శ్రీమంతుడు సినిమా చూశాక అతడికి క్యాండీక్రష్ గేమ్ గుర్తొచ్చిందంట!

శ్రీమంతుడు సినిమా చూశాక చాలామందికి సొంతూరు గుర్తొచ్చి ఉంటుంది, ఊర్లో ఉంటే అమ్మా నాన్న గుర్తొచ్చి ఉంటారు. కానీ మన చంటిగాడికి మాత్రం అదేదో ఆట గుర్తొచ్చిందంట..దాని గురించి నేను చెప్పడం కంటే వాడినే చెప్పురా అంటే చాలా డీటైల్డ్ గా చెబుతాడు … అరి చంటీ సొల్లు రా సొల్లు నీ బాధేందో….  ఇక చంటిగాడి సొల్లుడు స్టార్ట్ అయ్యిందే….

హయ్…

నా పేరు చంటిగాడు.. నేను పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాను …కానీ నేను శ్రీమంతుడు సినిమా చూసినప్పటి నుండి నాకు క్యాండీ క్రష్ ఆట గుర్తొస్తుంది బ్రదర్… పాపం బుజ్జి ముండ ఎక్కుడుందో .. ఎమో అని… ప్లే స్టోర్ లోకి వెళ్లి సెర్చ్ చేసి మళ్లీ డౌన్ లోడ్ చేసుకున్న క్యాండీ క్రష్ గేమ్ ను.

అలా డౌన్ లోడ్ చేసి ఆడుతున్నానో లేదో… ఒక్క సారిగా గతం గుర్తొచ్చింది భయ్యా…! … మీతో ఆ గత జ్ఞాపకాలు పంచుకుంటా… వింటే వినండి లేకపోతే లేదు కాని తిట్టడం మాత్రం తూచ్….తూచ్..తూచ్…హచ్. కాస్త జలుబు కదా అలా తుమ్ము వచ్చింది లేండి.

ఈ ఫేస్ బుక్ కు ఏమైంది ఓ పక్క లైక్ లు, కామెంట్లు.. మరో పక్క క్యాండీ క్రష్ రిక్వెస్ట్ లు అంటూ ఈ క్యాండీ క్రష్ గేమ్ మీద అప్పట్లో జోకులే జోకులు పేలాయ్ కదా మీ గుర్తు ఉండే ఉంటుందిలెండి. .

క్యాండీ క్రష్ ను బ్యాన్ చేయాలి, రిక్వెస్ట్ చేసే వాడిని అన్ ఫ్రెండ్ చేసేయాలి అన్నంత కోపం వచ్చింది అప్పట్లో ఫేస్ బుక్ యూజర్స్ కి…..దీని కారణంగానే అన్ ఫ్రెండ్ అయిన వాళ్ల లిస్ట్ బాహుబలి కలెక్షన్స్ అంత పెద్దగా ఉంటుంది లెండి.

అంతెందుకు నిన్నటికి నిన్న కట్టప్ప బాహుబలిని చంపడానికి కారణం కూడా బాహుబలి కట్టప్ప కు క్యాండీ క్రష్ రిక్వెస్ట్ పంపాడని దాన్ని ఇన్సల్ట్ కూడా చేసారు కదా…!

సినిమా హాల్ బ్రేక్ లో అయినా, క్లాస్ రూమ్ లీజర్ పీరియడ్ లో అయినా, పెళ్లాం పక్కనున్నా…. పోరగాళ్ళు, ఇంటోళ్ళ ముని వేళ్లు మాత్రం.. క్యాండీ క్రష్ మీద అటు ఇటు ఆటాడేయి… అవునా కాదా.!

ఇంట్లో పిల్లవాడు ఏడుస్తుంటే ఇదిగో నాన్న నా స్మార్ట్ ఫోన్ తీసుకొని క్యాండీ క్రష్ గేమ్ ఆడుకో అని ఎంత మంది తండ్రులు తమ పిల్లలకు చెప్పలేదు….!

పెళ్లైన కొత్తలో పెళ్లాం ఊరెళితే… ఎంతమంది మొగుళ్లు ఈ క్యాండీక్రష్ తో నిద్రలేని రాత్రులు గడపలేదు..!

అంత ఘన చరిత్ర ఉన్న క్యాండీ క్రష్ గేమ్ ఇప్పుడు చాలా మొబైల్స్ నుండి డిలేట్ అయ్యింది. మళ్లీ ఈ మిల్క్ బాయ్ నేను కాదులేండి మహేష్ బాబు శ్రీమంతుడి వల్ల వెలుగులోకి వచ్చింది.

నిజం చెప్పాలంటే శ్రీమంతుడు సినిమా చూసిన తర్వాత చాలా మంది క్యాండీ క్రష్ గేమ్ ను డౌన్ లోడ్ చేసుకున్నారంట నాకు మల్లె…. బిజినెస్ డీలింగ్ లో అందరూ బిజీగా ఉంటే మహేష్ మాత్రం తన సెల్ లో క్యాండీ క్రష్ ఆడుకునే సన్నివేశం శ్రీమంతుడి సినిమాలో అందర్ని నవ్వించుంటుంది… కానీ నన్ను మాత్రం ఆలోచింపజేసింది.

MAHESH_BABU_2496823f

 

ఆయ్ అందుకే డౌన్ లోడ్ చేశా… క్యాండ్రీ క్రష్ తో నైట్ అవుట్ చేశా…! థాంక్యూ మిల్క్ బాయ్..

——————————-మీ చంటిగాడు—————————————–

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top