హలో’ చిత్ర యూనిట్‌కు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. అఖిల్ అక్కినేని నటించిన ‘హలో’ మూవీ రిలీజ్ దగ్గర పడుతుంటే అనుకోని షాక్ తగిలింది… కాపీ రైట్ క్లెయిమ్ కింద యూట్యూబ్ ‘హలో’ టీజర్‌ను తొలగించింది.ఇప్పటికే తెలుగు సినిమాకి సంభందించిన మ్యూజిక్ కానీ,సన్నివేశాల గురించి కానీ కాపీ అనేది ఎప్పటినుండో వినిపిస్తునే ఉన్నాయి..దీంట్లో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ కూడా చేరిపోయారు..పైగా ఈ సినిమా నిర్మిస్తున్నది నాగార్జున కావడంతో ఇది వారికి పరువుకి సంభందించిన విషయంగా చూస్తున్నారు..
హలో సినిమాను నాగార్జున నిర్మిస్తుండటంతో అన్నపూర్ణ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్లో దీన్ని అప్ లోడ్ చేశారు. ఈ టీజర్‌కు మిలియన్స్‌లో వ్యూస్, లక్షల్లో లైక్స్ వచ్చాయి. అయితే ఉన్నట్టుండి టీజర్ యూట్యూబ్ నుండి మాయం కావడంతో అభిమానులు షాకవుతున్నారు.ఈ టీజర్ తొలగించడానికి కారణం ఇందులో వాడిన మ్యూజిక్ అని తెలుస్తోంది. అది కాపీ రైట్ ఉన్న మ్యూజిక్ కావడం, దాని వినియోగ హక్కులు పొందకుండా టీజర్లో వాడేయటంతో పసిగట్టిన యూట్యూబ్ దాన్ని తొలగించింది. హలో టీజర్ కోసం అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశాడు అనుకుంటున్న మ్యూజిక్ అతనిది కాదట. ఫిన్ ల్యాండ్ కు చెందిన ‘ఎపిక్ నార్త్’ అనే ఒక కంపెనీ.. టీజర్స్ కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ తయారుచేస్తుంది. వారు ఎంతో క్వాలిటీగా కంపోజ్ చేసి తయారుచేసే మ్యూజిక్ మనం కొనుక్కోవచ్చు.కానీ ఒక్క రూపాయికూడా చెల్లించకుండా ఎంతో క్వాలిటీగా ఉండే ఆ మ్యూజిక్‌ని చిత్ర సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ టీజర్‌కి వాడాడట. దీంతో కాపీరైట్ క్లైమ్ కావడంతో హలో టీజర్‌ని యూట్యూబ్ నుండి తీసేశారు.అయితే దీని పై అఖిల్ స్పందించారు..
watch video here:
హలో టీజర్ పై ఫాల్స్ కాపీ రైట్ క్లెయిమ్ చేశారంటూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు అఖిల్. హలో సినిమా రూపొందింది అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే కాబట్టి సినిమా నిర్మాతలుగా ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నామని ..ఈ టీజర్ మ్యూజిక్ కు సంబంధించి రియల్లీ స్లో మోషన్ తో తాము కొలాబరేషన్ పెట్టుకున్నామని అంటున్నాడు. సరైన కారణం లేకుండా అనవసరమైన గలాటా సృష్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.