మర్చిపోలేని సంబాషణ…మదిని కరిగించింది.!

ఉదయం 10 అవుతోంది. ముంబాయ్ నగర వీధులు చాలా బిజీబిజీగా మారిపోతున్నాయ్. అప్పుడే వచ్చిన షాప్ యజమాని తన షాప్ ను తెరిచి సమాన్లు సర్దుకుంటున్నాడు. అంతలోనే అక్కడికి వచ్చాడు ఓ పిల్లాడు. చేతిలో నిమ్మకాయలు, మిరపకాయలు పట్టుకొని సార్ దిష్టి యంత్రాలు  కావాలా? అంటూ….. అతనిని ఎప్పటి నుండో గమనిస్తున్న ఆ షాప్ యజమాని బాబు ఇటురా..అని ఎప్పటి నుండో తాను అడగాలనుకున్న ప్రశ్నలను అడిగాడు…..దానికి ఆ పిల్లాడి  చెప్పిన సమాధానాలు మదిని కరిగించాయ్. అతని ఆలోచనా స్థాయి, వాస్తవపరిస్థితులు కళ్లకు కట్టినట్టు కనబడతాయ్ అతని అమాయక సమాధానాల్లో….

 

షాప్ కీపర్:  బాబు నీ వయసెంత?

పిల్లాడు:   నాకు తెలియదు సార్..!

షా.కీ:  నువ్వెక్కడుంటావ్.?

పి: ఇక్కడి నుండి 10 కి.మీ దూరంలో ఉండే స్లమ్ ఏరియాలో సార్.

 షా.కీ: అంతదూరం నుండి ఇక్కడికి ఎందుకు రావడం?

పిల్లాడు: ఇక్కడైతే ఎక్కువ డబ్బులు దొరుకుతాయ్ సార్.

షా.కీ: ఎప్పుడూ ఇక్కడే కనబడతావ్..మరి రెస్ట్ ఎప్పుడు తీసుకుంటావ్?

పిల్లాడు: జ్వరం  వచ్చినప్పుడు.

షా.కీ:రోజూ ఎన్నగంటలకు వస్తావ్, ఎప్పటి వరకు ఉంటావ్?

పిల్లాడు:రోజూ 7 గంటలకు వస్తాను, తెచ్చిన సామాన్ అంతా అమ్ముడుపోయే వరకుంటాను, అప్పుడప్పుడు రాత్రి 9 అవుతుంది.

షా.కీ: మీ ఇంట్లో ఎవరెవరుంటారు.?

పిల్లాడు:  అమ్మా, నాన్న, చెల్లి ,నేను.

షా.కీ: నాన్న ఏంచేస్తారు?

పిల్లాడు: ఆయన ఏం చేయరు. ఆయన మంచం మీదున్నారు. ఆయన  3యేళ్ల నుండి ఓ వ్యాధితో బాధపడుతున్నారు.

షా.కీ:నువ్వు స్కూల్ కు వెళతావా?

పిల్లాడు:లేదు , నేను స్కూల్ కు వెళితే మా ఫ్యామిలీని ఎవరు పోషిస్తారు? కానీ నాకు స్కూల్ కు వెళ్లాలని చదువుకోవాలని చాలా ఉంటుంది. కానీ  ఏం చేస్తాం.!

షా.కీ : పెద్దయ్యాక ఏం చేయాలనుకుంటున్నావ్?

పిల్లాడు:మా చెల్లిని మంచిగా చదివించి డాక్టర్ ను చేయాలి.  అమ్మను కంటికిరెప్పాల చూచుకోవాలి, మా నాన్నను మంచి హాస్పిటల్ లో చూపించాలి. అంతే సార్….

షా.కీ : మరి నీకేం వద్దా?

పిల్లాడు: అమ్మా, నాన్న , చెల్లి..వీళ్లంతా ఉంది నాకోసమే కదా సార్!

షా.కీ: (కర్చీఫ్ తో కళ్లు తుడుచుకుంటున్నాడు.)

పిల్లాడు: ‘(మిర్చీ-నింబూ..దస్ కా ఏక్. అంటూ వేరే షాప్ వైపు వెళ్లాడు.)

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top