కోర్టు లోపల కూతురు జడ్జ్, బయట తండ్రి టీ అమ్ముకుంటాడు, సాయంత్రం ఇద్దరూ కలిసి ఇంటికి వెళతారు.

ఆమె పేరు శృతి,  పంజాబ్ లోని జలంధర్ న్యాయస్థానంలో ఆమె జడ్జ్.  ఆమె తీర్పు చెప్పిందంటే తిరుగుండదని అంటుంటారు. అదే కోర్టు బయట సురేంధర్ కుమార్ టీ అమ్ముకుంటుంటాడు….ఈ సురేంధర్ కుమార్ శృతి కన్న తండ్రి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా…ఇది నిజం.  ఓ కష్టజీవి తండ్రి, ఓ పట్టుదల కూతురి సక్సెస్ స్టోరీనే ఇది.

శృతి చిన్నప్పటి నుండే చాలా చురుకైన అమ్మాయి.. చదువులో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే, ఆమె తండ్రి సురేంధర్ కుమార్ జలంధర్ న్యాయస్థానం ముందు ఓ చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని  టీ అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు.  ఆ టీ అమ్మితే వచ్చిన డబ్బుల ద్వారానే కూతురిని చదివించుకునే వాడు.  చిన్నప్పటి నుండీ తండ్రి కష్టాన్ని దగ్గరగా చూసిన శృతి, బాగా చదివి తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని అనుకునేది. స్టేట్ పబ్లిక్ స్కూల్ లో మెట్రిక్ పూర్తి చేసిన శృతి,  జలంధర్ లోని JNTU లో లా కోర్సు చదివి, పాటియాలోని పంజాబ్ యునివర్సిటీ నుండి  LLM  పూర్తి చేసింది.

అయితే మొదట సివిల్ సర్వీస్ పరీక్ష  రాసిన శృతి ఫస్ట్ అటెంప్ట్ లోనే అందులో సక్సెస్ అయ్యింది. కానీ అనుకోని విధంగా మరో పరీక్ష రాసి జడ్జిగా ఎంపికైందీ .జలంధర్ కోర్ట్ లోనే జడ్జీగా పోస్టింగ్  కూడా లభించింది.దీంతో ప్రతిరోజు ఉదయం కూతురు తండ్రి ఇంటి నుండి బయలు దేరి..కోర్టు కు వస్తారు, తీర్పులు చెప్పడంలో కూతురు బిజీగా గడిపితే, ఛాయ్ అందించే ప్రయత్నంలో తండ్రి బిజీగా ఉంటాడు.

Untitled-1-2-1-750x500

కూతురు ఆ కోర్టులో జడ్జీ అయినా సురేంధర్ కుమార్ ఏ మాత్రం గర్వం లేకుండా వచ్చిన వారందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ టీ అందిస్తుంటాడు. మీ కూతురు జడ్జి కదా ఇంకా ఈ పనేంటి అని చాలా మంది అన్నప్పటికీ…కూతురు జడ్జీగా మారడం వెనుక ఉన్నది ఈ ఛాయే అంటూ తన మూలాలను గుర్తు తెచ్చుకుంటాడు.  కూతురు కూడా తండ్రి చేసే పనిని నామోషీగా ఫీల్ కాకుండా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటూ గౌరవిస్తుంది. సాయంత్రం కాగానే కూతురు తండ్రి కలిసి ఇంటికి వెళతారు.

శృతి సాధించిన విజయం ముందు పేదరికం, ఓటమి అనే పదాలు ఆమె దరిదాపులకు కూడా రాలేదు. పట్టుదలకు కృషి తోడైతే మన లక్ష్యాల ముందు ఎన్ని అడ్డంకులైనా సరే గడ్డిపరికతో సమానమని నిరూపించిన శృతి, నేటి యువతకు ఆదర్శం.

Comments

comments

Share this post

scroll to top