హెల్త్ కి మంచిదని రోజు “ఓట్స్” తింటున్నారా.? అయితే మీ బాడీ లో వచ్చే ఈ 8 మార్పుల గురించి తప్పక తెలుసుకోండి.!

ప్ర‌తి ఒక్క‌రు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ క‌చ్చితంగా తీసుకోవాల‌ని అందరికీ తెలిసిందే. ఎందుకంటే.. క్రితం రోజు రాత్రి ఆహారం తీసుకున్న త‌రువాత చాలా స‌మ‌యం కడుపు ఖాళీగా ఉంటుంది. క‌నుక ఆ స్థితిలో ఉన్న శరీరానికి శ‌క్తి కావాలంటే ఎవరైనా క‌చ్చితంగా ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. అయితే నేటి త‌రుణంలో చాలా మంది ఉద‌యం పూట కొవ్వు ఎక్కువ‌గా ఉండే ఆహారాలు, ఆయిల్ ఫుడ్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటున్నారు. కానీ అవి గుండెకు కీడు చేస్తాయ‌ని గ్ర‌హించ‌లేక‌పోతున్నారు. మ‌రి అలాంటి వారు తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో తెలుసా..? ఓట్స్‌.. అవును, అవే. రోజూ ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌ను తీసుకుంటే దాంతో అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు, లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. చ‌ర్మం :

రోజూ ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్ మీల్ తీసుకుంటే చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎగ్జిమా, దద్దుర్లు త‌గ్గుతాయి. ఓట్స్‌లో ఉండే ప‌లు ముఖ్య‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ చ‌ర్మానికి మేలు చేస్తాయి. వాటిల్లో ఉండే జింక్ చ‌ర్మాన్ని క్లీన్ చేస్తుంది. అందులో ఉండే టాక్సిన్ల‌ను, ఇత‌ర విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. అలాగే చ‌ర్మానికి కొత్త కాంతిని అందిస్తుంది. ఓట్స్‌లో ఉండే ఐర‌న్ చ‌ర్మ క‌ణాల‌ను మృదువుగా మారుస్తుంది. వాపుల‌ను త‌గ్గిస్తుంది. గాయాలు, పుండ్లు మానిపోతాయి. ఓట్స్‌లో ఉండే మెగ్నిషియం ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. చ‌నిపోయిన చ‌ర్మ క‌ణాల స్థానంలో కొత్త క‌ణాలు ఏర్ప‌డేలా చేస్తుంది.

2. కండ‌రాల :

ఓట్స్‌లో ఉండే ప్రోటీన్లు కండ‌రాల‌కు బ‌లాన్నిస్తాయి. కేవ‌లం 8 టేబుల్ స్పూన్ల ఓట్స్‌ను తింటే చాలు మ‌న‌కు రోజు మొత్తంలో కావల్సిన ప్రోటీన్‌లో 15 శాతం వ‌ర‌కు అందుతుంది. అలాగే విట‌మిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, గ్లూట‌మైన్ వంటి పోష‌కాలు ఓట్స్‌లో స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి కండ‌రాల‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేస్తాయి. కొత్త కండ‌రాలు ఏర్ప‌డేలా చేస్తాయి.

3. యాంటీ ఆక్సిడెంట్లు :

ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి దుర‌ద‌లు, వాపులు, హైబీపీని త‌గ్గిస్తాయి. ఓట్స్‌లో ఉండే బీటా గ్లూకాన్ ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిల‌ను త‌గ్గిస్తుంది. దీంతో మ‌ధుమేహం అదుపులో ఉంటుంది. ఓట్ మీల్‌లో ఆరెంజ్ జ్యూస్ క‌లుపుకుని తింటే ఇంకా ఎక్కువ లాభాలు క‌లుగుతాయి.

4. శ‌క్తి :

ఓట్స్‌లో పిండి ప‌దార్థాలు కూడా పుష్క‌లంగానే ఉంటాయి. ఇవి శ‌రీరానికి కావ‌ల్సినంత శ‌క్తిని అందిస్తాయి. దీంతో రోజంతా చురుగ్గా ప‌నిచేయ‌వ‌చ్చు. త్వ‌ర‌గా అల‌సిపోకుండా ఉంటారు.

5. అధిక బ‌రువు :

ఓట్స్‌ను రోజూ తింటూ ఉంటే శ‌రీర మెట‌బాలిజం ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఓట్స్ కొన్ని తిన్నా క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో ఎక్కువ క్యాల‌రీల‌ను ఇచ్చే ఆహారాన్ని తీసుకోకుండా ఉంటారు. త‌ద్వారా బ‌రువు త‌గ్గుతారు.

6. కొలెస్ట్రాల్ :

ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే ఓ ర‌క‌మైన ఫైబ‌ర్ ఉంటుంది. ఇది శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది. ఓట్స్‌లో ఉండే లినోలీక్ యాసిడ్‌, ఫైబ‌ర్‌లు ర‌క్తంలో ఉండే ట్రై గ్లిజ‌రిడ్స్, చెడు కొలెస్ట్రాల్‌ల‌ను త‌గ్గిస్తాయి. ర‌క్త‌నాళాల‌ను శుద్ధి చేస్తాయి. వాటిల్లో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి.

7. గుండె స‌మ‌స్య‌లు :

ఓట్స్‌లో మ‌న శ‌రీరానికి పనికొచ్చే ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె క‌ణాల‌ను, ర‌క్త స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ను ర‌క్షిస్తాయి. అలాగే ఓట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ర‌క్త నాళాల గోడ‌ల‌ను డ్యామేజ్ కాకుండా చూస్తాయి. దీంతో గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

8. జీర్ణ స‌మ‌స్య‌లు :

నిత్యం మ‌నం 25 నుంచి 35 గ్రాముల మోతాదులో ఫైబ‌ర్ తీసుకోవాలని న్యూట్రిష‌నిస్టులు సూచిస్తున్నారు. అది మ‌న‌కు ఓట్ మీల్ ద్వారా ల‌భిస్తుంది. క‌నుక రోజూ ఓట్స్‌ను తింటే దాంతో శ‌రీరానికి ఫైబ‌ర్ పుష్క‌లంగా అందుతుంది. అది జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రిచి జీర్ణ స‌మ‌స్య‌లైన గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది.

 

Comments

comments

Share this post

scroll to top