ఈ 7 స‌హ‌జ సిద్ధ‌మైన టిప్స్ పాటిస్తే… చెమ‌ట కాయ‌ల స‌మ‌స్య మిమ్మ‌ల్ని బాధించ‌దు..!

ఉక్క‌పోత‌, వేడి, ఎండ‌, వ‌డ‌దెబ్బ‌… వేస‌విలో చాలా మంది ఎదుర్కొనే స‌మ‌స్య‌లే ఇవి. అయితే వీటితోపాటు మ‌రో స‌మ‌స్య‌ను కూడా అధిక‌శాతం మంది ఎదుర్కొంటుంటారు. అదే చెమ‌ట కాయ‌లు. చెమ‌ట కాయ‌లువ‌చ్చాయంటే చాలు, ఎక్క‌డ లేని ఇబ్బంది క‌లుగుతుంది. చ‌ల్ల‌గా ఉన్నంత సేపు ఓకే. వేడి వాతావ‌ర‌ణం లోకి వెళితే చాలు, ఇక అవి పెట్టే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అయితే కింద చెప్పిన ప‌లు టిప్స్ పాటిస్తే చెమ‌ట కాయ‌ల స‌మ‌స్య నుంచి ఇట్టే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కలబంద…
కొద్దిగా కలబంద గుజ్జును తీసుకుని చెమట కాయలు ఉన్న ప్రదేశంలో రాయాలి. కలబందలో ఉండే ఆస్ట్రిజెంట్ లక్షణాలు చెమట కాయలను నిర్మూలించడంలో మెరుగ్గా పనిచేస్తాయి. చర్మంపై ఉండే ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. ప్రధానంగా రోజులో అధిక శాతం వేడి వాతావరణంలో గడిపే వారికి అలోవెరా జెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

టీ ట్రీ ఆయిల్…
టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కొద్దిగా టీ ట్రీ ఆయిల్‌ను తీసుకుని దానికి కొంత నీటిని కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. ఆ మిశ్రమంలో కాటన్ బాల్‌ను ముంచి చర్మంపై రాస్తే చెమట కాయలు తగ్గిపోతాయి.

ఐస్ ప్యాక్…
శుభ్రమైన కాటన్ క్లాత్‌ను తీసుకుని అందులో కొన్ని ఐస్ ముక్కలను వేయాలి. అనంతరం ఆ ఐస్ ప్యాక్‌ను చెమటకాయలు ఉన్న ప్రాంతంలో 15 నిమిషాల పాటు మసాజ్ చేసినట్టు రాయాలి. దీంతో వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలా చెమట కాయలు తగ్గేవరకు ప్రతి 3, 4 గంటలకు ఒకసారి ఐస్ ప్యాక్‌ను అప్లై చేస్తే తగిన ఫలితం కనిపిస్తుంది.

వెనిగర్…
వెనిగర్‌లో ఉండే అసిటిక్ యాసిడ్‌కు చర్మాన్ని సంరక్షించే గుణాలు ఉన్నాయి. టిష్యూ పేపర్‌ను తీసుకుని వెనిగర్‌లో ముంచి చెమట కాయలు ఉన్న చోట అద్దాలి. ఇలా చేస్తే చెమట కాయలు త్వరగా తగ్గుముఖం పడతాయి.

లవంగ నూనె…
చర్మాన్ని సంరక్షించే ఎన్నో గుణాలు లవంగ నూనెలో ఉన్నాయి. కాటన్ బాల్‌ను తీసుకుని లవంగ నూనెలో ముంచి శరీరంపై రాస్తే చెమట కాయలు తగ్గుముఖం పడతాయి. తరచూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

బ్లాక్ టీ…
కొద్దిగా బ్లాక్ టీని తీసుకుని చర్మంపై రాయాలి. దీని వల్ల కూడా చెమట కాయలు తగ్గుతాయి. చర్మానికి సంరక్షణ అందుతుంది.

ఓట్స్…
కొద్దిగా ఓట్స్‌ను తీసుకుని మిక్సీలో వేసి పౌడర్‌గా పట్టుకోవాలి. దాంట్లో కొంత గోరు వెచ్చని నీటిని పోయాలి. అనంతరం దాన్ని మిశ్రమంగా కలపాలి. దీన్ని చెమటకాయల మీద రాయాలి. అరగంట తరువాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే చెమట కాయలు తగ్గుతాయి.

Comments

comments

Share this post

scroll to top