అధిక బ‌రువు, డిప్రెష‌న్‌, కీళ్ల నొప్పులు, జీర్ణ స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌ని ప‌రిష్కారం… స‌బ్జా గింజ‌లు..!

చియా సీడ్స్… అవేనండీ స‌బ్జా గింజ‌లు. నీటిలో వేసిన కొంత సేప‌టికి జెల్ లా మారిపోతాయి క‌దా. అవే. చూసేందుకు ఈ గింజ‌లు చాలా చిన్న పరిమాణంలో ఉన్న అవి చేసే మేలు అంతా ఇంతా కాదు. కేవ‌లం 3 గ్రాముల స‌బ్జా గింజ‌ల‌ను తీసుకుని వాటిని నీటిలో వేయాలి. 10 నిమిషాల‌కు అవి జెల్‌లా మారుతాయి. అప్పుడు వాటిని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదంటే ఫ్రూట్ స‌లాడ్స్, ప‌ళ్ల ర‌సాలు, మ‌జ్జిగ వంటి వాటితో క‌లిపి తిన‌వ‌చ్చు. ఎలా తిన్నా కూడా స‌బ్జా గింజ‌ల ద్వారా మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక బ‌రువుకు…
అధిక బ‌రువు సమ‌స్య‌తో బాధ ప‌డేవారికి స‌బ్జా గింజలు చ‌క్క‌ని ఔష‌ధం. ఎందుకంటే వీటిని స్వ‌ల్ప ప‌రిమాణంలో తిన్నా చాలు. త్వ‌ర‌గా క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతోపాటు వీటిని తింటే ఎక్కువ స‌మ‌యం ఆక‌లి వేయ‌దు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంది.

జీర్ణ స‌మ‌స్య‌ల‌కు…
స‌బ్జా గింజ‌ల‌ను పైన చెప్పిన విధంగా నీటిలో వేసుకుని తింటే దాంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి. ప్ర‌ధానంగా తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. డైట‌రీ ఫైబ‌ర్ అధికంగా ఉండ‌డంతో మ‌ల‌బ‌ద్ద‌కం బాధించ‌దు. గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.

గాయాల‌కు…
కొద్దిగా స‌బ్జా గింజ‌ల‌ను తీసుకుని పొడి చేయాలి. దాన్ని గాయాల‌పై వేసి క‌ట్టు క‌డితే అవి త్వ‌ర‌గా మానుతాయి. అంతేకాదు, ఇన్‌ఫెక్ష‌న్ల‌ను కూడా ద‌రి చేర‌నివ్వ‌వు.

త‌ల‌నొప్పికి…
స‌బ్జా గింజ‌ల‌ను నీటిలో క‌లిపి తింటే త‌ల‌నొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. మైగ్రేన్‌తో బాధ ప‌డుతున్న వారు కూడా ఇలా చేయ‌వ‌చ్చు. దీంతో స‌మ‌స్య నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ర‌క్తాన్ని శుద్ధి చేయ‌డానికి…
రక్తాన్ని శుధ్ది చేసే గుణాలు స‌బ్జా గింజ‌ల్లో ఉన్నాయి. ర‌క్త స‌ర‌ఫరా కూడా మెరుగు ప‌డుతుంది. బీపీ కూడా అదుపులోకి వ‌స్తుంది.

శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌కు…
గోరు వెచ్చ‌ని నీటితో కొంత తేనె, అల్లం ర‌సం క‌లిపి దాంతోపాటు కొన్ని స‌బ్జాగింజ‌ల‌ను కూడా అందులో వేసి ఆ మిశ్ర‌మం తాగాల్సి ఉంటుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి.

శ‌క్తికి…
ఉద‌యాన్నే స‌బ్జా గింజ‌ల‌ను నీటిలో వేసుకుని తింటే త‌ద్వారా ఎంతో శ‌క్తి ల‌భిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చిన్నారుల‌కు, టీనేజ్ వారికి ఇలా తినిపిస్తే వారు ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు. నీర‌సం ద‌రి చేర‌దు. శారీర‌క శ్ర‌మ చేసే వారు, క్రీడాకారులు ఇలా స‌బ్జా గింజ‌ల‌ను తింటే దాంతో ఇంకా ఎక్కువ సేపు ప‌నిచేయ‌గ‌లుగుతారు.

ఆర్థ‌రైటిస్‌కు…
కీళ్ల నొప్పుల స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న వారు స‌బ్జా గింజ‌ల‌ను తింటే ఫ‌లితం ఉంటుంది. నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. శ‌రీరంలో ఎక్క‌డైనా వాపులు ఉంటే ఇట్టే త‌గ్గిపోతాయి.

అల‌ర్జీల‌కు…
యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు స‌బ్జా గింజ‌ల్లో పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి అల‌ర్జీలు, ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి.

డిప్రెష‌న్‌కు…
స‌బ్జా గింజ‌ల‌ను నీటిలో వేసుకుని తింటే డిప్రెష‌న్ వెంట‌నే దూర‌మ‌వుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న వంటివి త‌గ్గుతాయి. దీనిపై ప‌లువురు సైంటిస్టులు ప్ర‌యోగాలు చేసి నిరూపించారు కూడా. క‌నుక స‌బ్జా గింజ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తింటుంటే దాంతో పైన చెప్పిన విధంగా లాభాలు క‌లుగుతాయి.

Comments

comments

Share this post

scroll to top