మా నెత్తిన హెల్మెట్ పెట్టకండి. అంటూ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు.

మా నెత్తిన హెల్మెట్ పెట్టకండి. అంటూ ప్రభుత్వానికి  ఓ సగటు మద్యతరగతి పౌరుడు రాసిన  బహిరంగ లేఖ ఇది.

యాస్ ఇట్ ఈస్ గా మీకోసం.

మా నెత్తిన హెల్మెట్ పెట్టకండి..? మా తలను ఎలా రక్షించుకోవాలో మాకు తెలియదా? మా తల గురించి ప్రభుత్వానికి ఎందుకంత బాధ? మా తలను అడ్డంపెట్టుకుని అడ్డమైన హెల్మెట్‌ కంపెనీలు వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తున్నదెవరు? హెల్మెట్‌ వల్ల రక్షణ వుంటుందనుకుంటే…స్వచ్ఛందంగా హెల్మెట్‌ కొని వేసుకోమా? మీరు ఎందుకు బలవంతపెడుతున్నారు? నిజంగా మా తలను రక్షించాలన్న తపనా…హెల్మెట్‌ కంపెనీలను వ్యాపారాన్ని పెంచిపోషించే ప్రయత్నమా? హెల్మెట్‌ వేసుకోనందుకు రూ.1000 ఫైన్‌ వేస్తున్నారే….రోడ్లు అంత ఛండాలంగా వున్నందుకు ప్రభుత్వానికి ఎప్పుడైనా ఫైన్‌ వేశారా?

మద్యం సేవించడం వల్ల సంసారాలు నాశనమవుతున్నాయే…ఏనాడైనా మద్యం తయారీ కంపెనీలకు ఫైన్‌ వేశారా? ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి ఫైన్‌ వేశారా? మద్యం వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయని, మనుషులు చస్తున్నారని జనం గగ్గోలు పెడుతున్నా ఎందుకు పట్టించుకోరు? అవి చావులు కావా? మద్యం దుకాణాలను కోర్టులు ఎందుకు నిర్భందంగా మూసివేయించవు?

ప్రాణాంతకమైన వ్యాధులతో ఎందరో చస్తున్నారే…ఇలాంటి వాళ్లకు ఇంతే నిర్భందంగా వైద్యం ఎందుకు చేయించరు? సిగరెట్ తాగే వాళ్ళు అ పొగ పిల్చే వారు ఇద్దరి ఆరోగ్యం పాడవుతున్న సిగరెట్ ఎందుకు ఆపరు …తాగడానికి మంచి నీళ్లు దొరక్క…వ్యాధుల బారినపడి మరణిస్తున్నారే…నిర్భందంగా మంచినీళ్లు ఎందుకివ్వరు?

ఇవి అందించలేని   ప్రభుత్వాలకు ఎందుకు ఫైన్‌ వేయరు? ఇలాంటివి ఎన్నోవున్నాయి….వాటిని చూడండి. రక్షించే పేరుతో మా నెత్తిన హెల్మెట్‌ పెట్టకండి. మా తలను ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు…AC  గదుల్లో 10 మంది కూర్చుని రాసేది చట్టం అయితే లక్షల మంది ప్రజలు వ్యతిరేకిస్తే అది శాసనం అవుతుంది .. మాకు ఇష్టం లేని చట్టాలు మా నెత్తిమీద పెట్టొద్దు ప్లీజ్ .

ఇట్లు.

  • ఓ మద్యతరగతి పౌరుడు.

Comments

comments

Share this post

0 Replies to “మా నెత్తిన హెల్మెట్ పెట్టకండి. అంటూ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు.”

  1. Bharani says:

    Your questions are reasonable and timely. BUT please do not say no to helmet. It saves our lives and our dependents. (by experience). Ask for protective helmets and do not accept fakes and show pieces

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top