యోగా ముద్రలతో ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి..!

యోగా… ఈ పేరు తెలియని వారుండరు. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అధిక శాతం మంది తమ వ్యాయామంలో యోగాను కూడా ఓ భాగంగా చేసుకుని దాన్ని నిత్యం పాటిస్తున్నారు. దీంతో దాని వల్ల కలిగే లాభాలను కూడా పొందుతున్నారు. అయితే చేతి వేళ్లను కొన్ని ప్రత్యేకమైన ముద్రల రూపంలో ఉంచడం ద్వారా కూడా అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ముద్రలు కూడా యోగాలో ఒక భాగమే. ఈ క్రమంలో పలు యోగ ముద్రలను నిత్యం అనుసరించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

yoga-mudras

1. శూన్యముద్ర
చిత్రంలో చూపిన విధంగా అన్ని వేళ్లను ముందుకు చాచి మధ్యవేలిని పైకి లేపి దానిపై బొటన వేలిని ఉంచి ఈ ముద్రను వేయాలి. అలా కొంతసేపు ఉండాలి. రోజులో కనీసం కొంత సేపు ఈ ముద్రను వేస్తే చెవి నొప్పి తగ్గుతుంది. తిమ్మిరి పట్టినట్టు ఉంటే ఆ సమస్య కూడా తొలగిపోతుంది.

2. జ్ఞానముద్ర
బొమ్మలో ఇచ్చిన విధంగా చేతులను ఉంచి చూపుడు వేలిని బొటన వేలితో టచ్ చేయాలి. దీన్ని నిత్యం ప్రాక్టీస్ చేస్తే జ్ఞాపకశక్తి, సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త ఉత్సాహం వస్తుంది.

3.వాయన్ ముద్ర
చూపుడు వేలిని బొటన వేలితో కిందకి ప్రెస్ చేస్తూ చిత్రంలో ఇచ్చిన విధంగా పట్టుకోవాలి. దీన్ని వాయన్ ముద్ర అంటారు. ఇది మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. నిత్యం పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు ఈ ముద్రను ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది.

4. పృథ్వీ ముద్ర
ఉంగరపు వేలిని బొటన వేలితో కలిపి పట్టుకోవాలి. దీన్ని ప్రథ్వీ ముద్ర అంటారు. ఇది మనస్సుకు రిలాక్సేషన్ ఇస్తుంది. కండరాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. శారీరక ఆరోగ్యం కూడా కలుగుతుంది.

yoga-mudras

5. వరుణ్ ముద్ర
చిటికెన వేలిని బొటన వేలితో అదుముతూ పట్టుకోవాలి. దీన్ని వరుణ్ ముద్ర అంటారు. దీని వల్ల కీళ్ల నొప్పుల వంటి సమస్యలు తొలగిపోతాయి. డీహైడ్రేషన్ తగ్గుతుంది.

6. ఆకాష్ ముద్ర
మధ్యవేలి కొసను బొటన వేలి కొసను కలిపి పట్టుకోవాలి. దీన్ని ఆకాష్ ముద్ర అంటారు. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకి పంపుతుంది.

7. సూర్య ముద్ర
చిత్రంలో చూపిన విధంగా ఉంగరపు వేలిని బొటన వేలితో కిందకి అదిమిపెట్ట పట్టుకోవాలి. దీన్ని సూర్య ముద్ర అంటారు. దీంతో జీర్ణాశయ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ప్రధానంగా జీర్ణక్రియ మెరుగు పడుతుంది. దృష్టి సంబంధ సమస్యలు తొలగిపోతాయి. బరువు కూడా తగ్గుతారు.

Comments

comments

Share this post

scroll to top