానులు పెద్ద సంఖ్యలో గుమ్మిగూడడంతో అక్కడి నుండి వెళ్ళే క్రమంలో హీరో ప్రయాణిస్తున్న కార్ ఓ అభిమాని కాలి మీది నుండి పోయింది. దీంతోఅతని కాలు విరగింది.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top