“గాంధీ” గారి మునిమనవరాలిని చూసారా? ఆమె ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్..ఎందుకో తెలుసా?

మ‌హాత్మా గాంధీ అంటే తెలియ‌ని వారుండ‌రు. మ‌న దేశంలో పుట్టిన వారికే కాదు, అనేక దేశాల వారికి గాంధీజీ గురించి తెలుసు. విద్యార్థుల‌కైతే చిన్న‌ప్పుడు పాఠ్యాంశాల్లో గాంధీజీ గురించి చెబుతారు. ఆయ‌న దేశానికి చేసిన సేవ‌, స్వాతంత్ర్యం కోసం ఆయ‌న పోరాడిన తీరు, అహింస‌, శాంతి, మాన‌వ‌త్వం వంటి గాంధీజీ గుణాల గురించి అంద‌రికీ తెలుసు. అందుకే ఆయ‌న్ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని చెబుతుంటారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో గాంధీ అనే ఓ పేరు ఇంట‌ర్నెట్‌లో.. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే ఆ పేరు మ‌హాత్మా గాంధీది కాదు, మ‌రెవ‌రిది అంటే.. ఆయ‌న ముని మ‌న‌వ‌రాలిది..!

మ‌హాత్మాగాంధీ కొడుకు హ‌రిలాల్ ఉన్నారు క‌దా. ఆయ‌న కుమారుడు కాంతిలాల్ అమెరికాలో స్థిర ప‌డ్డారు. అంటే ఈయ‌న గాంధీజీకి మ‌న‌వ‌డ‌న్న‌మాట‌. ఇక ఈయన కూతురే మేథా గాంధీ. ఈమె గాంధీజీకి ముని మ‌న‌వ‌రాలు అవుతుంది. అయితే ఇప్పుడీమె గురించే సోష‌ల్ మీడియాలో వార్తలు వైర‌ల్ అవుతున్నాయి. ఎందుకో తెలుసా..? ఆమె లైఫ్ స్టైల్‌, వేష ధార‌ణ‌, ఇత‌ర అంశాల వ‌ల్ల‌. గాంధీ మ‌న‌వ‌రాలు అన‌గానే ఈమె సాంప్ర‌దాయ బ‌ద్దంగా ఉంటుంద‌నుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్టే. ఎందుకంటే అమెరికాలో పుట్టి పెరినందువ‌ల్ల పూర్తిగా అదే క‌ల్చ‌ర్‌ను ఈమె ఫాలో అవుతుంది. అందుకే లైఫ్ స్టైల్‌, వేష ధార‌ణ అందుకు త‌గిన విధంగా ఉంటాయి.

ఈ క్ర‌మంలోనే ఓ వైపు గాంధీ మ‌న‌వ‌రాలు అయి ఉండి, మ‌రో వైపు అంత‌టి మోడ్ర‌న్ లైఫ్ స్టైల్ లో జీవిస్తున్నందునే ఆమె ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆమె ఫొటోలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంల‌లో సంద‌డి చేస్తున్నాయి. దీంతో చాలా మంది గాంధీ మ‌న‌వ‌రాలు ఇలా చేస్తున్న‌దేమిటి..? అని ముక్కున వేలేసుకుంటుండ‌గా, కొంద‌రు ఆమెకు స‌పోర్ట్ ఇస్తున్నారు. అయితే ఈ విష‌యాల గురించి ప‌క్క‌న పెడితే నిజానికి మేథా గాంధీ ఓ చ‌క్క‌ని సింగ‌ర్‌, యాక్ట‌ర్‌. ఈమె ర‌చ‌యిత కూడా. తాను చేసే కొన్ని షోల‌కు ఈమె ప్రొడ్యూస‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటుంది. ఇక ఈమె ఓహియోలో చేసిన The Dave and Jimmy Show చాలా పాపుల‌ర్ అయింది. అదేవిధంగా Matty In The Morning అనే షోను ఈ మ‌ధ్యే ఆమె చేసింది.

సోష‌ల్ మీడియాలోనూ మేథా గాంధీ ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఈమె సోష‌ల్ మీడియాలో babyhotsauce అనే పేరిట పాపుల‌ర్ అయింది. అందులో ఎప్ప‌టిక‌ప్పుడు తన యాక్టివిటీల గురించి ఈమె ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈమెకు ఇన్‌స్టాగ్రాంలో 52వేల మంది వ‌ర‌కు ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఇక మేథా గాంధీకి టూర్‌లు వేయ‌డ‌మ‌న్నా, ఫొటోగ్రఫీ అన్నా చాలా ఇష్ట‌మ‌ట‌. ఈమె జంతువులను ఎక్కువ‌గా ప్రేమిస్తుంద‌ట‌. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం మేథా గాంధీ ఇంట‌ర్నెట్ స్టార్ అయిపోయింది. ఓ వైపు గాంధీ ముని మ‌న‌వ‌రాలిగా పేరు కంటే ఈమె త‌న సొంత టాలెంట్‌తోనే చాలా మందికి ప‌రిచ‌యం అయింది. తీరా ఈమె గాంధీ ముని మ‌న‌వ‌రాలు అని తెలిసే స‌రికి ఇప్పుడీ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది..!

Soooo apparently you can’t see my last post if you don’t have the update? Perfect start Take 2: If someone asked me what I wanted to do with my life, (besides be on with @mattyinthemorning), I’d say be a voiceover for cartoons, write my own sitcom, and do a lifestyle show with my best friend where we could speak with other young women about… wait for it… life 🌚 Tonight, I get to fulfill one of those dreams. At 10pm on Kiss 108, @ashleefeldman and I are going LIVE, and our boss is terrified of what might happen. We’re notorious for oversharing and saying things we probably shouldn’t. This COULD be our first and last show ever, so give us a shot 💚 If you’re not in the the area, you can get the I heart radio app fo’ free ninety nine, and listen that way. Forget the Kardashians, Taylor’s Girl Squad, and the nutcases who make up the Beehive. We wanna show you what Girls These Days are REALLY about. Call us 617-931-1108 We love our jobs, and we love each other even more. So lucky us for getting this opportunity TOGETHER. Yes, I’m speaking for her too. I know her phone code, and she grocery shops for me, so I’m allowed. Fingers crossed. Leggo 😱 #GirlsTheseDays #CallUs #Kiss108 #GoBestFriend #ThatsMyBestFriend @russmezphoto Thanks for killing it for us

A post shared by Medha Gandhi (@babyhotsauce) on

Comments

comments

Share this post

scroll to top