థైరాయిడ్‌, డ‌యాబెటిస్, గుండె స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే ప‌చ్చి కొబ్బ‌రి..!

ప‌చ్చి కొబ్బ‌రిని నిత్యం మ‌నం వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటాం. కొబ్బ‌రి ప‌చ్చ‌డి, కొబ్బ‌రి హ‌ల్వా వంటివి చేసుకుని తింటాం. దీంతోపాటు కొంద‌రు ప‌చ్చి కొబ్బ‌రిని అలాగే డైరెక్ట్‌గా తింటారు. అయితే ప‌చ్చి కొబ్బ‌రి కేవ‌లం అలా రుచికి మాత్ర‌మే కాదు, అనేక‌ పోష‌కాల‌కూ నెల‌వు. ఎందుకంటే అందులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ప‌లు కీల‌క న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ క్ర‌మంలో ప‌చ్చి కొబ్బ‌రిని త‌ర‌చూ తీసుకుంటూ ఉంటే దాంతో మన శ‌రీరానికి పోష‌కాహారం అంద‌డ‌మే కాదు, ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ప‌చ్చి కొబ్బ‌రి వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!

raw-coconut-1

1. ప‌చ్చి కొబ్బ‌రిని నిత్యం ఏదో ఒక విధంగా తింటూ ఉంటే దాంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి. యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ పారాసైట్ గుణాలు ప‌చ్చి కొబ్బ‌రిలో పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల క్రిములు, బాక్టీరియ‌లు, వైర‌స్‌ల నుంచి మ‌న‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అవి మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తే ఏ మాత్రం బ‌త‌క‌వు.

2. క్రీడాకారుల‌కు, నిత్యం వ్యాయామం చేసే వారికి, శారీర‌క శ్ర‌మ చేసే వారికి ప‌చ్చి కొబ్బ‌రి ఎంత‌గానో మేలు చేస్తుంది. ప‌చ్చి కొబ్బ‌రి తిన‌డం వ‌ల్ల శ‌క్తి వేగంగా అందుతుంది. దీంతో మ‌రింత సేపు శ్ర‌మించినా పెద్ద అల‌స‌ట రాదు. ఎక్కువ శ‌క్తి అందుతుంది.

3. జీర్ణాశ‌య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతుంది. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

raw-coconut-2

4. డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ప‌చ్చి కొబ్బ‌రి తింటే మేలు జ‌రుగుతుంది. దీంతో వారి ర‌క్తంలోని షుగ‌ర్ స్థాయిలు అదుపులోకి వ‌చ్చి డ‌యాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది.

5. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడే ఔష‌ధ గుణాలు ప‌చ్చి కొబ్బ‌రిలో ఉన్నాయి. ప‌చ్చి కొబ్బ‌రిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్స‌ర్ క‌ణ‌తుల వృద్ధిని అడ్డుకుంటాయి.

6. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ త‌యార‌వుతుంది. దీంతో గుండె సంబంధ స‌మ‌స్య‌లు రావు. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు పోతాయి.

7. థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ప‌చ్చికొబ్బ‌రిని తిన‌డం అల‌వాటు చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది. థైరాయిడ్ స‌మ‌స్య త‌గ్గుతుంది. త‌ద్వారా క‌లిగే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా చెక్ పెట్ట‌వ‌చ్చు.

raw-coconut-3

8. మూత్రాశ‌య స‌మ‌స్య‌లు ఉన్న వారికి కూడా ప‌చ్చి కొబ్బ‌రి మేలు చేస్తుంది. మూత్రం సాఫీగా వస్తుంది. బ్లాడ‌ర్ ఇన్‌ఫెక్ష‌న్లు న‌యం అవుతాయి. కిడ్నీలు స‌రిగ్గా ప‌నిచేస్తాయి.

9. అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న వారు ప‌చ్చి కొబ్బ‌రిని త‌మ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా చేస్తే కొవ్వు క‌రుగుతుంది. త‌ద్వారా అధిక బ‌రువు త‌గ్గుతారు.

10. చ‌ర్మం, వెంట్రుక‌లు ఆరోగ్యంగా, ప్ర‌కాశ‌వంతంగా మారుతాయి. చ‌ర్మంపై వ‌చ్చే ముడ‌త‌లు పోతాయి. వెంట్రుక‌లు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.

Comments

comments

Share this post

scroll to top