వర్షం నీటిని తాగవచ్చా..? తాగితే ఏమవుతుంది..?

వర్షం.. గత వారం రోజుల నుంచి చాలా చోట్ల పడుతోంది. కొన్ని చోట్ల లేదు. కొన్ని చోట్లయితే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇది సరే.. అసలు విషయం ఏమిటంటే.. వర్షపు నీటి పట్ల జనాల్లో ఇప్పటికీ ఓ సందేహం ఉంది. వర్షం నీటిని తాగవచ్చా, రాదా..? అని అవును. అయితే దీనికి సైంటిస్టులు చెబుతున్న సమాధానం.. అవును, వర్షపు నీటిని తాగవచ్చు. దాంతో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. నిజానికి ఈ నీరు ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైందట. అవును, మీరు విన్నది నిజమే. సైంటిస్టులు చేసిన అధ్యయనాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అయితే వర్షపు నీటిని నేరుగా పట్టుకోవాలి. అది కూడా శుభ్రమైన పాత్రల్లో పట్టుకుని నిల్వ చేసుకోవాలి. అలా నిల్వ చేసుకున్న నీటిని తాగవచ్చు. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వర్షపు నీటిని తాగితే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. రక్తంలోని పీహెచ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి.

2. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ వంటి వ్యాధులు రావు. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

3. రోజూ ఉదయాన్నే పరగడుపున 2, 3 టేబుల్ స్పూన్ల వర్షపు నీటిని తాగితే జీర్ణ సమస్యలన్నీ పోతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండదు. పేగులు, జీర్ణాశయం శుభ్రమవుతాయి.

4. వర్షపు నీటిని తాగుతున్నా లేదంటే ఆ నీటితో స్నానం చేసినా వెంట్రుకలు దృఢంగా మారుతాయి. ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు సమస్య ఉండదు. జుట్టుకు కావల్సిన పోషణ లభిస్తుంది.

5. వర్షం నీటితో చర్మం కాంతివంతంగా మారుతుంది. మృదువుగా తయారవుతుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. చర్మ సమస్యలు ఉండవు. మొటిమలు, మచ్చలు మాయమవుతాయి.

6. వర్షం నీటితో బట్టలను ఉతికితే అవి చాలా త్వరగా మురికిని వదిలించుకుంటాయి. మురికి త్వరగా పోతుంది. దుస్తులు కూడా మృదువుగా ఉంటాయి. కలర్ పోకుండా ఉంటుంది.

7. వర్షం నీరు మొక్కలకు చాలా మంది. ఆ నీటిని నిల్వ చేసి రోజూ మొక్కలకు పోస్తే మొక్కలు ఏపుగా పెరుగుతాయి.

8. మనకే కాదు, వర్షం నీరు కుక్కలు, పిల్లలు, ఇతర పెంపుడు జంతువులకు కూడా మంచిదే. వాటికి కూడా ఆరోగ్యం కలుగుతుంది.

9. వర్షం నీటిని ఒక గ్లాస్‌లో తీసుకుని అందులో 1/4 టీస్పూన్ పసుపు కలిపి రోజూ ఉదయాన్నే తాగుతుంటే అధిక బరువు తగ్గుతారని ఆయుర్వేదం చెబుతోంది.

గర్భిణీ స్త్రీలు వర్షపు నీటిని తాగకూడదు. ఆ నీటిని మరిగించి తాగాలి. దీంతో ఇబ్బంది ఉండదు. లేదంటే కడుపులో ఉండే పిండం ఇన్‌ఫెక్షన్లకు గురవుతుంది. వర్షపు నీటిని తట్టుకునే శక్తి పిండానికి ఉండదు. ఇక వర్షపు నీటిని సేకరించడంలోనూ జాగ్రత్త వహించాలి. వర్షం నీరు గోడలు, చెట్లు, ఇంటి పైకప్పు ఇలా దేన్నీ తాకకుండా నేరుగా పాత్రలోనే పడేలా చేసుకోవాలి. లేదంటే దేన్నయినా తాకితే వాటిలో ఉండే బాక్టీరియా నీటిలోకి అలాగే వస్తుంది కనుక దాంతో మనకు ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.

Comments

comments

Share this post

scroll to top