అరిటాకులో ఎందుకు భోజ‌నం చేయాలో తెలుసా..?

ఆధునిక జీవ‌న శైలి కార‌ణంగా ఇప్పుడంటే మ‌నం ప్లాస్టిక్‌, స్టీల్, పింగాణీ వంటి ప్లేట్ల‌లో… ఒక్కోసారి బ‌యట ఉన్న‌ప్పుడు పేప‌ర్ ప్లేట్లలో భోజనం చేస్తున్నాం. కానీ… ఒక‌ప్పుడైతే మ‌న పూర్వీకులు ఎంచ‌క్కా అరిటాకుల్లోనే భోజ‌నం చేసే వారు. అయితే పెద్ద‌లు చెప్పే మాట‌లు చ‌ద్ద‌న్నం మూట‌లుగా ఉన్న‌ట్టే వారు చేసే ఏ ప‌నైనా దాని వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. మ‌రి వారు అరిటాకుల్లో భోజ‌నం చేయ‌డం వెనుక ఉన్న రీజ‌న్ ఏంటో తెలుసా..? ఆరోగ్యం… అదే..! దాని కోస‌మే మ‌న పెద్ద‌లు వాటిల్లో భోజ‌నం చేసే వారు. ఇప్ప‌టికీ కొన్ని ప్రాంతాల్లో అరిటాకుల్లోనే తింటారు. కొన్ని హోట‌ల్స్‌లో అయితే అరిటాకుల్లోనే ప్ర‌త్యేకంగా భోజ‌నం పెడుతున్నారు కూడా. ఈ క్ర‌మంలో అరిటాకుల్లో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

banana-leaf-meals

1. పచ్చటి అరిటాకులో వేడి వేడి ఆహారపదార్థాలు వడ్డించడంవల్ల ఆకుపైన ఉండే పొర కరిగి అన్నంలో కలుస్తుంది. దీనివల్ల భోజనానికి మంచి రుచి వస్తుంది. దీంతో భోజ‌నంలో చ‌క్క‌ని రుచిని ఆస్వాదించ‌వ‌చ్చు.

2. అరిటాకుకులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వేడి పదార్థాలు ఆ ఆకుపైన పెట్టుకుని తిన్నప్పుడు ఆకులోని విటమిన్లు అన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి. వేడి వేడి పదార్థాలు అరిటాకులో తినడం వల్ల కఫ, వాతాలు తగ్గి శరీరానికి బలం చేకూరుతుంది, ఆరోగ్యం చక్కబడుతుంది. శరీరం కాంతిమంతమవుతుంది. ఆకలిపుడుతుంది. ఎన్నో రకాల జబ్బులను నిరోధించే శక్తి అరిటాకులో ఉంది.

3. అరిటాకుల్లో తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

4. అరిటాకులో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల అందులోని పోష‌కాలు శ‌రీరంలోకి చేరి త‌ద్వారా శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. వెంట్రుక‌లు న‌ల్ల‌బ‌డ‌తాయి. తెల్ల‌ని జుట్టు ఉన్నవారు అరిటాకులో భోజ‌నం చేస్తుంటే వారి జుట్టు క్ర‌మంగా న‌ల్ల‌బ‌డుతుంది.

5. అరిటాకులో భోజనం పెట్టినప్పుడు, ఒకవేళ విషాహారం పెడితే, అరిటాకు నల్లగా మారిపోతుంది. అన్నంలో విషం ఉందని బహిర్గతమైపోతుంది.

6. అరిటాకుల్లో పాలీఫినాల్స్‌ ఉంటాయి. ఇవి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్‌ను కలిగి ఉంటాయి. వీటిపై వేడివేడి పదార్థాలు వడ్డిస్తే ఇవి కూడా భోజనంలో కలిసిపోతాయి. దీనివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

7. ఏదైనా పదార్థంలో ఉప్పు ఎక్కువైతే దాన్ని తిన‌లేం. పారేస్తాం. అయితే అరిటాకు వ‌ల్ల అలా పారేయాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ఆ ప‌దార్థం ఉన్న పాత్ర మూత‌ను తీసి దాని స్థానంలో అరిటాకును పెట్టి కొంత సేపు మ‌ళ్లీ ఉడికించాలి. దీంతో ఉప్పు అంతా పోయి ఆహారం రుచిగా మారుతుంది.

8. అరటి పండ్ల‌లోనే కాదు, అర‌టి ఆకుల్లోనూ పొటాషియం స‌మృద్ధిగా ఉంటుంది. ఈ క్ర‌మంలో అరిటాకులో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల పొటాషియం అంది త‌ద్వారా గుండె సంబంధ స‌మ‌స్య‌లు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది.

Comments

comments

Share this post

scroll to top