శ్రీదేవి వార్త‌లో ప‌డి…. మ‌నం గుర్తించ‌ని సంఘ‌ట‌న‌.!! ఆ త‌ల్లికి జైహింద్.

ఆమె ఓ లేడీ ఆర్మీ ఆఫీస‌ర్‌. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో ప‌నిచేస్తున్న క‌మాండ‌ర్‌ను పెళ్లి చేసుకుంది. వారి అనుబంధానికి గుర్తుగా ఓ పాప కూడా ఆమెకు జ‌న్మించింది. కానీ ఆ పాప ఇంకా పూర్తిగా క‌ళ్లు తెర‌వ‌క‌ముందే ఆమె తండ్రి చ‌నిపోయాడు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. వింటానికే ఈ ఘ‌ట‌న షాకింగ్‌గా ఉంది క‌దా. ఇది మ‌న దేశంలోనే జ‌రిగింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

అత‌ని పేరు డి వాట్స్‌. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో అస్సాంలో వింగ్ క‌మాండ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఆమె పేరు కుముద్ డోగ్రా. ఇండియ‌న్ ఆర్మీలో సేవ‌లు అందిస్తోంది. అయితే వీరిద్ద‌రూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి అనుబంధానికి గుర్తుగా ఓ పాప కూడా జ‌న్మించింది. ఆమె జ‌న్మించాక 5 రోజుల‌కు అంటే.. ఫిబ్ర‌వరి 15వ తేదీన ఆ పాప తండ్రి వాట్స్ చ‌నిపోయాడు. వాట్స్‌, మ‌రో ఆర్మీ ఆఫీస‌ర్‌తో క‌లిసి అస్సాంలోని మ‌జులి అనే ప్రాంతానికి మైక్రోలైట్ హెలికాప్ట‌ర్‌లో ప్ర‌యాణిస్తూ అక‌స్మాత్తుగా ఆ హెలికాప్ట‌ర్ కూలిపోవ‌డంతో ఆ ప్ర‌మాదంలో అత‌ను చ‌నిపోయాడు.

అలా వాట్స్ చ‌నిపోయిన‌ప్పుడు అత‌ని పాప‌కు కేవ‌లం 5 రోజుల వ‌య‌స్సు మాత్ర‌మే. ఈ క్ర‌మంలో ఆ పాప‌ను చేతిలో ప‌ట్టుకుని యూనిఫాం ధ‌రించి వాట్స్ భార్య కుముద్ డోగ్రా ఆర్మీ ఆఫీస‌ర్‌గా త‌న భ‌ర్త‌కు నివాళి అర్పించింది. ఆమె అలా నివాళి అర్పించేందుకు పాప‌తో వెళ్తున్న స‌మ‌యంలో ఆమెను ఫొటో తీశారు. ఈ క్రమంలో ఆ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఏది ఏమైనా ఇలాంటి స్థితి ఎవ‌రికీ రాకూడ‌దు క‌దా.

Comments

comments

Share this post

scroll to top