ఇదేంటి హేమా మేడమ్.! అక్కడ అల్లకల్లోలం అవుతుంటే ఇక్కడ ఫోటోకి ఫోజులా?

BJP ఎంపి. హేమామాలినిపై సోషల్ మీడియా మండిపడుతుంది. మీ నియోజకవర్గం తగలబడిపోతుంటే…    మీరు  సినిమా షూటింగ్ లో ఫోటోలు దిగి వాటిని ట్విట్టర్ లో షేర్ చేస్తారా? అంటూ సామాజిక మాధ్యమాలు  తమ కామెంట్స్ తో  హేమామాలినిని  తిట్టి పోస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని మధుర లో భూదురాక్రమణ కు సంబంధించి పోలీసులకు ఆందోళన కారులకు మద్య జరిగిన ఘర్షణలో 24 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అక్కడ అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో ఓ షూటింగ్ లో పాల్గొన్న హేమామాలిని..ఈ రోజు షూటింగ్ లో చాలా ఎంజాయ్ చేశానంటూ ట్వీట్ చేశారు.

దీనిపై సోషల్ మీడియా ఒక్కసారిగా భగ్గుమంది. మీ నియోజకవర్గం తగలబడిపోతుంటే మీరు ఫోటోలకు ఫోజులిస్తారా? అంటూ ప్రశ్నల దాడి చేశారు. సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న కామెంట్స్ ను గమనించి ఉదయం ట్విట్టర్ లో చేసిన పోస్ట్ ను డిలేట్ చేశారు. తర్వాత ప్రజలు సంయమనం పాటించాలని ట్వీట్ చేశారు.

ఈ టోటల్ ఇష్యూ మీద మీడియా ప్రతినిధులు హేమామాలినిని ప్రశ్నించినప్పుడు….ఈ సినిమాకు సంబంధించిన కాల్షీట్లు నేను ఎప్పుడో ఇచ్చాను, ఈ ఘటన జరుగుతుందని నాకు తెలియదు కదా.!  అంటూ సమాధానం ఇచ్చారు.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top