భ‌ర్త నుంచి విడిపోయిన భార్య పిల్ల‌ల భ‌విష్య‌త్తుకు ఇలా ప్లాన్ చేసుకోవాలి..!

ఏ కార‌ణంతో అయినా కావ‌చ్చు భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ విడాకులు తీసుకుంటే వారిలో నిజానికి భార్య‌కే ఎక్కువ అన్యాయం జ‌రుగుతుంది. ఎందుకంటే భ‌ర్త సంపాదించేవాడు, భార్య గృహిణి అయి ఉండే వారే ఎక్కువ‌. క‌నుక అలాంటి వారిలో భార్య‌కే అన్యాయం జ‌రుగుతుంది. ఈ సంద‌ర్భంలో భార్య భ‌ర్త నుంచి భ‌ర‌ణం కోర‌వ‌చ్చు. ఇక భ‌ర్త పిల్ల‌ల్ని వ‌ద్ద‌నుకుంటే భార్యే వారి సంర‌క్ష‌ణ బాధ్య‌త‌లు తీసుకోవాలి. చాలా వ‌ర‌కు భ‌ర్త‌కే పిల్ల‌ల సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ను అప్ప‌గించేలా కోర్టులు తీర్పు చెబుతాయి. కానీ కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో భార్య‌ల‌కు పిల్ల‌ల సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ల‌ను కోర్టులు అప్ప‌గిస్తాయి. అలాంటి త‌రుణంలో భార్య గృహిణి అయితే కుటుంబ భారం ఆమెపై ప‌డుతుంది. ఓ వైపు పిల్ల‌ల్ని పోషించాలి, వారికి విద్యాబుద్ధులు చెప్పించాలి, మ‌రో వైపు సంపాదించాలి. దీంతో గృహిణి అయిన భార్య భ‌ర్త నుంచి విడిపోతే అలాంటి సంకట స్థితి ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో అలాంటి మ‌హిళ‌లు ఆర్థికంగా ఎలాంటి స‌మ‌స్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

భ‌ర్త నుంచి విడిపోయి పిల్ల‌ల సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ల‌ను తీసుకున్న మ‌హిళ‌లు భ‌ర్త నుంచి వ‌చ్చే భ‌ర‌ణంతోపాటు త‌మ సంపాద‌న‌తో పిల్ల‌ల‌ను పోషించ‌వ‌చ్చు. ఇక త‌మ త‌ల్లిదండ్రులు, సోద‌రులు లేదా స్నేహితులను అడిగి ఆర్థిక స‌మ‌స్య‌లు రాకుండా ఉండేందుకు త‌గిన స‌హాయం చేయ‌మ‌ని కోర‌వ‌చ్చు. లేదంటే ఆర్థిక ప్ర‌ణాళిక‌ల‌ను తెలియ‌జేసే అకౌంటెంట్స్ వ‌ద్ద‌కు వెళ్లి సూచ‌న‌లు అడిగి తెలుసుకోవ‌చ్చు. ఇక దీంతోపాటు భ‌ర్త నుంచి ల‌భించే భ‌రణాన్ని దీర్ఘ‌కాలిక ఆర్థిక ప్ర‌యోజ‌నాల కోసం వివిధ మార్గాల్లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. అందుకు మ్యుచువ‌ల్ ఫండ్స్ పనికొస్తాయి. లేదంటే ఫిక్స్‌డ్ డిపాజిట్స్ చేయ‌వ‌చ్చు. లేదా భ‌ర‌ణం ఎక్కువ‌గా వ‌స్తుంటే రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.

భ‌ర్త నుంచి విడాకులు పొందిన భార్య త‌న పిల్ల‌ల సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ల‌ను తానే చూసుకునే నేప‌థ్యంలో లైఫ్ ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను కూడా తీసుకోవాలి. ఎందుకంటే త‌నకు ఏదైనా జ‌రిగితే పిల్ల‌ల భ‌విష్య‌త్తుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. క‌నీసం రూ.1 కోటి లైఫ్ క‌వ‌ర్ అందించేలా పాల‌సీ తీసుకుంటే బెట‌ర్‌. మ‌హిళ వ‌య‌స్సు 30 సంవ‌త్స‌రాలు ఉంటే ఏడాదికి రూ.15వేల‌తో ఆ ఇన్సూరెన్స్ ల‌భిస్తుంది. వీలుంటే నెల‌వారీగా రూ.1200 కూడా క‌ట్ట‌వ‌చ్చు. దీంతో పిల్ల‌ల భ‌విష్య‌త్ సుర‌క్షితంగా ఉంటుంది.

నేటి త‌రుణంలో పిల్ల‌ల చ‌దువుల కోసం మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో చైల్డ్ ప్లాన్ పేరిట ప‌లు ప్లాన్స్ ల‌భిస్తున్నాయి. వాటిపై మ‌హిళ‌లు దృష్టి సారించాలి. అలాగే ఈ ప్లాన్ల‌లో లాంగ్ ట‌ర్మ్ ప్లాన్లు అయితే బెట‌ర్‌. దీంతో పిల్ల‌ల‌కు 18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌చ్చే నాటికి వారికి మెచూరిటీ సొమ్ము పెద్ద మొత్తంలో ల‌భిస్తుంది. అది వారి ఉన్న‌త విద్య లేదా ఆడ‌పిల్ల అయితే పెళ్లికి ప‌నికొస్తుంది. ఈ చైల్డ్ ప్లాన్‌లో నెల‌కు రూ.10వేలు పెడితే పిల్ల‌ల వ‌య‌స్సు 10 సంవ‌త్స‌రాలు ఉంటే వారికి 18 ఏళ్లు వ‌చ్చే స‌రికి చేతికి రూ.17 ల‌క్ష‌లు అందుతాయి.

మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెడితే పిల్ల‌ల చ‌దువుల‌కు ప‌నికొచ్చేలా లాంగ్ ట‌ర్మ్ ప్లాన్ల‌ను తీసుకోవ‌డం బెట‌ర్‌. ఇవి ఎక్కువ మొత్తంలో సొమ్ము వ‌చ్చేలా చేస్తాయి. అలాగే రిస్క్ ఫ్యాక్ట‌ర్ త‌క్కువ‌గా ఉంటుంది. ఈ ప్లాన్లు ఈక్విటీ మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో ల‌భిస్తాయి. అలాగే చైల్డ్ ప్లాన్స్‌లోనూ ఇలాంటి బెనిఫిట్సే ఉంటాయి. వీటికి ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు చ‌ట్టం 80సి కింద రాయితీ ల‌భిస్తుంది. ఇక మ‌హిళ‌లు తమ పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం ఆచి తూచి అడుగు వేయాలి. ఎవ‌రో ఏదో చెప్పార‌ని రాంగ్ స్టెప్ తీసుకోరాదు. లేదంటే వారి భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతుంది..!

 

Comments

comments

Share this post

scroll to top