బస్ నుంచి దిగి పాకెట్లో చేయి పెట్టి చూసే సరికి జేబుకి చిల్లుంది..పర్సు మాయం అయిపొయింది.. ఎవరో కొట్టేసారాని నిర్దారించుకున్నాడు..ఆ రోజే జాబుకు రిజైన్ చేసిన యువకుడు. నిరుత్సాహంలో ఉన్న ఆ యువకుడు.. పర్స్ పొతే పొయిందిలే.. అందులో ఉన్నది 150 రూ..!! ఇంకా అమ్మకి రాసిన ఒక లేటర్.. ఆ లెటర్లో.. ” అమ్మా నా ఉద్యోగం పోయింది.. నేనింక డబ్బులు పంపించ లేను.. నువ్వు ఏలాగోలా సర్దుకో.. నన్ను మన్నించు అని రాసున్నాడు.. ” పోస్ట్.. చెద్దాం అంటె మనస్సు రాలేదు, నైట్ అయినా పోస్ట్ చెద్దాం అనుకునే లొపలే ఎవరో దొంగ తన పర్స్ కొట్టేసాడు..150 రూ.. అంటే పెద్ద అమవుంట్ ఎం కాదు.. కాని.. ఉద్యొగం లేని వాళ్ళకు అది.. 1500 రూ తో సమానం..
కొన్ని రోజుల తరువాత అమ్మ దగ్గర ఉంచి ఉత్తరం వచ్చింది… ఉత్తరం ఒపెన్ చెయాలి అంటే మనస్సులో ఆందోళన… ఇంకా డబ్బు పంపలేదు అని ఉంటుందని..ఒపేన్ చెసి చూస్తే… ” నాన్నా.. నాకు నీవు చేసిన మనీ ఆర్డర్ 500 రూ.. చేరింది.. నువ్వు వేళకు తిను ఆరోగ్యం జాగ్రత్తగా చూస్కో..” అని రాసి ఉంది..ఆ యువకుడికి ఎం అర్దం కాలేదు.. నేను పంపలేదు.. మరి ఎవరు పంపించారు అని అలోచనలో ఉండగా..
మరుసటి రోజు ఇంకొక ఉత్తరం వచ్చింది… అర్దం అవని చేతి రాత.. ” అన్నా నీ 150 రూపాయలకు నేనొక 350రూ కలిపి అమ్మకి మని ఆర్డర్ చేసాను.. అమ్మ ఎవరికైన అమ్మే.. తాను ఎందుకు ఆకలితో ఉండాలి? ”
ఇట్లు,
నీ పిక్ పాకిటర్ బ్రదర్..
(“దొంగ అయినా అతడు చూపిన మానవత్వం నేడు మనలో చాలా మందిమి మర్చిపోతున్నాము. మానవత్వం మనల్ని మహోన్నతంగా నిలబెడుతుంది. అదే లేనినాడు మనిషి జంతువుతో సమానము.”)
BY: Rakesh Reddy.