మీ టెన్త్ మెమో, ఆధార్‌, ఓట‌ర్ ఐడీ, వాహ‌న ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్….అన్నీ ఇక్కడి నుండి ఫ్రీగా పొందొచ్చు.

ఉన్న ప‌ళంగా మీకు 10వ త‌ర‌గ‌తి మెమో జిరాక్స్ కావాలా..? లేదంటే ఆధార్‌, ఓట‌ర్ ఐడీ, వాహ‌న ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్ల‌లో వేటితోనైనా అవ‌స‌రం ఉందా..? అయితే మీరు ఇక‌పై ఎక్క‌డికీ వెళ్లాల్సిన ప‌నిలేదు. చేతిలో ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలు. లేదంటే మీకు ద‌గ్గ‌ర్లో ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ ఉన్న పీసీ ఉంటే చాలు. వెంట‌నే మీరు స‌ద‌రు డాక్యుమెంట్ల‌ను యాక్సెస్ చేసుకోవ‌చ్చు. వాటితో కావల్సిన ప‌నుల‌ను పూర్తి చేసుకోవ‌చ్చు. ఎందుకంటే కేంద్ర ప్ర‌భుత్వం ఇప్పుడు తాజాగా డిజిలాక‌ర్ అనే ఓ కొత్త సేవ‌ను మ‌న ముందుకు తీసుకువ‌చ్చింది. దీంట్లో రిజిస్ట్రేష‌న్ చేసుకుని సంబంధిత ప‌త్రాల‌ను అప్‌లోడ్ చేస్తే చాలు. ఇక‌పై మీ ఫైల్స్ అన్నీ దాంట్లో సుర‌క్షితంగా ఉంటాయి. అంతేకాదు, మీకు ఎప్పుడు అవ‌స‌రం వ‌స్తే అప్పుడు వాటిని యాక్సెస్ చేసుకోవ‌చ్చు.

digilocker-mobile

డిజిలాక‌ర్ రిజిస్ట్రేష‌న్ ఇలా…
* ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ ఉన్న కంప్యూట‌ర్ అయితే https://digilocker.gov.in/ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అదే ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వారైతే గూగుల్ ప్లే స్టోర్‌లో DigiLocker అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఓపెన్ చేయాలి. దాంట్లో సైన్ అప్ అనే బ‌ట‌న్‌ను ప్రెస్ చేయాలి.

* అప్పుడు మీ మొబైల్ నంబ‌ర్‌ను అడుగుతుంది. అందులో మొబైల్ నంబ‌ర్‌ను టైప్ చేసి ఎంట‌ర్ ప్రెస్ చేయ‌గానే మీ ఫోన్‌కు ఓటీపీ ఎస్ఎంఎస్ వ‌స్తుంది. దాన్ని బాక్స్‌లో ఎంట‌ర్ చేసి వెరిఫై బ‌ట‌న్‌ను ప్రెస్ చేయాలి.

* అనంత‌రం మ‌రో పేజీ ఓపెన్ అవుతుంది. దాంట్లో యూజ‌ర్ నేమ్‌, పాస్‌వ‌ర్డ్‌ల‌ను సెట్ చేసుకుని సైన‌ప్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేయాలి. అనంత‌రం వ‌చ్చే పేజీలో ఆధార్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయ‌మ‌ని అడుగుతుంది. అందుకోసం ఫింగ‌ర్ ప్రింట్ లేదా మొబైల్ ఓటీపీతో వెరిఫికేష‌న్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

* అయితే ఆధార్ లేని వారు కింది భాగంలో ఇచ్చిన డోన్ట్ హావ్ ఆధార్ ను ప్రెస్ చేసి ముందుకు సాగాలి. ఆధార్ నంబ‌ర్ ఎంట‌ర్ చేసి, ఓటీపీ వెరిఫికేష‌న్ చేయ‌గానే రిజిస్ట్రేష‌న్ పూర్త‌వుతుంది. దీంతో మీరు డిజిలాక‌ర్ అకౌంట్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

digilocker-web

ఏ డాక్యుమెంట్‌నైనా అప్‌లోడ్ చేయ‌వచ్చు…
డిజిలాక‌ర్ అకౌంట్ క్రియేట్ అవ‌గానే అందులో మీరు మీ ఈ-మెయిల్‌ను వెరిఫై చేసుకోవాలి. త‌రువాత డిజిలాక‌ర్ అకౌంట్‌లోకి మీకు చెందిన ఏదైనా డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేసుకోవ‌చ్చు. పైన చెప్పిన‌ట్టుగా 10వ త‌ర‌గ‌తి మెమో లేదా ఇత‌ర విద్యార్హ‌త ప‌త్రాలు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, వాహ‌న ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అన్ని ప‌త్రాల‌ను అప్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అయితే ఏ డాక్యుమెంట్‌నైనా ముందుగా స్కాన్ చేసుకుని దాన్ని .PDF, .JPEG, .JPG, .GIF, .PNG, .BMP వంటి ఫైల్ ఫార్మాట్‌ల‌లో ఒక్కో ఫైల్ సైజ్ 1 MB కి మించ‌కుండా సేవ్ చేయాలి. అనంత‌రం ఆ ఫైల్‌ను డిజిలాక‌ర్‌లోకి అప్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో మీరు ఒక వేళ వాహ‌నంపై వెళ్తున్న‌ప్పుడు ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప‌త్రాలు లేకున్నా మొబైల్‌లో ఉన్న డిజిలాక‌ర్ అకౌంట్ ఓపెన్ చేసి అందులోని ప‌త్రాల‌ను చూపిస్తే స‌రిపోతుంది. అంతేకాదు, ఆయా ఫైల్స్‌ను మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మ‌ళ్లీ తిరిగి వాడుకోవ‌చ్చు. అవ‌స‌రం అనుకుంటే ప్రింట్‌, జిరాక్స్ కూడా తీసుకోవ‌చ్చు. కాగా డిజిలాక‌ర్‌లో మీరు ఏ డాక్యుమెంట్‌నైనా సేవ్ చేసుకునే స‌దుపాయం ఉండ‌గా, ఒక్కో యూజ‌ర్‌కు 1 జీబీ వ‌ర‌కు స్టోరేజ్ స్పేస్‌ను ఉచితంగా అందిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ స్పేస్‌ను మ‌రింత పెంచే అవ‌కాశం ఉంది.

Comments

comments

Share this post

scroll to top