తిండికి లేక 5/- మ్యాగీ తింటూ ఏడాది పాటు గడిపిన అతడే…ఇప్పుడు భారత బౌలింగ్ అస్త్రం.

వర్షం కోసం ఓ ఊరిప్రజలంతా యజ్ఞం చేయతలపెట్టారంట… అందరూ ఆ యజ్ఞ వాటిక దగ్గరికి వెళుతున్నారు…ఒకతను మాత్రం గొడుగు వేసుకొని మరీ అక్కడికి వెళుతున్నాడు….ఇది నమ్మకం అంటే…!? సేమ్ టు సేమ్ …..9 వ తరగతి ఫెయిలైన ఓ  కుర్రాడు ఇంగ్లీష్ ను మాత్రం వదల్లేదు…అందులో ఫర్ఫెక్ట్ అయ్యాడు… అదేంట్రా అంటే..రేపొద్దున్న నేను గొప్పవాన్ని అయితే ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా.!  అందుకే ఇంగ్లీష్ ను వదిలేది లేదన్నాడు ఆ కుర్రాడు. ఇది  ఆత్మవిశ్వాసం అంటే……యస్ ఇవి మాటల  వరకే పరిమితం కాలేదు… నిజజీవితంలో ఆవిష్కరించాడు ఆ కుర్రాడు…అతని పేరే హర్థీక్ పాండ్యా… T 20 లో బంగ్లా తో ఫైనల్ ఓవర్ వేసి భారత్ ను గెలిపించిన యువకిశోరం, ఆరంగేట్రం చేసిన తొలి వన్డే మ్యాచ్ లోనే  Man Of The Match  అవార్డ్ దక్కించుకున్న ఆటగాడు.

అతడి లైఫ్ స్టోరి ప్రతీ ఒక్క యువకుడికి మార్గదర్శకం లాంటిది… తినడానికి తిండి లేదు, కానీ  క్రికెట్ అంటే ప్రాణం….దాని కోసం అన్నింటిని త్యజించాడు , చివరకు సాధించాడు. సుమారు ఏడాది పాటు మ్యాగీతోనే మద్యాహ్నం కడుపు నింపుకొని రేపటి విజయం కోసం ప్రతిదినం కష్టపడిన  ధీశాలి అతను…. ప్రాక్టీస్ కు వెళ్లేటప్పుడు బ్యాగ్ లో ఓ మ్యాగీ పాకెట్ తీసుకెళ్లడం లంచ్ టైమ్ లో అక్కడి వంట మనిషి దగ్గర వేడినీళ్లు తీసుకోవడం మ్యాగీ చేసుకొని తిని ప్రాక్టీస్ మొదలు పెట్టడం…ఏడాది పాటు ఇది అతని దినచర్య.

31BBFEB100000578-0-image-a-4_1456859941144

కేవలం కుంటుంబాన్ని పోషించడం కోసమే క్రికెట్ ఆడిన స్థాయినుండి టీమ్ ఇండియాలో చోటు సాధించేంతవరకు అతని ప్రయాణం నిజంగా ఓ అద్భుతం…అత్యంత సాహసం….

క్రికెట్ గాడ్ సచిన్ మాటలు: ‘మరో ఏడాదిలో నువ్వు భారత్‌కు ఆడతావు’ ( ఏడాది తిరక్కుండానే టీమ్ ఇండియా జట్టులో చోటు దక్కింది)

Hardik-825-3

సందర్భం:  IPL- 2015 ముంబయి ఇండియన్స్‌ v/s కోల్‌కతా నైట్‌రైడర్స్‌  మ్యాచ్‌ లో ఎనిమిది ఫోర్లూ, రెండు సిక్సర్లతో 61పరుగులు (45బంతుల్లో) చేసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అందుకున్న సందర్భంలో……………

మొదటి చెక్:  10లక్షలు పెట్టి ముంబాయ్ ఇండియన్ కొనుగోలు.

అతడి స్పందన: నా జీవితంలో నేను చూసిన పెద్దమొత్తం అదే. ఆ ఒక్క చెక్కుతో దాదాపు మా అప్పులన్నీ తీరిపోయాయి.

ప్రస్తుతం: టీమ్ ఇండియా 11 మంది సభ్యుల్లో అత్యంత కీలక ఆల్ రౌండర్…. జడేజా బ్యాటింగ్ ను మరిచిపోయి పూర్తిగా బౌలింగ్ కే పరిమితమైన వేళ పాండ్య అవసరం అధికమైంది. దానికి తోడు యువరాజ్, రైనా రేంజ్ లో ఫీల్డింగ్ చేయడం, ధోనీ, సెహ్వాగ్ రేంజ్ లో విరుచుకుపడడం, పొదుపుగా బౌలింగ్ వేయడం కలిసొచ్చే అంశాలు.

గుర్తుండే ప్రదర్శన:  IPL లో ఎన్ని మెస్మరైజింగ్ ప్రదర్శనలు ఉన్నప్పటికీ..బంగ్లా తో అతడు వేసిన ఫైనల్ ఓవరే అతనిని ప్రపంచానికి పరిచయం చేసింది. మూడు బంతుల్లో 2 వికెట్లు తీసి పరుగులేమీ ఇవ్వకపోవడంతో అతడు ఇప్పుడు ఇండియన్ ఫేవరెట్ ప్లేయర్ గా మారాడు. న్యూజిలాండ్ తో జరిగిన వన్డే లో…..లైన్ అండ్ లెగ్త్ తో బంతులు విసిరి మూడు కీలక వికెట్స్ పడగొట్టి  తొలి వన్డే లోనే మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అందుకున్నాడు.

hardik-pandya1

Watch Video: Last Over Performance Of Hardik Pandya Against Bangladesh:

Infograhic on rape culture in india

Comments

comments

Share this post

scroll to top