ఎంద‌రో హీరోలు..కొంద‌రే డాన్‌లు..!

ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించే ప‌రిక‌రాల్లో సినిమా మాధ్య‌మం మించిన ప‌రిక‌రం లేదు. ఈ జీవితం మ‌న‌ల్ని ఓ ప‌ట్టాన నిల్చోనీయ‌దు. కుదురుగా ఉండ‌నీయ‌దు కూడా. పాత సినిమాల్లో దృశ్యాలు కోకొల్ల‌లు. ల‌లిత‌మైన సాహిత్యం. అద్భుత‌మైన ప‌దాలు..మ‌నసు దోచే పాట‌లు. త‌రం మారింది..మ‌నుషులు మారారు. టెక్నాల‌జీ కాలాన్ని కౌగిట్లోకి తీసుకున్నాక‌..ఆ జాడ్యం వెండితెర‌కు పాకింది. విత‌వుట్ మూవీ మేకింగ్..విత‌వుట్ లిజ‌నింగ్..విత‌వుట్ రీడింగ్..ఐయామ్ నో వేర్..అంటాడో సినిమా పిచ్చి ప్రేమికుడు. చ‌క్రి పుణ్య‌మా అంటూ రెండు గొప్ప పాట‌లు వ‌చ్చాయి. కృష్ణా న‌గ‌రే మామ‌..జ‌గ‌మంత కుటుంబం నాది..ఏ సినిమా తీసుకున్నా ఏమున్న‌ది..అయిదు పాట‌లు..హీరో, హీరోయిన్ ..కామెడీ సీన్లు..నాలుగు ఫైటింగ్‌లు..ఓ క్లైమాక్స్..చివ‌ర‌కు హీరోనే విజేత‌. కానీ క్రియేటివిటి ఉన్న ద‌ర్శ‌కులు వ‌చ్చాక సినిమా స్టేట‌స్ మారి పోయింది. తెలుగు సినిమా వ‌ర‌కు వ‌స్తే అద్భుత‌మైన క్లాసిక్స్ అన‌ద‌గిన సినిమాలు వ‌చ్చాయి.

అలాంటి వాటిలో సాగ‌ర‌సంగ‌మం, శంక‌రాభ‌ర‌ణం లాంటివి ఎన్నో ఉన్నాయి. టాలీవుడ్‌లో హీరో పాత్ర డామినేట్ చేసినా..ప్ర‌తి నాయ‌కుడి పాత్ర అంటే విల‌నిజం పండించ‌డంలో మ‌నోళ్లు హై ప్ర‌యారిటీ ఇచ్చారు. బాలీవుడ్ వ‌ర‌కు వ‌స్తే అద్భుత‌మైన మూవీస్ వ‌చ్చాయి. బ్యూటిఫుల్ సాంగ్స్, గుండెల్ని మండించే డైలాగ్స్, లవ్లీ మ్యూజిక్ , అద్భుత‌మైన టేకింగ్, స్క్రీన్ ప్లే, ఫైన‌ల్ ట‌చ్ ను క‌ల్పించిన ఘ‌న‌త అక్క‌డి డైరెక్ట‌ర్స్ కే చెల్లింది. సాజ‌న్, హ‌మ్ ఆప్ కే హై కౌన్, రాజా హిందూస్తానీ, బాజీగ‌ర్ ..రాజ్..లాంటి సినిమాలు భారీ వ‌సూళ్లు వ‌చ్చాయి. కోలివుడ్, త‌మిళ‌నాడు, టాలీవుడ్, బొంబాయి సినిమా రంగాల వ‌ర‌కు చూస్తే త‌మిళ సినిమా క్రియేటివిటీకి పెద్ద పీట వేసింది. మ‌ణిర‌త్నం తీసిన నాయ‌కుడు సినిమా ఓ సంచ‌ల‌నం. రంజిత్ పా తీసిన కాలా, క‌బాలీ..ఉన్నాయి.

ఇండియాలో మాఫియా, డాన్ ల సంస్కృతిని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించిన ఘ‌న‌త ఒక్క తెలుగువాడైన సెన్షేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాం గోపాల్ వ‌ర్మ‌కే ద‌క్కుతుంది. శివ‌, కంపెనీ, స‌త్య‌, స‌ర్కార్, డి లాంటి సినిమాలు హిందీ సినిమాను కుదిపేశాయి. అమితాబ్ బ‌చ్చ‌న్ స‌ర్కార్‌లో విశ్వ రూపాన్ని ప్ర‌ద‌ర్శించారు. తండ్రీ కొడుకులు అభిషేక్ బ‌చ్చ‌న్‌ను కూడా న‌టింప చేసిన ఘ‌న‌త ఒక్క వ‌ర్మ‌కే చెల్లుతుంది. హీరోలు కోకొల్ల‌లు ఉండి వుండ‌వ‌చ్చు గాక‌..కానీ మాఫియా డాన్‌లుగా ..రౌడీ నేత‌లుగా న‌టించిన పాత్ర‌లకు జ‌నం జేజేలు ప‌లికారు. తాము తుపాకులు ప‌ట్టుకోక పోయినా హీరోలు ప‌ట్టుకుంటే చూసి ఆనందించే వాళ్లు మ‌న ఫ్యాన్స్. ప్రిన్స్ మ‌హేష్ బాబు న‌టించిన పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బిజినెస్‌మాన్ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. ముంబ‌యిలో తెలుగువాడి స‌త్తాను చాటింది.

