దేశం కోసం సర్వం త్యాగం చేసిన గొప్పోడు..పాక్ రహస్యాల గుట్టు విప్పిన సీక్రెట్ ఏజెంట్.!

ఎన్నేళ్లు జీవించామ‌నేది కాదు భ‌య్యా… ఏం సాధించామ‌న్న‌దే ముఖ్యం..! అదే మాట‌ను వంటబ‌ట్టించుకున్నాడు ఆ వ్య‌క్తి. అంతే… దేశానికి సేవ చేసేందుకు వచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్నాడు. చివ‌రికి భార‌తీయుల దృష్టిలో ఆయ‌నో రియ‌ల్ హీరో అయ్యాడు. అత‌నే ర‌వీంద్ర కౌశిక్‌. ఇంత‌కు ముందు మ‌నం ప‌లువురు రియ‌ల్ హీరోల గురించి తెలుసుకున్నాం క‌దా. అదే లిస్ట్‌లో ఈయ‌న కూడా ఒక‌రు. ఇప్పుడ ఆయ‌న గురించే మేం చెప్ప‌బోయేది.

ravindra-koushik
1952, ఏప్రిల్ 11న రాజ‌స్థాన్‌లోని శ్రీ‌గంగాన‌గ‌ర్‌లో ర‌వీంద్ర కౌశిక్ జ‌న్మించారు. ఆయ‌న ఓ ప్ర‌ముఖ థియేట‌ర్ ఆర్టిస్ట్‌. నాట‌కాలు బాగా వేసేవారు. ఈ క్ర‌మంలోనే ల‌క్నోలో ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన ఓ నాటకాన్ని భార‌త ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు చూశారు. అనంత‌రం ర‌వీంద్ర‌ను వారు క‌లుసుకుని రా (RAW) ఆఫీస‌ర్‌గా ఉద్యోగం ఇస్తామ‌ని, అయితే అందుకు అత‌ను పాకిస్థాన్ వెళ్లి అండ‌ర్ క‌వ‌ర్ ఏజెంట్‌గా ప‌నిచేయాల‌ని వారు చెప్పారు. దేశానికి సేవ చేసే భాగ్యం ల‌భించినందుకు ర‌వీంద్ర పొంగిపోతూ వారికి స‌రే చెప్పాడు. దీంతో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వారు ర‌వీంద్ర‌కు ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను రెండేళ్ల పాటు ఇచ్చారు. ఉర్దూ రాయ‌డం, చ‌ద‌వ‌డం, అర్థం చేసుకోవ‌డం వంటి ముస్లింల‌కే అల‌వాటైన చాలా ప‌నుల్లో అతనికి ట్రెయినింగ్ ఇచ్చారు. చివ‌రికి అత‌న్ని ముస్లింగా మార్చి పేరును న‌బీ అహ్మ‌ద్ షాకిర్‌గా చేంజ్ చేశారు. అనంత‌రం అతన్ని 1975లో పాకిస్థాన్‌కు పంపారు.

పాకిస్థాన్‌లోకి అడుగు పెట్ట‌గానే ర‌వీంద్ర అక్క‌డి ఆర్మీ ఆఫీస్‌లోకి ఓ క్ల‌ర్క్‌గా వెళ్లి అక్క‌డి స‌మాచారాన్ని మొత్తం సేక‌రించ‌డం మొద‌లు పెట్టాడు. మిల‌ట‌రీలోనే ప‌నిచేస్తున్న ఓ అధికారి కూతుర్ని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు అమాన‌త్‌. వారికి ఓ కుమారుడు కూడా జ‌న్మించాడు. ఈ క్ర‌మంలో ర‌వీంద్ర ఎప్ప‌టిక‌ప్పుడు పాక్ స‌మాచారాన్నంతా భార‌త ఇంటెలిజెన్స్ అధికారుల‌కు చేర వేసే వాడు. అలా అత‌ను 1979 నుంచి 1983 వ‌ర‌కు పాక్‌లో చాలా కీల‌కంగా పనిచేశాడు. అయితే ఎప్పుడూ మన రోజులే ఉండ‌వు క‌దా, ర‌వీంద్ర గురించి అక్క‌డి ఇంటెలిజెన్స్ అధికారుల‌కు తెలిసిపోయింది. దీంతో అత‌న్ని అరెస్టు చేశారు. అనంత‌రం అత‌నికి 1985లో మ‌ర‌ణ శిక్ష ప‌డింది. కానీ ఆ శిక్ష‌ను పాకిస్థాన్ సుప్రీం కోర్టు జీవిత ఖైదుగా మార్చింది. ఈ క్ర‌మంలో ర‌వీంద్ర‌ను ప‌లు జైళ్ల‌కు మార్చారు. అయితే టీబీ, గుండె జ‌బ్బుల కార‌ణంగా అత‌ను ముల్తాన్ జైలులో 1999, జూలై 26న మృతి చెందాడు. ర‌వీంద్ర మృత‌దేహాన్ని జైలు వెనుక భాగంలో పూడ్చివేశారు. ర‌వీంద్ర కౌశిక్ క‌థ ఆధారంగా ఏక్ థా టైగ‌ర్ అనే సినిమాను కూడా తీశారు. ఏది ఏమైనా దేశానికి ఆయ‌న చేసిన సేవ‌ను మ‌రువలేం. ఆయ‌న్ను రియ‌ల్ హీరో అన‌కుండా ఉండ‌లేం..!

Comments

comments

Share this post

scroll to top