అమ్మ‌నై అడుగుతున్న‌…. హార్ట్ ట‌చింగ్ లైన్స్ బై క్రిష్ణ‌వేణి. ఒక్కొక్క అక్ష‌రం గుండెను మెలితిప్పేస్తుంది.

అమ్మ‌నై అడుగుతున్న‌….అంటూ క‌వి సంగ‌మంలో కృష్ణ‌వేణి గారు వినిపించిన క‌విత సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతుంది. సాధార‌ణ గ్రామ్య‌ ప‌దాల‌తో ఆమె అల్లుకున్న క‌విత ఆలోచ‌న‌ను రేకెత్తించేదిగా, స‌మాజాన్ని సూటిగా ప్ర‌శ్నించేదిగా ఉంది. ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల చూపుతున్న వివ‌క్ష‌ను త‌న క‌విత‌తో వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు కృష్ణ‌వేణిగారు.

రాఖి క‌ట్టిన చెల్లెకు ర‌క్ష‌ణ‌గా నిల‌బ‌డ‌తవ్.
మ‌రి… రోడ్డు మీది చెల్లినెందుకు రోత కూత‌లు కూస్త‌వ్…??

ప‌క్కమీంచి లేవ‌గానే అమ్మ‌కాళ్ల‌ను క‌ళ్ల‌కు అద్దుకుంట‌వ్..
మ‌రి…పిల్ల‌నిచ్చిన అమ్మ‌నెందుకు అమ్మ‌నా బూతులు తిడ‌తవ్.??

బువ్వ పెట్టే త‌ల్లి భూత‌ల్లి అంటవ్….
మ‌రి…నీ పిల్ల‌ల త‌ల్లినెందుకు క‌ట్నం కోసం కాటికంపుత‌వ్.??

వాకిట్ల మొలిసిన తుల‌సి చెట్టును ఆడ‌బిడ్డ‌ని పూజిస్త‌వ్..
మ‌రి నీ క‌డుపున పుట్టిన బిడ్డ‌నెందుకు చెత్త‌కుప్ప‌ల పాల్జేస్త‌వ్.??

అపురూప‌మైన‌ద‌మ్మ ఆడ‌జ‌న్మ అంట‌వ్…
అంత‌ట్లోకే….అందాల ఆడ‌బొమ్మ అంటూ అంగ‌ట్ల స‌రుకును జేస్త‌వ్..!!

విలువ‌ల వ‌లువ‌లు విప్పేస్తూ, అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న చేపిస్త‌వ్..
ఫేవింగ్ క్రీమ్లు, అండ‌ర్ వేర్ లు, కంపుదేహాల‌ను ఇంపు జేపే అత్త‌రు సీసాలు
అమ్ముకునే వ‌స్తువుల‌న్నీ మీవే క‌దా…మ‌రి అమ్మ‌త‌నాన్ని ఎందుకు అర్థ‌న‌గ్నంగా టీవీ తెర మీద‌ ఆరేస్తావ్.??
అమ్మ‌నై అడుగుతున్న‌….

Comments

comments

Share this post

scroll to top