హీరోయిన్ అవ్వాలనుకుంది…ఎయిర్ హోస్టెస్ అయ్యి చివరికి జైలుకి వెళ్ళింది! కారణం ఏంటో తెలుసా?

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ వీర‌ప్పన్ గురించి తెలియ‌ని వారుండ‌రు. ద‌క్షిణాది రాష్ట్రాలను గ‌డ‌గ‌డ‌లాడించిన వ్య‌క్తి ఇత‌ను. స్మ‌గ్లింగ్ ఇత‌ని ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు. లోక‌ల్ మాఫియా డాన్‌గా ఎదిగినా చివ‌ర‌కు పోలీసుల చేతుల్లో చ‌నిపోయాడు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ వ్య‌క్తి గురించే. ఆమె లేడీ వీర‌ప్ప‌న్. ఆమె గురించి తెలిస్తే మీరూ అదే అంటారు. అదేనండీ… ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ చేస్తూ అనేక కేసుల్లో త‌ప్పించుకు తిరుగుతుందే… ఆమే… సంగీత చ‌ట‌ర్జీ..!

సంగీత చ‌ట‌ర్జీది కోల్‌క‌తాలోని నేతాజీన‌గ‌ర్‌. ఆమె గ్రాడ్యుయేష‌న్ అవ‌గానే చిన్న చిన్న టీవీ యాడ్స్‌లో న‌టించేది. ఆ త‌రువాత ఎయిర్ హోస్టెస్ అయింది. ఎప్ప‌టికైనా బాలీవుడ్ న‌టిగా ఎద‌గాల‌ని ఆమె క‌ల‌. అయితే ఆ క‌ల నెర‌వేర‌లేదు. ఓ వ్య‌క్తితో ఏర్ప‌డిన ప‌రిచ‌యం అనేక మ‌లుపులు తిరిగి ఇప్పుడు ఆమెను జైలులో ప‌డేలా చేసింది. కోల్‌క‌తా లో జ‌రిగిన ఓ పార్టీలో మ‌ణిపూర్‌కు చెందిన ఎర్ర చంద‌నం స్మ‌గ్ల‌ర్ ఎం.లక్ష్మ‌ణ్‌తో సంగీత‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అప్ప‌టికే ల‌క్ష్మ‌ణ్ త‌న మొద‌టి భార్య‌కు దూరం కావ‌డంతో సంగీత అత‌నికి ద‌గ్గ‌రైంది. ఈ క్ర‌మంలో ఆమె కూడా ల‌క్ష్మ‌ణ్ కార్య‌క‌లాపాల్లో భాగస్వామి అయింది. ఓ ద‌శ‌లో అత‌ని ఆర్థిక లావాదేవీలు అన్నీ ఆమే చ‌క్క బెట్టేది. ఇందుకు గాను మొత్తం 9 బ్యాంకు అకౌంట్ల‌ను ఆమె ఆప‌రేట్ చేసింది. ఒక్కో అకౌంట్ నుంచి కోట్లాది రూపాయ‌లను ఆమె ట్రాన్స్ ఫ‌ర్ చేసేది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తోపాటు దేశంలోని ఇత‌ర రాష్ట్రాలలో ఉన్న ఎర్ర చంద‌నంను స్మ‌గ్లింగ్ చేయ‌డం, విదేశాల‌కు త‌ర‌లించ‌డం, డ‌బ్బు చేసుకోవ‌డం… ఇదీ జ‌రిగే తంతు. ఈ క్ర‌మంలో సంగీత చ‌టర్జీ బాగానే వెన‌కేసింది. ఆమెకు రూ.100 కోట్ల వ‌ర‌కు ఆస్తులు ఉన్న‌ట్టు పోలీసులు గుర్తించారు. కోల్‌క‌తాలోని నేతాజీన‌గ‌ర్‌లోనే కోట్ల రూపాయ‌ల విలువ చేసే 4 ఇళ్లు ఆమెకు ఉన్నాయ‌ట‌. అంతేకాదు, త‌మ ప్ర‌యాణంలో ల‌క్ష్మ‌ణ్‌ను సంగీత పెళ్లి కూడా చేసుకుంద‌ట‌. ఆమె అత‌నికి రెండో భార్య‌. కాగా ఈ మ‌ధ్యే పోలీసులు జ‌రిపిన దాడిలో ఆమె ప‌ట్టుబ‌డింది. ఈ క్ర‌మంలో వారు ఆమె ఇళ్ల‌ను, బ్యాంక్ అకౌంట్ల‌ను సీజ్ చేశారు. అంతేక‌దా మ‌రి… చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాలకు పాల్ప‌డితే ఎవ‌రికైనా చివ‌ర‌కు అదే గ‌తి ప‌డుతుంది. ఏది ఏమైనా సంగీత చ‌ట‌ర్జీ మాత్రం తానొకటి త‌లిస్తే దైవం ఒక‌టి త‌ల‌చింది. బాలీవుడ్ న‌టిగా ఎద‌గాల‌నుకుంది, చివ‌ర‌కు క‌ట‌క‌టాల పాలైంది..!

Comments

comments

Share this post

scroll to top