హ‌లో గురు ప్రేమ కోస‌మే.. Review & Rating.

Movie Title (చిత్రం): హ‌లో గురు ప్రేమ కోస‌మే
Cast & Crew: న‌టీన‌టులు: రామ్ , అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, ప్రణీత
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి
నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్
దర్శకత్వం: త్రినాథరావు.

Story: స్నేహితులు విడిపోతే తిరిగి కల‌వొచ్చు కానీ ప్రేమికులు విడిపోతే ఎప్పటికీ కలవలేరు అనే లైన్ ను బ‌లంగా న‌మ్మే కుర్రాడు సంజు ( రామ్). సంజు ఇంట్లో వారి కోరిక మేర‌కు హైద్రాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం వ‌స్తాడు..ఇంట్లో పెట్టిన ష‌ర‌తు మేర‌కు త‌న అమ్మ ఫ్రెండ్ అయిన విశ్వ‌నాథం ( ప్ర‌కాశ్ రాజ్ ) ఇంట్లో దిగుతాడు. కొన్నిరోజుల్లోనే విశ్వ‌నాథం, సంజు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. కానీ విశ్వ‌నాథం ఇంటికి రాకముందే రైల్లో సంజు అనుప‌ను చూసి ఇష్ట‌ప‌డ‌తాడు…ఆ అమ్మాయి విశ్వ‌నాథం కూతురే అవ్వ‌డం ట్విస్ట్.. త‌ను అనుప‌మ‌ను ఇష్ట‌ప‌డుతున్న విషయం అనుపమకు కానీ, విశ్వనాథంకు కానీ చెప్పేలోపే ఆమెకు వేరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. త‌ను అనుపమను ప్రేమిస్తున్న విషయాన్ని ఓ ఫ్రెండ్ గా విశ్వనాథంకు చెబుతాడు సంజు .. ఆ అమ్మాయి తన కూతురు అని తెలియక ముందు నీ ప్రేమకు హెల్ప్ చేస్తానని ఒక ఫ్రెండుగా చెప్పిన విశ్వనాథం, ఆ అమ్మాయి తన కూతురే అని తెలిసిన తర్వాత తండ్రిగా ఎలా రియాక్ట్ అయ్యాడు? స‌్నేహితుడికి హెల్ప్ చేశాడా? లేక తండ్రిగా స్ట్రిక్ట్ గా ఉన్నాడా..? అనేదే అస‌లు సినిమా.

Plus Points: ప‌్ర‌కాశ్ రాజ్, రామ్ ల‌ న‌ట‌న‌, ఫ‌స్టాఫ్,కామెడీ
Minus Points: స‌్టోరి, క్లైమాక్స్,స్కీన్ ప్లే.
Final Verdict: హ‌లో గురు పాత ప్రేమ క‌థే.!
Rating: 2.5 / 5

ఇత‌ర అంశాలు
విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫీ బావుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం ఆశించిన రీతిలో లేదు. ఎడిటర్ త‌న క‌త్తెర‌కు ఇంకాస్త ప‌నిచెప్తే బాగుండేది. మ‌రీ సెకెండాఫ్, క్షైమాక్స్ రొటీన్ గా ఉన్నాయి. మితిమీరిన ఫైటింగ్ లు, రొమాన్స్ లేక‌పోవ‌డం, ఫుల్ కామెడీ ఉండ‌డం కార‌ణంగా పండ‌గ పూట ఫ్యామిలీతో క‌లిసి చూడొచ్చు.
ప్రీ రిలీజ్ బిజినెస్ ( షేర్ ) వివ‌రాలు: నైజాంలో 6.5కోట్లు, సీడెడ్ లో 3.5 కోట్లు, వైజాగ్ లో 2.5 కోట్లు, ఓవ‌ర్సీస్ లో 2 కోట్లు..మొత్తం దాదాపు 25 కోట్ల బిజినెస్ జరిగింది.

Watch Trailer:

Comments

comments

Share this post

scroll to top