ఆమె “క్యాబేజీని” అక్కడ పెట్టుకుంది..! తర్వాత ఏమైందో తెలుసా.? చూస్తే తప్పక ట్రై చేయాలనుకుంటారు.!

కొంచెం వయసు పై బడిన వారిని కదిపితే చాలు వినపడే సమస్య మోకాళ్ల నొప్పులు..ఆ నొప్పులు తగ్గించుకోవడానికి ఎన్నో రకాల మందులు,ఎక్సర్సైజ్లు,రకరకాల ప్రయోగాలు..మారిన జీవన ప్రమాణాలు,ఆహరపుటలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.అన్ని అనారోగ్య సమస్యలకు మందులొక్కటే పరిష్కారం కాకపోవచ్చు..మన ఇళ్లల్లో ఉండే రకరకాల పదార్దాలు మన సమస్యలకు పరిష్కాలను చూపుతాయి.వాటిల్లో ఒకటి క్యాబేజి… కాలిఫోర్నియాలోని ముస్సూరి యూనివర్సీటీ పరిశోధనలో క్యాబేజీ ఆకులు మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయన్నది రుజువైంది.అదేలాగో చూద్దాం….

మోకాళ్ల నొప్పులకు క్యాబేజీ ఆకులమందు..

  •  రెండు కాళ్లు నొప్పులుగా ఉంటే రెండు క్యాబేజీ ఆకులను తీసుకోవాలి. క్యాబేజీకి పైన తాజాగా ఉన్న ఆకులను తీసుకుంటే సరిపోతుంది. శుభ్రంగా ఆ ఆకులను కడగి,ఆరబెట్టాలి.
  • ఆకు ఆకారం మారకుండా చాకుతో దాన్ని అడ్డంగా ముక్కలుగా కోయాలి. కోసినా ఆ ముక్కల ఆకారం పూర్తిగా ఆకులానే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదా ఇంట్లో ఉండే చపాతీల కర్రతో చపాతీలు చేస్తున్న తీరులో ఆకు కాస్త మెత్తపడే వరకు రుద్దాలి. కాస్త నలిగినట్లు అయి రసం బయటకు వచ్చేంత వరకు రుద్దితే మంచిది.
  • రాత్రి పడుకునే ముందు అలా ఆకులను చిదిమిన తర్వాత మోకాలిపై పూర్తిగా ఆకును పెట్టి బ్యాండేజీ క్లాత్ లేదా ప్లాస్టర్ తో చుట్టేయాలి.
  • మోకాళ్ల నొప్పులు కాకుండా కాలిపై ఇతర బాగాల్లో నొప్పి ఉంటే అక్కడ ఇలా పెట్టినా సరిపోతుంది.
  •  ఉదయాన్నే ఆ బ్యాండేజీని తొలగించాలి. ప్రతి రోజు కొత్తగా మళ్లీ క్యాబేజీ ఆకులను తీసుకొని ఓ నెలపాటు రోజూ రాత్రి పూట ఇలా బ్యాండేజీ వేసుకుంటే మోకాళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి.

క్యాబేజి వలన ఉన్న ఇతర ఉపయోగాలు..

  • ప్రతి రోజూ క్యాబేజీ జ్యూస్ ను తాగితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. యాంటీ ఇన్ఫర్మేటరీ లక్షణాలు క్యాబేజీకి ఉన్నాయి. ఇవి నొప్పులను తగ్గించేందుకు ఉపయోగపడతాయి.
  • క్యాబేజీలో సల్ఫర్‌ సమృద్ధిగా ఉంటుంది. పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు క్యాబేజీలో ఉన్నాయి.
  • క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది. ఇందులోని పొటాషియం రక్తనాళాలను తెరుచుకునేలా చేసి రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.
  • బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ బాగా ఉపయోగ పడుతుంది. పచ్చి క్యాబేజీ జ్యూస్‌ తాగితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి.

Comments

comments

Share this post

scroll to top