“టీం ఇండియా”కి సెలెక్ట్ అయిన “హైదరాబాదీ” కుర్రాడు “సిరాజ్” గురించి ఈ విషయాలు మీకు తెలుసా.? అతని తండ్రి ఎవరంటే..?

అవును, నిజ‌మే మ‌రి. క‌ష్ట‌ప‌డితే సాధించ‌లేనిది అంటూ ఏదీ లేదు. అందుకు గ‌తంలో చాలా మంది జీవితాల‌ను మ‌నం ఉదాహ‌ర‌ణ‌లుగా చూశాం. ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ క‌ష్ట‌ప‌డిన వ్య‌క్తి గురించే. అత‌నే టీమిండియా క్రికెట్ ప్లేయ‌ర్ మ‌హమ్మ‌ద్ సిరాజ్‌. సిరాజ్ త్వ‌ర‌లో న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌నున్న టీ20 మ్యాచ్‌ల‌లో ఆడ‌నున్నాడు. ఇత‌ను నిజానికి ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌ఫున ఆడాడు. ఆ మ్యాచ్‌ల‌లో స‌త్తా చాట‌డంతో ఇత‌ను ఏకంగా టీమిండియా జ‌ట్టుకు సెలెక్ట్ అయ్యాడు. అయితే సిరాజ్ నిజానికి చాలా పేద కుటుంబం నుంచి వ‌చ్చాడు. అత‌ని తండ్రి ఆటో డ్రైవ‌ర్‌. పేరు మ‌హమ్మ‌ద్ గౌస్‌.

సిరాజ్ ఉండేది హైద‌రాబాద్‌లోనే. అయితే ఇత‌ను ఏ కోచింగ్ సెంట‌ర్‌లోనూ కోచింగ్ తీసుకోలేదు. కానీ క్రికెట్ అంటే ఆస‌క్తి ఎక్కువ‌. అందులో భాగంగానే ప‌లు టోర్న‌మెంట్లు ఆడాడు. హైద‌రాబాద్ అండ‌ర్ 22 జట్టులో ఉన్నాడు. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజ‌య్ హ‌రారే ట్రోఫీ, రంజీ ట్రోఫీల్లో ఇత‌నికి అవ‌కాశాలు వచ్చాయి. వ‌చ్చిన అవ‌కాశాల‌ను సిరాజ్ స‌ద్వినియోగం చేసుకున్నాడు. తాను ఆడిన మొద‌టి క్ల‌బ్ మ్యాచ్ లో ఏకంగా 20 రన్స్ ఇచ్చి 9 వికెట్లు తీశాడు. అందుకు అత‌నికి రూ.500 ఇచ్చారు. అది అత‌ని మొద‌టి సంపాదన‌. ఆ త‌రువాత సిరాజ్ వెనుదిరిగి చూడ‌లేదు. ఎన్నో టోర్న‌మెంట్లు ఆడాడు. స‌త్తా చాటాడు. అయితే సిరాజ్ మొద‌ట బ్యాట్స్‌మ‌న్‌. కానీ రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో అత‌ని సూచ‌న మేర‌కు బౌలింగ్‌లోనూ శిక్ష‌ణ తీసుకున్నాడు. అందులోనూ రాటుదేలాడు.

ఫ‌స్ట్ క్లాస్ కెరీర్ లో 14 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడిన సిరాజ్ ఏకంగా 53 వికెట్లు తీశాడు. ఒక మ్యాచ్‌లో 52 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో 116 ప‌రుగులు ఇచ్చి 9 వికెట్లు నేల‌కూల్చాడు. ఐపీఎల్ లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడాడు. అందుకు గాను ఆ జ‌ట్టు యాజ‌మాన్యం రూ.2.60 కోట్ల‌తో సిరాజ్‌ను కొనుగోలు చేసింది అంటేనే సిరాజ్ ఎంత‌టి ప్ర‌తిభావంతుడో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఆ త‌రువాత ఇండియా ఎ జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు. వివిధ దేశాల్లో ఆడి స‌త్తా చాటాడు. ఈ క్ర‌మంలోనే తాజాగా సిరాజ్‌ను టీమిండియా జ‌ట్టులోకి తీసుకున్నారు. దీంతో న‌వంబ‌ర్ 1వ తేదీన ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జ‌ర‌గ‌నున్న టీ20 మ్యాచ్‌తో సిరాజ్ త‌న అంత‌ర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించ‌నున్నాడు. కేవ‌లం టీ20 లు మాత్ర‌మే కాక‌, వ‌న్డేలు, టెస్ట్ మ్యాచ్‌ల‌కు కూడా భార‌త జ‌ట్టు త‌ర‌ఫున ఆడాల‌ని ఇత‌ను క‌ల‌లు కంటున్నాడు. ఇత‌ని ఆశ‌యం నెర‌వేరాల‌ని మ‌న‌మూ కోరుకుందాం. మ‌రో హైద‌రాబాదీ ఆట‌గాడికి బెస్టాఫ్ ల‌క్ చెబుదాం..!

Comments

comments

Share this post

scroll to top