హెల్మెట్ ధరిస్తే కానీ ఇంజిన్ ఆన్ అవ్వదు !! అద్భుతమైన ఆవిష్కరణ చేసిన ఔరంగాబాద్‌ కుర్రాడు.

శరీరంలోని అన్ని అవయవాలకంటే కూడా తలకు విశిష్టమైన స్థానం ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. తలలో భద్రంగా ఉండే మెదడు అన్ని శరీర భాగాల చేత పని చేయిస్తుంది. శరీర సమతుల్యతను కాపాడుతుంది. ఏదేని ప్రమాదం జరిగినప్పుడు మెదడుకు దెబ్బ తగిలితే, తగిలిన చోట ఉన్న మెదడు కణాలు నశిస్తాయి. దీంతో ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. అందుకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెబుతారు. 2015 లో భారతదేశంలో 1,46,133 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించారు. ఈ సమస్యని గమనించిన ఒక కుర్రాడు హెల్మెట్ ధరిస్తే కానీ ఇంజిన్ ఆన్ అవ్వని పరికరం తయారు చేసాడు.

రోహిత్ తయారు చేసిన ఆ పరికరంలో రెండు పార్ట్‌లు ఉంటాయి. ఒక పార్ట్‌ను హెల్మెట్‌కు అమరుస్తారు. మరో పార్ట్‌ను వాహనం ఇగ్నిషన్ వద్ద అమరుస్తారు. ఈ రెండూ కూడా ఇన్‌ఫ్రారెడ్ తరంగాల ఆధారంగా పనిచేస్తాయి. ఈ పరికరంలో రెండు పార్ట్‌లు ఉంటాయి. ఒక పార్ట్‌ను హెల్మెట్‌కు అమరుస్తారు. మరో పార్ట్‌ను వాహనం ఇగ్నిషన్ వద్ద అమరుస్తారు. ఈ రెండూ పార్ట్స్ ఇన్‌ఫ్రారెడ్ తరంగాల ఆధారంగా పనిచేస్తాయి.

ఒక వేళ వాహనం నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోతే అందులో ఉన్న పార్ట్ నుంచి సిగ్నల్ రాదు. సిగ్నల్ రాకపోతే వాహనం ఇగ్నిషన్ వద్ద ఉన్న రెండో పార్ట్ యాక్టివేట్ అవదు. అప్పుడు ఇంజిన్ ఎట్టి పరిస్థితిలోనూ ఆన్ అవదు. దీంతో హెల్మెట్ తప్పకుండ ధరిస్తారు. ఈ పరికరం తయారు చెయ్యడానికి కేవలం రూ.300 మాత్రమే అయినట్లు రోహిత్ తెలిపాడు, ఈ పరికరాన్ని అతను 150 సార్లు పరీక్షించాల్సి వచ్చిందట. తన పరికరాన్ని ఔరంగాబాద్ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్‌కు చూపించగా ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లేలా సహాయపడ్తానని తెలిపారు. రోహిత్ ఇంకా తన పరికరాన్ని అమ్మకానికి పెట్టలేదట.

Comments

comments

Share this post

scroll to top