విదేశీయులు రాత్రి వేళల్లో అండర్‌వేర్ లేకుండా నిద్రిస్తారు..! ఎందుకో తెలుసా..?

ఇప్పుడు మేం చెప్పబోయేది కొద్దిగా ఇబ్బంది కలిగించే అంశమే. అయినప్పటికీ చెప్పక తప్పదు. ఎందుకంటే దీని వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఆ అంశమేమిటో తెలుసుకుందాం. అది ఏమీ లేదండీ! అండర్‌వేర్ గురించి. ‘బిగుతైన అండర్‌వేర్స్ ధరించడం వల్ల మనకు కలిగే అనారోగ్య సమస్యలేమిటో తెలుసుకోండి..!’ అంటూ ఇంతకు ముందు ఓ కథనం పబ్లిష్ చేయడం జరిగింది కదా! సరిగ్గా దానికి దగ్గర సంబంధం ఉన్న మరో అంశం గురించే మేం చెప్పబోయేది. అదేమిటంటే రాత్రి పూట అండర్‌వేర్ లేకుండా నిద్రించడం వల్ల కలిగే లాభాల గురించి. అవును, అలా నిద్రించడం మంచిదేనట. విదేశీయులు ఇలా ఎక్కువగా నిద్రిస్తారట. ఈ క్రమంలో అండర్‌వేర్ లేకుండా నిద్రించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అండర్‌వేర్ లేకుండా నిద్రించడం వల్ల శరీరం మొత్తానికి సరిగ్గా గాలి తగులుతుంది. దీని వల్ల బాడీ తన సాధారణ టెంపరేచర్‌కు చేరుకుంటుంది. దీంతో శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి.

2. శరీరంలో ఉన్న హార్మోన్లన్నీ సక్రమంగా పనిచేస్తాయి. వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా దరిచేరవట. దీంతో ఎప్పటికీ యంగ్‌గానే కనిపిస్తారట. అంతేకాదు అలా నిద్రించడం వల్ల శరీరానికి రిలాక్స్‌డ్ ఫీలింగ్ కలుగుతుంది.

women-sleeping

3. జననావయవాలకు చాలా మంచిదట. అవి తమ విధులను సక్రమంగా నిర్వహిస్తాయట. ప్రధానంగా మహిళలకు ఈస్ట్, ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు రావట. పురుషుల్లో లైంగిక సామర్థ్యం, వీర్యకణాల కౌంట్ పెరుగుతుందట. అంతేకాదు వీర్యకణాలు ఆరోగ్యంగా కూడా ఉంటాయట. దీని వల్ల సంతానం కలిగే అవకాశం మరింతగా పెరుగుతుందట.

4. అండర్‌వేర్స్ లేకుండా నిద్రించడం వల్ల శరీరం స్వేచ్ఛగా ఉండి మనసుకు కూడా మరింత ప్రశాంతత చేకూరుతుందట. అలా నిద్రించడం వల్ల చర్మ సంబంధ సమస్యలు కూడా దూరమవుతాయట.

5. అండర్‌వేర్స్‌తోపాటు దుస్తులేమీ లేకుండా నగ్నంగా నిద్రిస్తే దంపతుల మధ్య చనువు ఎక్కువగా పెరిగి వారి లైంగిక జీవితం మరింత ఆనందంగా ఉంటుందట.

6. శరీరం ఎల్లప్పుడూ ఉత్తేజంగా, ఉత్సాహంగా ఉంటుందట. నిత్యం సంతోషంగా ఉంటారట. ఒత్తిడిని కలిగించే హార్మోన్లు మాయమై ఎప్పుడూ హ్యాపీ మూడ్‌లోనే ఉంటారట.

7. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు అండర్‌వేర్స్ లేకుండా, ఇంకా చెబితే నగ్నంగా నిద్రిస్తే మరింత నిద్ర పడుతుందట. ఎక్కువ సేపు నిద్రపోవచ్చట.

Comments

comments

Share this post

scroll to top