నాగార్జున స‌హ‌కారంతో వ‌ర్మ తీసిన శివ ..తెలుగు సినిమాను ఒక్క ఊపు ఊపేసింది. రెండు గ్యాంగ్‌ల మ‌ధ్య ఉండే వాతావ‌ర‌ణాన్ని ఇంత అద్భుతంగా తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ ఇంత‌వ‌ర‌కు రాలేదు. స‌త్య‌, కంపెనీ సినిమాలు కొత్త‌గా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని అనుకుంటున్న వాళ్లు ఎలా సినిమా తీయొచ్చో తెలుసు కోవ‌చ్చు. ఎలాంటి కోర్సుల కోసం వెళ్లాల్సిన ప‌నిలేదు. గ్యాంగ్‌స్ట‌ర్ ప్రాధాన్యంగా సినిమాలు వ‌చ్చాయి. యంగెస్ట్ డైరెక్ట‌ర్ పా రంజిత్ త‌లైవాతో తీసిన సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా వేయి కోట్ల మార్కెట్ ను దాటేసింది. ఇదో రికార్డు. ర‌జ‌నీకాంత్ న‌ట‌న అమోఘం..అద్భుతం. డాన్‌గా న‌టించిన తీరు ప్ర‌శంస‌నీయం.

డాన్ సినిమాలో ఎవ‌ర్ గ్రీన్ హీరోగా ఉన్న అమితాబ్ చెప్పిన డైలాగ్‌లు ఇప్ప‌టికీ ప్ర‌భావితం చేస్తున్నాయి. మై హూ డాన్ అంటూ వుంటే ఫ్యాన్స్ ఒన్స్ మోర్ అన్నారు. సినిమాకు ఎగ‌బ‌డ్డారు. శివ సునామీకి పెద్ద ద‌ర్శ‌కులే వెన‌క్కి ప‌డిపోయారు. ఆ త‌ర్వాత గోవిందా గోవిందా, గాయం , గులాబీ , సింధూరం సినిమాలు తెలుగు సినిమా స్టామినా ఏమిటో చూపించాయి. గాయంలో జ‌గ‌ప‌తిబాబు దాదాగా చేస్తే..క‌మ‌ల్ హాస‌న్ నాయ‌కుడిగా, ర‌జ‌నీ, ముమ్ముట్టిలు ద‌ళ‌ప‌తులుగా దుమ్ము రేపారు. బాషా సినిమాలో ర‌జ‌నీ విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించారు. బిజినెస్ మాన్ లో ప్రిన్స్ డైలాగ్స్..కాసులు కురిపించాయి. డాన్ శీనుగా ర‌వితేజ ప‌వ‌ర్ ఫుల్‌గా క‌నిపించి మురిపించారు.

దుమ్ము రేపే క‌థ‌, ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లు, విల‌నిజం, హీరోయిజం, మ‌ర్డ‌ర్లు, డాన్‌లు, గ్యాంగ్‌ల మ‌ధ్య పోరాట దృశ్యాలు సినిమాల్లో చూపిస్తున్నారు. వివేక్ ఒబేరాయ్‌, ర‌ణ‌దీప్ హూడా, అజ‌య్ దేవ్‌గ‌న్, స‌ల్మాన్ ఖాన్, ర‌ణ‌బీర్ క‌పూర్, అమితాబ్ బ‌చ్చ‌న్ , విజ‌య్, ర‌జ‌నీకాంత్, విశాల్ రెడ్డి లాంటి వాళ్లు ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. హీరోలు ఎంద‌రో ఉండి వుండ‌వ‌చ్చు గాక‌..కానీ డాన్‌లు ఎప్పటికీ డాన్‌లే..కింగ్‌లే..వీలైతే స‌ర్కార్..డి-స‌త్య‌-కంపెనీ-శివ‌, బిజినెస్ మెన్ …చూడండి..గుండెల్లో ద‌మ్ము ఉందో లేదో తెలుస్తుంది.

Comments

comments

Share this post

scroll to top