ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం, అంబులెన్స్ లో సీరియస్ కండీషన్ లో ఉన్న పేషెంట్ ను ఆపిన పోలీసులు!

కుయ్ కుయ్ అంటూ సైరన్ కొడుతున్న అంబులెన్స్.. సార్ ప్లీజ్ సార్ …అమ్మకు సీరియస్ గా ఉంది..త్వరగా హాస్పిటల్ కు వెళ్లాలి, ప్లీజ్ వెళ్ళనివ్వండి సార్..అంటూ పోలీసులను బతిమాలుతున్నాడు కొడుకు, అంబులెన్స్ లో సీరియస్ కండీషన్ లో ఉన్న తల్లిని పోలీసులకు చూపిస్తూ….. ! లేదు లేదు,  సిఎం గారి కాన్వాయ్ మరికాసేపట్లో వస్తుంది. మిమ్మల్ని వెల్లనిస్తే అందరూ బండ్లను మూవ్ చేస్తారు.. తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేయడం కష్టమవుతుంది. సో కాసేపు వెయిట్ చేయండి.. అయినా హాస్పిటల్ కు వెళ్ళేంతవరకూ మీ అమ్మకు ఏమీ కాదులే అంటూ ఉచిత సలహా ఇచ్చారు మన పోలీసులు.

కోల్ కతా లో నివసిస్తున్న 50 ఏళ్ళ మెహర్జాన్ బేగం అనే మహిళకు బుధవారం ఉదయం హార్ట్ ఎటాక్ రావడంతో స్థానిక హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. అక్కడ వైద్యపరీక్షలు చేసిన డాక్టర్ వెంటనే పెద్ద హాస్పిటల్ కు తీసుకెళ్ళమని ఎమర్జన్సీ అని చెప్పాడు. దీంతో అంబులెన్స్ లో మెహర్జాన్ ను ఆమె కుటుంబ సభ్యులు తీసుకెళుతుండగా ఎక్స్ ప్రెస్ హైవేపైకి రాగానే, సీఎం మమతా బెనర్జీ వస్తున్నారంటూ వాహనాలను నిలిపివేశారు. వాహనాల మధ్యలో అంబులెన్స్ నిలిచిపోయింది.
mamata-banerjee-convoy_650x400_61450929314
మెహర్జాన్ కుటుంబ సభ్యులు హార్ట్ ఎటాక్ తో బాధపడుతుందని, అంబులెన్స్ సైరన్ మోగిస్తున్నా కాసేపు ఉండమని పోలీసులు అన్నారు. ఇక మరో పోలీస్ అయితే ఏకంగా మెహర్జాన్ పల్స్ చెక్  చేసి హాస్పిటల్ కు వెళ్ళేవరకు ఎటువంటి ప్రమాదంలేదని ఉచిత సలహా ఇచ్చాడు. ఇలా పోలీసులందరూ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎంతగా మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. అయితే కొద్దిసేపటి తర్వాత ఉన్నత పోలీస్ అధికారి వచ్చి అంబులెన్స్ ని పంపించాడు.
హాస్పిటల్ లో చేరిన అనంతరం మెహర్జాన్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మేం ఎంతగ మొరపెట్టుకున్నా పోలీసులు పట్టించుకోలేదని, మనిషి ప్రాణం ముందు ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు తనకు ఇబ్బంది అనుకోడు. అత్యవసర సమయాలలో అంబులెన్స్ కి దారివ్వమని మన ప్రభుత్వాలు చెబుతున్నా, పోలీసులు మాత్రం ఇలా అత్యుత్సాహం ప్రదర్శించడం బాధాకరం.

Comments

comments

Share this post

scroll to top