ఇండియాలో అరకొర జీతాలతో నెట్టుకు వస్తున్న టీచర్లకు గుడ న్యూస్. యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ (యుఏఈ) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎమరేట్స్లోని ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న స్కూళ్లలో భారీ ఎత్తున మౌళిక సదుపాయాలను కల్పించింది ఆ దేశ ప్రభుత్వం. కానీ పిల్లలకు అర్థం చేయించేలా పాఠాలు చెప్పడం అక్కడికి వారికి కష్టంగా మారింది. దీంతో ఇండియన్స్ అయితేనే తమ వారిని అర్థం చేసుకుంటారని, స్టూడెంట్స్కు చదువుతో పాటు ఇతర అంశాలలో తీర్చిదిద్దుతారని అక్కడి విద్యా శాఖ ఉన్నతాధికారులు సర్కార్కు సూచించారు. ఇంకేముంది టాక్స్ ఫ్రీ సౌకర్యంతో ఎంచక్కా యుఏఈ భారీ వేతనాలు ఇస్తామని ..తక్షణమే ఇండియాను వదిలేసి రండి అంటూ ఆహ్వానం పలికింది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, యోగా, తదితర వాటిపై మంచి పట్టు కలిగి ఉన్న టీచర్లు లెక్కలేనంత మంది భారత్లో ఉన్నారు.
వీరికి ఇక్కడ 45 వేల నుండి 70 వేల దాకా జీతాలు తీసుకుంటున్నారు. వేతనాలలో వృత్తి పన్ను కూడా కడుతున్నారు. దీనిని గమనించిన యుఏఇ ట్యాక్స్ ఫ్రీ ఇస్తూ నెలకు 3 లక్షల రూపాయల జీతాన్ని ఇస్తామని వెల్లడించింది. ఒకరు కాదు ఏకంగా 3 వేల మంది టీచర్లు కావాలని కోరింది. 16 వేల దీనార్లు ..అంటే ఇండియన్ రూపీస్ పరంగా లక్షల్లో వేతనం అన్నమాట. ఇక్కడి విద్యా శాఖ ఇచ్చే దానికంటే పది రెట్లు ఎక్కువ జీతాన్ని ఆఫర్ చేస్తోంది అక్కడి సర్కార్. ఇక్కడి లాగా ఎంపిక చేసే పద్ధతి ఉండదు అక్కడ. ప్రతిదీ చాలా పకడ్బందీగా ఉంటుంది వ్యవస్థ. రిక్రూట్ మెంట్ ఏజెన్సీనే ఎంపిక వ్యవహారం అంతా చూసుకుంటుంది. వీసా, పాస్ పోర్ట్ తో పాటు ఎన్నేళ్లు ఉండేది కూడా వారే నిర్ణయిస్తారు. ఒకవేళ భారతీయులు వెళ్లేందుకు రెడీ అయితే ..వారికి తగ్గట్టు భోజన ఏర్పాట్లు కూడా అక్కడి ప్రభుత్వం చూసుకుంటుంది.
పన్ను, పన్ను లేకుండా వీరిని ఎంపిక చేయనుంది ఏజెన్సీ. 4 వేల నుండి 12 వేల 500 దీనార్లు ఇస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న స్కూళ్లను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఈ అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. విద్యా ప్రమాణాలు పెంచడం, విలువలతో కూడిన విద్యను అందించడం, పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దేలా చేయడం..ఇదీ యుఏఇ తీసుకున్న నిర్ణయం. ఇక్కడి వారి బోధన అక్కడి పిల్లలకు ఏ మేరకు అర్థమవుతుందనేది ప్రశ్న. కొంత మంది పిల్లలు యాక్సెప్ట్ చేసినా మరికొంత మంది వీరిని ఒప్పుకుంటారా అన్నది కూడా అనుమానమే. భద్రతకు కొదవ లేక పోయినా ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా కఠినమైన శిక్షలు ఉంటాయి. దీంతో ఇక్కడి మహిళలు, ఇతర టీచర్లు వెళ్లేందుకు సుముఖంగా లేరు.
జీతం చూస్తే లక్షల్లో ఉంటోంది..కానీ అక్కడికి వెళ్లి పనిచేయాలంటేనే ఇక్కడి వారు జంకుతున్నారు. ఇండియాలో వుంటే ఏదో పప్పు కూడు తినొచ్చు..అక్కడికి వెళ్లి దీనార్లకంటే ..దారుణాలను చవి చూడాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఆసియా ఖండంలోనే అరబ్ కంట్రీస్ ..విద్య పట్ల ఎక్కువ కేర్ తీసుకుంటున్నాయి. వచ్చిన ఆదాయంలో భారీగా దీని కోసమే కేటాయిస్తున్నాయి. చదువు కోవాలి. ప్రపంచంతో తమ పిల్లలు పోటీ పడాలి అన్నది వారి ఆలోచన. అందుకే భారీ ఆఫర్లను ప్రకటిస్తోంది యుఏఇ. సబ్జెక్టులతో పాటు ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్ మెంట్, యోగా, టెక్నాలజీ తదితర అంశాలపై పిల్లలకు చదువు చెప్పించేందుకు టీచర్లను నియమించాలని నిర్ణయించింది. విద్యలో రాణిస్తేనే దేశం బాగుంటుందన్న ఐడియా యుఏఈ పాలకులకు రావడం అభినంచిదగ్గ విషయమే. సో టీచర్లు మీరూ ట్రై చేసి చూడండి..భారీ ఆఫర్ ను ఎందుకు వదులు కోవాలి. ఓ ఏడాది చేసి వచ్చినా ఓ 30 లక్షల దాకా పోగేసు కోవచ్చు కదూ.